DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోలీస్ కోఆపరేటివ్ సర్వసభ్య సమావేశంలో పలు తీర్మానాలు

DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)

శ్రీకాకుళం, జూలై 04, 2020 (డిఎన్ఎస్): శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా పోలీస్ కో-ఆపరేటివ్ జనరల్ బాడీ సమావేశం జరిగింది. శనివారం జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) పి. సోమశేఖర్ ఆధ్వర్యంలో కనీస దూరం పాటిస్తూ నిర్వహించిన ఈ

సమావేశంలో జిల్లా పోలీస్ కో-ఆపరేటివ్ సభ్యులు సంక్షేమము దృష్యా  పలు కీలక తీర్మానాలు చేస్తూ, ఆమోధించారు. 

సిబ్బంది ఆర్థిక అవసరాలు దృష్టిలో ఉంచుకొని, రుణాల యొక్క పరిధి పెంచుతూ, గతం కంటే వడ్డీ రేట్లు తగ్గించడం జరిగింది. సభ్యుల సర్వీసు అర్హత బట్టి రుణ పరిమితిని 5 లక్షల వరకు పెంచడం జరిగినది. ఈ సందర్భంగా అదనపు

ఎస్పీ(పరిపాలన) పి సోమశేఖర్ గారు మాట్లాడుతూ  జిల్లా పోలీసు సిబ్బంది సంక్షేమం భాగంగా జిల్లా యంత్రాంగం ఎప్పుడూ కూడా మీకు అండగా ఉంటామని ఆర్థిక అత్యవసర సమయంలో రుణాలు అవసరమైనప్పుడు నేరుగా కలసి, సిబ్బంది రుణాలు వాడు సందర్భంలో పోలీసు కో-ఆపరేటివ్ సంస్థ  సహాయ సహకారాలు అందిస్తామని,త్వరితగతిన రుణం పొందేటకు అవకాశం

ఉంటుందని తెలిపారు.

 అదేవిధంగా కరోనా వైరస్ ప్రభావం దృశ్య  జిల్లా పోలీస్ సిబ్బంది అందరూ తగు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ, వ్యక్తిగత రక్షణ కల్పించుకుంటూ  విధులు నిర్వహించాలని తగు సూచనలు చేసినారు. ఈ సమావేశంలో జిల్లా పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కెల్లి అప్పన్న, ట్రెజరర్ జగన్మోహన్ రావు ,స్టేట్ సెక్రటరీ

రాధాకృష్ణ, కో-ఆపరేటివ్ ఇన్చార్జి వెంకటేశ్వరరావు , జిల్లా పోలీసు కోపెరటివ్ సభ్యులు మరియు జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
       ఈ సమావేశంలో సిబ్బంది సంక్షేమం దృష్ట్యా జిల్లా పోలీసు అధికారులు తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తూ,  జిల్లా పోలీసు సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam