DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రజలు, పోలీసులకు అండగా ఉంటాం: డిఐజి రంగారావు

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, జూలై 17, 2020 (డిఎన్ఎస్):* కరోనా మహమ్మారి పెరుగుతున్న తరుణంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని, భయపడవద్దని, అందరికీ అండగా ఉంటామని విశాఖపట్నం రేంజ్ డి.ఐ.జి ఎల్ కెవి రంగారావు భరోసా ఇచ్చారు. శుక్రవారం ఆయన శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో

భాగంగా  ముందుగా ఎచ్చెర్ల నందు  ఏఆర్ కార్యాలయంలో  పోలీస్ సంక్షేమ వైద్యశాల, పోలీస్ కమ్యూనిటీ హాల్ నందు 12 పడకల ప్రి క్వారంటేన్ సెంటర్ ను, పాత్రునివాలస లో గల టీడీకో(TIDCO) ఐసోలేషన్ వార్డులును, తండేవలస జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం (డీపీటీసీ) మరియు కాశిబుగ్గ పలాస జంట నగరాల్లో క్వారంటేన్ జోన్లును పరిశీలించారు. డిఐజి తో

పాటు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఐజి మాట్లాడుతూ  శ్రీకాకుళం ప్రజలు కరోనా గురించి అనవసరంగా ఆందోళన చెందవద్దుని కొన్ని జాగ్రత్తలు పాఠించడంతో కరోనాని నివారించవచ్చునని తెలిపారు.కరోనా వ్యాధి ఎవరుకి ఉంటుందో ఎవరికీ ఉండదో వెంటనే నిర్ధారించలేముని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మెలగాలని

అన్నారు.ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజా సమూహంలోకి ఎవరు అనవసరంగా బయటికి రాకుండా జాగ్రత్త వహిస్తే కొంత కాలంలో కరుణ వ్యాధి నుంచి బయట పడవచ్చునని, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించడం వలన మరియు ప్రజలందరూ ఇంటికి పరిమితం కావడం వలన ఈ కరుణ వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చు అని

అన్నారు.బయట ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి వచ్చినవారు ముఖ్యంగా కంటోన్మెంట్ జూన్ లో ఉన్న ప్రజలు నియమ నిబంధనలు పాటించకుండా బయట తిరిగితే అట్టి వారి గురించి పోలీసు శాఖ సమాచారం అందించాలని తెలియజేసాను.అదేవిధంగా కోవిడ్ 19 విధినిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బంది  వారందరూ స్వీయ రక్షణ జాగ్రత్తలు పాటిస్తూ విధులు నిర్వహించాలని

పోలీస్ సిబ్బంది ఎవరూ కూడా అధైర్యపడవద్దని,మనోధైర్యంతో ఉండి కరోనాను జయించాలని,ఒకవేలా ఎవరికైనా కరోనా వ్యాధి సంక్రమిస్తే వారికి మెరుగైన సదుపాయాలతో మంచి వైద్యం, అందించాలని జిల్లా ఎస్పీ గారుకి సూచించారు.అనంతరం ఈ కరోనా సమయంలో జిల్లా నుంచి ఇతర జిల్లాల్లో విధులు నిర్వహించకుని  జిల్లా కు వచ్చినా సిబ్బందికి డి పి టి సి

నందు ఉంచి వారికి కరోనా నమూనా పరీక్షలు చేయించినా అనంతరం ఫలితాలు వచ్చిన తర్వాత విధులలోకి తీసుకోవాలని, అప్పటివరకు అలాంటి వారి కోసం మెరుగైన వసతి,భోజనం  తాగునీరు మరియు ఇతర సౌకర్యాలను ఏర్పరిచి, పరిసరా ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేటట్లు చూడాలని  డి.పి.టి.సి.  డిఎస్పి కి ఆదేశాలు ఇచ్చారు.


కార్యక్రమంలోజిల్లా అదనపు ఎస్పీ పి. సోమశేఖర్ (పరిపాలన), కాశీబుగ్గ డిఎస్పీ శివరమిరెడ్డి, ఏ ఆర్ డీఎస్పీ ఎన్.ఎస్.ఎస్ శేఖర్, సంబంధిత పోలీస్ స్టేషన్ సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam