DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆగస్టు, సెప్టెంబరుల్లో వైయస్సార్‌ చేయూత, వైయస్సార్‌ ఆసరా

*ఈ రెండు పథకాలతో కోటి మంది మహిళలకు పైగా లబ్ధి* 

*అమూల్‌ తరహాలో భారీ కంపెనీలతో అవగాహన ఒప్పందాలు*

*రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో సీఎం వైఎస్ జగన్* 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 29, 2020 (డిఎన్ఎస్):*  ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వైయస్సార్‌

చేయూత, వైయస్సార్‌ ఆసరా పథకాలు ప్రారంభించనున్నట్లు సీఎం వైయస్‌ జగన్‌ వెల్లడించారు. సీఎం  వైయస్‌ జగన్‌ అధ్యక్షతన సీఎం క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన  
211 వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, సీఎస్‌ నీలం సాహ్ని, పలు శాఖల ఉన్నతాధికారులు, వివిధ బ్యాంకుల

ప్రతినిధులు హాజరు అయ్యారు. 

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని 45–60 ఏళ్ల మధ్య అర్హత ఉన్న మహిళలకు వైయస్సార్‌ చేయూత ద్వారా ఏటా రూ.18,750లు చొప్పున నాలుగు సంవత్సరాలు అందిస్తామని ఆయన తెలిపారు. అలాగే 90 లక్షలకుపైగా ఉన్న డ్వాక్రా  మహిళలకు వైయస్సార్‌ ఆసరాతో అండగా నిలుస్తామని చెప్పారు. ఈ రెండు పథకాల కోసం ఏడాదికి

దాదాపు రూ.11 వేల కోట్లు ఖర్చు చేస్తామని సీఎం వైయస్‌ జగన్‌ వెల్లడించారు.
    ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయం మహిళా సాధికారితలో మైలు రాయి కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. మహిళల జీవితాలను మార్చడానికి ఈ సహాయం ఉపయోగపడాలని, దీని కోసం బ్యాంకర్లు ముందుకు రావాలని కోరారు. పాడి పరిశ్రామిభివృద్ధికి అమూల్‌ తరహాలోనే

మరికొన్ని కంపెనీలతో కీలక అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు సీఎం వెల్లడించారు.

సమావేశంలో సీఎం ఏమన్నారంటే...:

ఈ  క్లిష్ట పరిస్థితుల్లో బ్యాంకర్లు ఏపీకి సహకరిస్తున్నారు. సున్నా వడ్డీ పంట రుణాలకు సంబంధించి రైతుల ఖాతాల వివరాలను పంపాలని కోరుతున్నాను:

గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను

చెల్లించాం:

ఈ ఏడాదికి సంబంధించినవి కూడా (2019–20) రైతులకు చెల్లించాల్సిన  సున్నా వడ్డీని చెల్లిస్తాం:
రైతుల ఖాతాలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలి:
ప్రభుత్వం ఒక పథకం ప్రారంభించింది అంటే.. దాని మీద విశ్వాసం, నమ్మకం కలగాలి:
దీన్ని అమలు చేయకుంటే.. ప్రజలు బాగా ఇబ్బంది పడతారు:
మేం చెప్పిన దానికి కట్టుబడి

ఉన్నాం, చెప్పిన ప్రకారం అన్నీ నెరవేరుస్తున్నాం:
ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో మహిళల సాధికారిత దిశగా రెండు పథకాలను ప్రారంభిస్తున్నాం:
25 లక్షల మహిళలకు వైయస్సార్‌ చేయూత అందిస్తున్నాం:
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో 45–60 ఏళ్ల మధ్య అర్హత ఉన్న మహిళలకు ఆర్థిక సహాయం చేస్తున్నాం:
ఈ సహాయం ద్వారా వారి జీవితాల్లో

మార్పులు తీసుకువచ్చే దిశగా చర్యలు చేపడుతున్నాం:
నాలుగేళ్ల పాటు, ఏడాదికి రూ.18,750 చొప్పున లబ్ధిదారు అయిన మహిళకు ఇస్తాం:
వారి జీవితాలను మార్చడానికి ఈ డబ్బు వినియోగపడాలి:
పాడి పరిశ్రమాభివృద్ధికి అమూల్‌తో ఒప్పందం చేసుకున్నాం:
రానున్న రోజుల్లో మరిన్ని ప్రఖ్యాత కంపెనీలతో ఒప్పందాలు చేసుకోబోతున్నాం:


కంపెనీలు, బ్యాంకుల సహాయంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను మార్చడానికి ప్రయత్నిస్తున్నాం:
సెప్టెంబరులో కూడా స్వయం సహాయక సంఘాలకు రూ.6,700 కోట్లకు పైగా ఇవ్వబోతున్నాం:
మొత్తమ్మీద ఏటా రూ.11 వేల కోట్ల చొప్పన, నాలుగేళ్ల పాటు ఈ రెండు పథకాలకు ఖర్చు చేస్తున్నాం:
90 లక్షల మందికిపైగా స్వయం సహాయక సంఘాల మహిళలకు వైయస్సార్‌ ఆసరా,

చేయూత కింద మరో 25 లక్షలమంది మహిళలు.. మొత్తంగా కోటి మందికి పైగా సహాయం లభిస్తుంది:
ఈ కంపెనీలు, బ్యాంకర్లు ఒక తాటిమీదకు వచ్చి... ఈ మహిళలకు ఆదాయాలను తెచ్చే కార్యక్రమాలను చేపట్టాలి:
గ్రామాల్లో మెరుగైన ఆర్థిక వ్యవస్థలను తీసుకురావడానికి ఈ కార్యక్రమాలు ఉపయోడపడతాయి:

కోవిడ్‌ నివారణా చర్యలను పగడ్బందీగా

చేస్తున్నాం:
రోజుకు 50 వేలకు పైగా పరీక్షలు చేస్తున్నాం:
దేశంలోనే ఇది అత్యధికం:
ప్రతి మిలియన్‌కు 32 వేల మందికిపైగా పరీక్షలు చేస్తున్నాం:
క్లస్టర్‌ ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టి 90 శాతానికి పైగా పరీక్షలు చేస్తున్నాం: సీఎం.
    
    రైతులు, మహిళలు, ప్రజారోగ్యంకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం

ఇస్తుందని డిప్యూటీ సీఎం, రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ తెలిపారు. వాటితో పాటు, అన్ని వర్గాల వారికి ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు బ్యాంకర్లు పూర్తి సహాయ, సహకారాలు అందించాలని ఆయన కోరారు.

సుబ్రతో దాస్, రీజినల్‌

డైరెక్టర్, ఆర్బీఐ, హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా:
– నగదు కోసం  ప్రజలు బ్యాంకులకు రావాల్సిన అవసరం లేదు. అన్ని ఏటీఎం కేంద్రాల్లో అవసరాల మేరకు నగదును ఉంచాలి. దీని వల్ల భౌతిక దూరం పాటించడానికి చాలా ఉపయోగపడుతుంది. తప్పనిసరి అయితేనే బ్యాంకులకు రావాలి. అలాగే కడప జిల్లాలో పూర్తిస్థాయి

డిజిటలైజేషన్‌ను స్వయంగా పర్యవేక్షిస్తున్నాం. 

ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్, బ్యాంక్‌ యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఫీల్డ్‌ జనరల్‌ మేనేజర్‌ వి.బ్రహ్మానందరెడ్డి, నాబార్డ్‌ సీజీఎం సుధీర్‌కుమార్‌ సమావేశంలో పాల్గొనగా, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా యూనియన్‌ బ్యాంక్‌ఆఫ్‌ ఇండియా

ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ దినేశ్‌కుమార్‌ గార్డ్, ఆర్బీఐ రీజినల్‌ డైరెక్టర్‌ సుబ్రతాదాస్‌ తదితరులు హాజరయ్యారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam