DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గంటా శ్రీనివాస్ పార్టీ మార్పు కేవలం ఊహాగానమే. . .

ప్రతికూల పరిస్థితిలో పార్టీ మార్పు నష్టమని తెలుసు. .

ఢిల్లీ పెద్దల ఆమోదం లేకుంటే. . అడుగు బయటే పెట్టరు. 

ప్రజల్లో క్యాడర్ కు పెద్ద విలువ లేదు, గంటా వెళ్లిన అదే స్థితి . .

సీఎం ను కలవాలంటే ఎమ్మెల్యేలే ఏడాది ఆగాల్సిన స్థితి పార్టీది

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్,

విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జూలై 23, 2020 (డిఎన్ఎస్):* తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే గా ఉన్న విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి మారతారంటూ వస్తున్నా వార్తలు కేవలం ఊహాగానాలు గానే కనపడుతున్నాయి. గంటా పార్టీ మారాలి అంటే ఆచి తూచి అడుగులు వేస్తుంటారు.

తనకు, తన వెనుక అనుచరులకు ఉపయోగం లేనిదే ఆయన నోటి వెంట ఒక్క మాట కూడా రాదు అన్నది వాస్తవం. 

గత ఏడాది ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం వైఎస్సార్ కాంగ్రెస్ హవా నడిచిన సమయంలో సైతం తెలుగుదేశం అభ్యర్థిగా ఆయన ఘనవిజయం సాధించారు. ఈ గెలుపు వెనుక ఆయన, ఆయన అనుచరగణం ఆచి తూచి వేసిన ఒక్కో అడుగే కారణం. 

ప్రస్తుతం

అధికార పార్టీ పరిస్థితుల్లో పెను మార్పులు రావడం కూడా ఈయన మరకపోవడానికి ఒక కారణం. అధికార పార్టీ ఎంపీగా ఉన్న అత్యంత బలమైన నాయకుడు కనుమూరి రఘురామకృష్ణంరాజు  బహిరంగంగానే పార్టీ పై చేసిన విమర్శలు, పెను దుమారాన్నే లేపాయి. వీటికి అదనంగా పార్టీ గ్రామా స్థాయి క్యాడర్ కు ప్రజల్లో ఏమాత్రం విలువ లేకుండా, గ్రామా వాలంటీర్

వ్యవస్థను రంగంలోకి దించారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఏ పని కావాలన్నా నేరుగా వాలంటీర్ ను అడుగుతున్నారు తప్ప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ను ఎవ్వరూ కలవడం లేదు. ఒకవేళ కలిసిన క్యాడర్ కు ప్రభుత్వ శాఖల నుంచి పని చేయించుకోవడం చేతగాని పనిగా మిగిలిపోయింది. 

ఎమ్మెల్యేలకే  తిప్పలు తప్పడం లేదు. .

.

ముఖ్యమంత్రి ని కలవాలంటే ఆ పార్టీ ఎమ్మెల్యే లకే తిప్పలు తప్పడం లేదు. కనీసం  అప్పాయింట్మెంట్ కావాలంటే కూడా నెలల తరబడి వేచి చూడవలసిన గతి పట్టింది. ఆఖరికి ఎమ్మెల్యేలు కొన్నిచోట్ల తమ కార్యాలయాలకు కూడా రావడం మానివేశారు. ప్రభుత్వ అధికారులతో ఏ పని చేయించుకోవాలన్నా సీఎం పేషీ నుంచి ఆదేశాలు లేనిదే ఒక్క కాయితం

కూడా కదలని స్థితి. 

మంత్రుల స్థితి కూడా ఇంచుమించుగా అలాగే ఉంది, అయితే ఎవ్వరూ బయట పడడం లేదు. ప్రస్తుత పార్టీ తీరు పట్ల నేతలు, కార్యకర్తల్లో కూడా నైరాశ్యం పూర్తిగా నెలకొంది. 

ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో కడుపు లో నీళ్లు చల్లగా ఉన్న తెలుగుదేశం పార్టీ లో నుంచి గంటా శ్రీనివాస రావు పార్టీ మారితే పెద్ద

గా ఒరిగేది ఏమీ లేదు. పైగా తన అనుచర గణం తో సైతం మాటలు పడవలసిన గతి వచ్చేస్తుంది. ప్రస్తుతం ప్రతిపక్షం కదా అని తప్పించుకునే అవకాశం ఉంది. పార్టీ మారితే ఆ అవకాశం కూడా కోల్పోతారు. 

ఢిల్లీ పెద్దల ఆమోదం లేకుంటే. . 

గంటా శ్రీనివాస రావు ప్రజాప్రతినిధి కాకముందు నుంచే పారిశ్రామికవేత్త. ఆయనకు ఢిల్లీ

స్థాయిలో బలమైన సన్నిహిత సహచర కోటరీ ఉంది. వారితో చర్చించకుండా, వారి సూచనలు లేకుండా గంటా శ్రీనివాస రావు ఇంటి నుంచి అడుగు కూడా బయట పెట్టారు అని అనుచరులే చెప్తుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈయన పార్టీ మారాలన్నా కూడా వారి సమీకరణాలు కలిసి రావాలి. వారి లెక్కల ప్రకారం ఒకవేళ వైఎస్ జగన్ కు బెయిల్ రద్దు చేయడం జరిగితే, పార్టీ

పగ్గాలు ఎవరి చేతికి వెళతాయో తెలియని స్థితి. వచ్చే వారు గంట తో వ్యవహరించే తీరు లో తేడా వస్తే మొత్తానికే మోసం వస్తుంది. అయినా కేంద్రం లో అధికారం లో ఉన్న పార్టీ తో సైతం ఈ కోటరీ కి సత్సంబంధాలు ఉండడంతో గంటను ఇప్పట్లో పార్టీ మారే ఆలోచన నుంచి నిలుపుదల చేసే అవకాశం ఉంది. 

దీనికి అదనంగా గంటా పార్టీ మారితే మంత్రి

పదవి ఇవ్వడంతో పాటు, ఆయనకు ప్రత్యేక స్వతంత్ర హోదా పార్టీ లో ఇవ్వాలి అన్నది ప్రధానమైన డిమాండ్. అయితే మంత్రి పదవి ఇవ్వాలంటే కొత్తగా సృష్టించే అవకాశం లేదు, జిల్లా లో ఉన్న ఏకైక మంత్రి పదవి భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాస రావు. ఆయన్ను తప్పించి, ఆ స్థానంలో గంటాకు అవకాశం ఇవ్వాలి. పార్టీలో ఇదే విషయంపై చర్చ

జరుగుతున్నా కారణంగానే గత కొంత కాలంగా ముత్తంశెట్టి అవసరం ఉన్నా, లేకున్నా గంటా పై అనవసరపు విమర్శలు చేశారు. రేపే గంటా అరెస్ట్ అనే విషయం మీడియా ముఖంగానే వ్యాఖ్యానించడం ఆయన అసహనాన్ని బయట పెట్టింది. 

అయితే గంటా వైఖరి తెలిసిన వారు ఆయన పార్టీ మారే అవకాశాలు లేవనే చెప్తారు. అనుకూల పరిస్థితులు ఉంటేనే అడుగు బయట

పెట్టడానికి పది సార్లు ఆలోంచించే గంటా, ప్రస్తుత ప్రతి కూల పరిస్థితుల్లో కాలు కాదు కదా కాలి గోరు కూడా బయట పెట్టారు, ప్రస్తుతం మీడియా లో వచ్చే కధనాలు కేవలం ఊహాగానాలే అని కొట్టి పారేస్తున్నారు.

గత మూడు దశాబ్దాల రాజకీయ చరిత్రలో వివాద రహితునిగా ఉన్న గంటా శ్రీనివాస రావు, ప్రత్యర్థులపై ఏనాడు వ్యక్తిగత విమర్శలు

చేసిన దాఖలాలు లేవు. ప్రత్యర్ధులు ఘాటు విమర్శలు చేసిన, వాటిపై స్పందించడం తన విలువను తక్కువ చేసుకున్నట్టే అంటారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam