DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆ కాంప్లెక్ ను స్వాధీనం చేసుకోండి. . .: ఎండోమెంట్స్. .. ఆదేశం

*ఆక్రమణకు సహకరించిన దేవస్థాన సిబ్బందిపై చర్యలు తీసుకోండి.*

*ప్రక్కదారి పట్టిన సింహాచల దేవాలయ భూమిపై దేవాదాయ శాఖా ఆగ్రహం*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)* 

*విశాఖపట్నం, జూలై 05, 2020 (డిఎన్ఎస్):* సింహాచల దేవస్థానం కు చెందిన భూమిని ఆక్రమించి నిర్మించిన కమర్షియల్ కాంప్లెక్స్

ను తక్షణం స్వాధీన పరుచుకోమని సింహాచల దేవఃస్థానం ఈఓ కు దేవాదాయ శాఖా అదనపు కమిషనర్ రామచంద్ర మోహన్ పేరిట ఆదేశాలు జారీ అయ్యాయి.

విశాఖ కు చెందిన ఒక దిన పత్రికలో వచ్చిన ఒక వార్తకు స్పందనగా ఈ అంశంపై సంయుక్త కమిషనర్ ( ఎస్టేట్స్) జరిపిన విచారణ లో ఈ వాస్తవాలు తేలడంతో దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు

జారీచేశారు. దీన్ని 11 సంవత్సరాల కాలం లీజు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే యూనియన్ పనులకు ఇచ్చిన స్థలంలో వాణిజ్య సముదాయ నిర్మాణానికి పాల్పడడం చట్ట ప్రకారం తప్పు అని తెలిపారు. దీనికి సహకరించిన దేవస్థాన సిబ్బంది, యూనియన్ నాయకులపై చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. ఈ లీజు ను 28 -1 -2019 న ఇచ్చినట్టు తెలుస్తోంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam