DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇంజనీరింగ్ విద్యార్థిని పై మహిళా ఎస్పీ కొడుకు, ఇతరుల ఘాతుకం

*స్నేహంతో వంచన, ఆపై సోషల్ మీడియా లో నగ్న వీడియో పోస్టింగ్*

*అంతా ప్రముఖుల పిల్లలే, అందుకేనా మీడియా ముందుకు రాలేదు?* 

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

*అమరావతి,  జూన్  30, 2020 (డిఎన్ఎస్):* రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇంజనీరింగ్‌ విద్యార్థినిపై అత్యాచారం, నగ్న వీడియోలు,

చిత్రాల కేసులో ప్రధాన నిందితుడు మహిళా ఎస్పీ తనయుడని, ఆయనతోపాటు మరికొందరు ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నారని గుంటూరు అర్బన్‌ ఎస్పీ ఆర్ ఎన్ అమ్మిరెడ్డి తెలిపారు. ప్రధాన నిందితుడిని అరెస్టు చేసినట్టు చెప్పారు. అయితే, మీడియా ముందు మాత్రం ప్రవేశ పెట్టలేదు. మూడేళ్ల కిందటే జరిగిన ఈ ఘాతుకం అనేక మలుపులు తిరిగింది. పోలీస్

అధికారుల విచారణ ప్రకారం జిల్లాకు చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థిని, ప్రధాన నిందితుడు వరుణ్‌ తేజ్‌లు స్నేహంగా ఉన్నారు. మూడేళ్ల కిందట ఓ రోజు.. స్నేహితురాలిని ఒంటరిగా రూమ్‌కు పిలిచిన వరుణ్‌తేజ్‌ ఆమెకు కూల్‌డ్రింకులో మత్తు మందు కలిపి ఇచ్చాడు.

విద్యార్థిని మత్తులోకి జారుకున్నాక ఆమెపై అత్యాచారం చేసి,

అనంతరం నగ్నంగా వీడియోలు, ఫొటోలు తీశాడు. వీటిని అడ్డు పెట్టుకొని చాలా కాలం ఆమెను బ్లాక్‌ మెయిల్‌ చేశాడు.

ఆ తర్వాత ఆమె వరుణ్‌ తేజ్‌కు దూరమైంది. అనంతరం, ఆమెకు ఆవుల కౌశిక్‌ అనే తన క్లాస్‌మెట్‌తో పరిచయం ఏర్పడింది. వారిద్దరూ కొంతకాలం కలసి తిరిగారు. ఈ విషయం తెలుసుకున్న వరుణ్‌తేజ్‌.. తన వద్ద ఉన్న నగ్న

చిత్రాలు, వీడియోలను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. వీటిని చూసిన కౌశిక్‌ ఆమెకు దూరమయ్యాడు. దీంతో విషయం తెలిసిన విద్యార్థిని.. కేసు పెట్టేందుకు సిద్ధమైంది. అయితే, గుంటూరుకు చెందిన రౌడీషీటర్‌ ప్రవేశించి పంచాయితీ చేసినట్టు తెలిసింది. పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని రౌడీషీటర్‌ హెచ్చరించడంతో విద్యార్థిని కుటుంబం

మౌనం పాటించింది. 
ఇటీవల ఆమె మరో యువకునికి సన్నిహితంగా మెలుగుతోందని భావించిన కౌశిక్‌.. తన దగ్గర ఉన్న వరుణ్‌ తేజ్‌ తీసిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు కొన్ని రోజుల కిందట పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారించిన పట్టాభిపురం పోలీసులు కేసును దిశ పోలీస్‌

స్టేషన్‌కు బదిలీ చేశారు. కాగా, ప్రధాన నిందితుడు వరుణ్‌ తేజ్‌ తల్లి ఎస్పీగా, తండ్రి ఏఎ్‌సఐగా పని చేస్తున్నారు. దీంతో కేసు దర్యాప్తుపై అత్యంత గోప్యం పాటిస్తున్నారు.

పక్కా ఆధారాలున్నాయి: అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి

ఈ మొత్తం వ్యవహారంపై డిజిటల్‌ ఆధారాలు ఉన్నాయని, వాటిని తప్పించడం కానీ, కేసును

నీరు గార్చడం కానీ సాధ్యం కాదని గుంటూరు అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి స్పష్టం చేశారు. నిందితులు ఎవరి పిల్లలు అయినప్పటికీ చట్టం దృష్టిలో సమానమేనన్నారు. అయితే, సాంకేతిక పరమైన ఆధారాలు సేకరించడానికి సమయం పట్టిందన్నారు. ఆయా వీడియోలను చివరిసారిగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన మూడో వ్యక్తిని గుర్తించేందుకు

దర్యాప్తు చేస్తున్నామన్నారు.

నిందితులు మీడియా ముందు హాజరులేదు..

సాధారణంగా ఇలాంటి కేసుల్లో నిందితులను పోలీసులు మీడియా ముందు హాజరుపరుస్తారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన వరుణ్‌తేజ్‌ను మీడియా ముందుకు హాజరుపర్చలేదు. నిందితులు ప్రముఖుల పిల్లలు కావటంతోనే పోలీసులపై ఒత్తిళ్లు వస్తున్నాయని,

అధికార పార్టీ నేతలు కూడా ఒత్తిడి చేస్తున్నారని, అందుకే పోలీసులు నిందితులను హాజరుపరచలేదని ఆరోపణలు వస్తున్నాయి. మరో నిందితుడు కౌశిక్‌ తల్లిదండ్రులు కూడా వైద్యులని తెలిసింది. కాగా నగ్న చిత్రాల కేసును ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని, ఇది దారుణ నేరమని, నిందితులు ఎంతటి వారైనా వదిలేది లేదని మహిళా కమిషన్‌

చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam