DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆలయ అభివృద్ధి చిరస్థాయిగా నిలిచే పనులు చేపడతాం

*అరసవల్లి ఆలయ నూతన పాలకమండలి సభ్యులు*

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, జూలై 03, 2020 (డిఎన్ఎస్):*

శ్రీకాకుళం, జూలై 3 : అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయ అభివృద్ధిలో భాగస్వాములవుతూనే, రెండేళ్లలో చిరస్థాయిగా నిలిచే పనులను చేపడతామని  ఆలయ ధర్మకర్తల

మండలి సభ్యులు మండవిల్లి రవి పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయ అనివెట్టి మండపంలో మండలి సభ్యులు పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండవిల్లి రవి మాట్లాడుతూ స్వామి వారి సేవ చేసే అవకాశం ఇన్నికోట్ల మందిలో సభ్యులైన మా ఎనిమిది మందికి లభించడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు.

మండలికి రెండేళ్ల వ్యవధి ఉందని, ఈ రెండేళ్లలో చిరస్థాయిగా నిలిచే పనులను చేపట్టి ఆలయ అభివృద్ధికి మావంతు కృషిచేస్తామని చెప్పారు. ఇందుకు కొన్ని కార్యాచరణ ప్రణాళికలను, ప్రతిపాదనలను సిద్ధం చేసామని, అందులో భాగంగా స్వామి వారి ఇంద్రపుష్కరిణిని అందంగా తీర్చిదిద్దేందుకు కృషిచేయనున్నట్లు తెలిపారు.  పుష్కరిణి క్రింద

టైల్సును వేసి అందంగా తీర్చిదిద్దుతామని,  అలాగే పుష్కరిణిలోని నీటిని ఎప్పటికపుడు బయటకు పంపి, మరలా తాజా నీటితో నింపేందుకు ప్రణాళికను సిద్ధం చేసామన్నారు. భక్తులు ఆనందంగా, ఆహ్లాదంగా స్నానమాచరించే విధంగా చర్యలు తీసుకోబోతున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన నిధులను శాసనసభ్యులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని

అన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు మరియు మండలి ఎక్స్ అఫీషియో మెంబర్ అయిన ఇప్పిలి శంకరశర్మ భక్తుల వసతి కొరకు నూతన గదుల నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించారని, ఇందుకు అరసవల్లిలో గల తనకు చెందిన 1.70 ఎకరాల భూమిని దేవాలయ అభివృద్ధికి ఇవ్వనున్నట్లు తెలిపారన్నారు. ప్రభుత్వ నిధులు మరియు దాతల సహకారంతో త్వరలోనే వాటిని

పూర్తిచేస్తామని చెప్పారు. ఇంద్రుని విగ్రహం ప్రతిష్టించేందుకు ఎప్పటినుండో అనుకుంటున్నామని, ఈ విషయమై దేవాదాయ శాఖ కమీషనర్ ను కూడా సంప్రదించడం జరిగిందని, ఈ రెండేళ్ల వ్యవధిలో ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తిచేస్తామని మండలి సభ్యులు మండవిల్లి రవి హామీ ఇచ్చారు. స్వామి వారి మకరతోరణం తయారీకి ఇప్పిలి శంకరశర్మ ప్రతిపాదనలు

సమర్పించగా, స్వామి వారి అనుగ్రహంతో సుమారు రూ.75 లక్షలతో కేవలం 15 రోజుల్లో దాన్ని పూర్తిచేసుకోగలిగామని వివరించారు. త్వరలో స్వామి వారికి మకరతోరణాన్ని అలంకరించడం జరుగుతుందని సభ్యులు స్పష్టం చేసారు. ఈ రెండేళ్లు అధికారం కోసం కాకుండా బాధ్యతగా పనిచేసి చిరస్థాయిగా నిలిచేపనులు చేసేందుకు సభ్యులు అందరం

నిర్ణయించుకున్నామని, ఆ దిశగా చర్యలు చేపడతామని తెలిపారు. తర్వాత కాలంలో వచ్చే ట్రస్ట్ సభ్యులు దీన్ని ఆదర్శంగా తీసుకునేలా మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడతామని వివరించారు.
    మరో సభ్యులు అంధవరపు రఘురాం మాట్లాడుతూ దైవసేవ చేసే అరుదైన అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. ఏ పదవి అయిన అధికారం, హక్కు

కాదని, బాధ్యత మాత్రమేనని రాజ్యాంగం తెలిపిందని గుర్తుచేసారు. దైవసన్నిధిలో సేవచేసే అదృష్టాన్ని ఈ రెండేళ్లపాటు పరిపూర్ణంగా ఉపయోగించు కుంటామని, పారదర్శకంగా, నిజాయితీతో కూడిన కార్యక్రమాలను చేపట్టేందుకు సభ్యులంతా సిద్ధంగా ఉన్నట్లు ఆయన స్పష్టం చేసారు. నరుడు సేవే నారాయణ సేవ అనేది ఆర్యోక్తి అని, వచ్చిన భక్తుల సంఖ్యను

పెంచే దిశగా, భక్తుల వసతి సదుపాయాలు, పరిసరాల పరిశుభ్రత, డార్మిటరీ, మరుగుదొడ్లు, మౌళికవసతుల కల్పన, స్వామి వారి సేవలు, విశేషపూజలు,  స్వామి వారి కార్యక్రమాల సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం,  స్వామి కార్యక్రమాలను వైభవోపేతంగా నిర్వహించడం వంటి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ రెండేళ్లు పది మందికి సేవ

చేసే అదృష్టం,అవకాశం కలిగించాలని స్వామివారిని వేడుకుంటున్నట్లు ఆయన వివరించారు. మరో సభ్యులు పైడి భవానీ, మండల మన్మధరావు, కింజరాపు గాయత్రి, యమజాల గాయత్రి తదితరులు పేర్కొన్నారు. 
    మండలి ఎక్స్ అఫీషియో మెంబర్ ఇప్పిలి శంకరశర్మ మాట్లాడుతూ ట్రస్ట్ మెంబరుగా లేని సమయంలోనే మండవిల్లి రవి రూ.1.50 లక్షలతో పుష్కరిణి వద్ద

ఇనుప గ్రిల్స్ ఏర్పాటుచేసారని, అలాగే సుమారు రూ.30 లక్షలతో క్యూలైన్లను దాతల సహాయంతో ఏర్పాటు చేయించారని చెప్పారు. ప్రస్తుతం ట్రస్ట్ బోర్డు ఆవిర్భవించడంతో దేవాలయ అభివృద్ధికి తోడ్పాటునందించాలని ఆకాంక్షించారు. స్వామి వారికి చెందిన ఆభరణాలు, బంగారు వస్తు సామాగ్రిని భక్తులు తిలకించేవిధంగా త్వరలో ఏర్పాట్లు

చేయనున్నట్లు ఆయన తెలిపారు. 
    ఈ సమావేశంలో ధర్మకర్తల మండలి ఛైర్మన్ ఇప్పిలి జోగి సన్యాసిరావు, సభ్యులు యమజాల గాయత్రి, కింజరాపు ఉమారాణి, భైరి రాజరాజేశ్వరి, జన్ని గౌతమి, పైడి భవాని, మండల మన్మథరావు తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam