DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏలూరు లో మందుల దుకాణాలపై విస్తృత తనిఖీలు

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 10, 2020 (డిఎన్ఎస్):* పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పి కె.నారాయణ్ నాయక్ యొక్క ఆదేశాలపై  జిల్లా ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పి కరీముల్లా, అసిస్టెంట్ కమిషనర్ ఎం జయ రాజు మరియు డ్రగ్ ఇన్స్పెక్టర్ తో  ఏలూరు లో  ఉన్న మందుల దుకాణాలు, ఏజెన్సీల రికార్డుల

పరిశీలన శానిటైజర్ల వినియోగంపై కొనసాగుతోన్న స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. 

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరంలోని మందుల దుకాణాలలో శానిటైజర్ నిల్వలు అమ్మకాల పై ఆకస్మికంగా తనిఖీ చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పి కరీముల్లా షరీఫ్ మరియు డ్రగ్ ఇన్స్పెక్టర్ ల తో తనిఖీ లు నిర్వహిం చినరూ. ఈ

సందర్భముగా అదనపు ఎస్పి గారు మాట్లాడుతూ  శానిటైజర్ల వినియోగంపై స్పెషల్ డ్రైవ్ ను  సెబ్ & జిల్లా పోలీసులు, డ్రగ్ కంట్రోల్ విభాగాలు సంయుక్తంగా తనిఖీ కార్యక్రమము లు నిర్వహించినారు. ఈ సందర్భముగా అదనపు ఎస్పి మాట్లాడుతూ  అమాయక ప్రజల ప్రాణాలుతో చెలగాటమాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అన్ని మందుల దుకాణాలు,

ఏజెన్సీల లో  రికార్డుల పరిశీలించారు. శానిటైజర్ల క్రయ, విక్రయాలకు సంబంధించి రికార్డులు తప్పనిసరిగా మెయింటెన్ చేయాలని సూచించారు. కొనుగోలు చేసే వ్యక్తి శానిటైజర్ ను ఎందుకు తీసికెళ్తున్నాడో పసిగట్టాలని... ఒక వ్యక్తికే ఎక్కువ మొత్తంలో విక్రయించరాదని, ఒకవేళ అధిక మొత్తంలో ఎవరైనా అడిగితే వెంటనే తమ దృష్టికి

తీసుకురావాలని తెలియజేస్తుశారు. అనధికారికంగా శానిటైజర్లు తయారు చేసినా... విక్రయించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీ లలో ఇతర అధికారులు కలసి మందుల షాప్ లను తనిఖీ లు చేసినారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam