DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోలీస్ సిబ్బంది ఆరోగ్యం పై ఎస్పీ అమిత్ వీడియో లో సమావేశం

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, జూలై 25, 2020 (డిఎన్ఎస్):*  శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ శనివారం  జిల్లా పోలీసు కార్యాలయంలో కరోనా భారిన పడ్డ  పోలీసు సిబ్బంది తో వీడియో కాన్ఫెరెన్సు  నిర్వహించి వారి ఆరోగ్య క్షేమలు గురించి తెలిసికున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ నందు

జిల్లా  పోలీసు యూనిట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్. ఎమ్. జె ప్రసన్న కుమార్, సిబ్బంది తో పాటు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ ఈ వీడియో కాన్ఫరెన్స్ నందు జిల్లాలో గల జేమ్స్ హాస్పిటల్, టీడీకో సెంటర్ మరియు హోమ్ ఐసోలోషన్ లో ఉండి చికిత్స పొందుతూన్న సిబ్బంది ప్రతి ఒక్కరుతో మాట్లాడుతూ వారి యోగక్షేమాలను, వారికి అందిస్తున్న చికిత్స

కోసం మరియు భోజన, వసతి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఎవరికైనా వ్యాధి తీవ్రతా ఎక్కువగా వున్నప్పుడు కావాల్సిన మందులు,సలహాలు తక్షణమే అందించాలిని  సంబంధిత డాక్టర్ ని ఆదేశించారు . 

ఈ కాన్ఫెరెన్సులో  జిల్లా ఎస్పీ సిబ్బంది తో మాట్లాడుతూ,  సిబ్బంది కుటుంబ సభ్యులుకు ఎవరికైనా అనుమాన్పు

లక్షణాలు జ్వరం,దగ్గు, జలుబు మెదలుగునవి ఉంటే వెంటనే తెలియజేయాలని అలాంటి వారికి తక్షణమే నమూనాలు సేకరంచి పరీక్షలు నిర్వహించే చర్యలు తీసుకోవాలని ఆదనపు ఎస్పీ పి సోమశేఖర్ ను ఆదేశించారు,సిబ్బంది అందరూ మీకు మీ కుటుంబ సభ్యులుకు ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నా  వెంటనే యూనిట్ డాక్టర్ గారుని సంప్రదించాలని, సిబ్బంది ఎవరూ మానసిక

ఒత్తిడికి గురికాకుండా ప్రతి రోజు యోగ, వ్యామయం,శ్వాసకోశ వ్యామయం, మంచి పోషకాహారం తీసుకుంటు మనో దైర్యంగా ఉంటూ తోరగా కొలుకోవలని ఎస్పీ గారు తెలియజేసినారు. ఈ కాన్ఫెరెన్సు నందు పాల్గొన్న సిబ్బంది హర్షం వ్యక్తపరిచారు.ఈ కార్యక్రమంలో ఆదనపు ఎస్పీ పి  సోమశేఖర్ పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam