DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆగ్రో ఉత్పత్తుల ఎగుమతులను విస్తృతంగా ప్రోత్సహించాలి: విజయసాయి

*స్థాయీ సంఘం సిఫార్సులను ప్రభుత్వానికి అందించిన కమిటీ* 

*ఉపరాష్ట్రపతి వెంకయ్యకు వివరించిన చైర్మన్ విజయసాయి రెడ్డి*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  ఆగస్టు 26, 2020 (డిఎన్ఎస్):* దేశంలో వివిధ వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులతో పోలిస్తే ఎగుమతులు నామమాత్రంగానే

ఉన్నాయని, వీటిని విస్తృతంగా పెంపొందించాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం (వాణిజ్యం) చైర్మన్ వి. విజయ సాయిరెడ్డి తెలియచేసారు. దేశ రాజధానిలో ఈ సంఘం నివేదికలను భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడుకు వివరించారు. అనంతరం విషయాలను మీడియా కు తెలియచేసారు. 
 
దేశం నుంచి ఎగుమతి అయ్యే సరుకులతో పోల్చుకుంటే వ్యవసాయ ఉత్పత్తుల

ఎగుమతి సగటున 1 శాతం కూడా ఉండటం లేదని వాణిజ్యానికి సంబంధించిన పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదికలో వెల్లడైంది. వ్యవసాయోత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించాల్సిన తక్షణ అవసరం ఉన్నట్లు కమిటీ అభిప్రాయపడింది. అందుకోసం తీసుకోవలసిన చర్యలను వివరిస్తూ స్థాయీ సంఘం 154వ నివేదికలో ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

వ్యవసాయ,

మత్స్య, ప్లాంటేషన్, కొబ్బరిపీచు, పసుపు ఉత్పాదనల ఎగుమతులపై స్థాయీ సంఘం జరిపిన అధ్యయనం, సిఫార్సులకు సంబంధించిన 154వ నివేదికను బుధవారం ఢిల్లీలో స్థాయీ సంఘం చైర్మన్ శ్రీ వి.విజయసాయి రెడ్డి రాజ్యసభ చైర్మన్ శ్రీ ఎం. వెంకయ్యనాయుడుకు సమర్పించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ, మత్స్య ఉత్పాదనల

ఎగుమతుల ప్రోత్సాహానికి నివేదికలో స్థాయీ సంఘం ప్రభుత్వానికి చేసిన కొన్ని ప్రధానమైన సిఫార్సులను వివరించారు.
వ్యవసాయోత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించేందుకు వాణిజ్య మంత్రిత్వ శాఖ తక్షణమే నడుం బిగించాలి. వ్యవసాయోత్పత్తుల సప్లై చైన్ సామర్థ్యాన్ని పటిష్టం చేయాలి. మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలి.

వ్యవసాయోత్పత్తలకు అత్యధిక విలువ చేకూరేలా చర్యలు తీసుకోవాలని కమిటీ సిఫార్సు చేసినట్లు చైర్మన్ తెలిపారు. శాస్త్రీయ పద్దతుల ద్వారా రైతులు నాణ్యమైన వ్యవసాయ ఉత్పాదనలు సాధించేందుకు ప్రభుత్వం వారికి తగిన మద్దతు, ప్రోత్సహకాలను అందించడం ద్వారా వ్యవసాయోత్పత్తుల ఎగుమతులను గణనీయంగా వృద్ధి చేయవచ్చునని కమిటీ సిఫార్సు

చేసింది. ఈజిప్టు, మెక్సికో, మలేషియా, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు బియ్యం ఎగుమతుల కోసం కొత్త మార్కెట్ల అన్వేషణ చేపట్టాలి.
మత్స్య ఉత్పాదనల ఎగుమతులపై దృష్టి సారించాలి...
2010-11 నుంచి 2014-15 వరకు మత్స్య ఉత్పాదనల ఎగుమతులలో కనిపించిన వృద్ధి 2015-16 నుంచి క్షీణించడం మొదలైంది. ఈ పరిస్థితిని అధిగమించి తిరిగి మత్స్య

ఉత్పాదనల ఎగుమతులలో వృద్ధి సాధించడానికి కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. చేపలు, రొయ్యల సాగులో మితిమీరిన యాంటీబయాటిక్స్ వినియోగాన్ని ఆరికట్టేందుకు శాఖా పరమైన నియంత్రణ, పాలన ఉండేలా చర్యలు తీసుకోవాలి. రైతులు యాంటీబయాటిక్స్‌ను నియంత్రిత రీతిలో వినియోగించేందుకు అవసరమైన ఎక్స్‌టెన్షన్‌ సేవలను ప్రభుత్వ

పర్యవేక్షణలో రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని కమిటీ సిఫార్సు చేసింది. మత్స్య ఉత్పాదనల నాణ్యత, దిగుబడులే లక్ష్యంగా పరిశోధన, అభివృద్ధి చేపట్టాలి. టూనా చేపల ఎగుమతికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్‌ దృష్ట్యా మత్స్య ఉత్పాదనల ఎగుమతులలో టూనా చేపల వాటా పెంచడానికి చర్యలు తీసుకోవాలని వాణిజ్య మంత్రిత్వ శాఖకు కమిటీ

సిఫార్సు చేసింది. టూనా చేపల సాగు, ఎగుమతిని ప్రోత్సహించడానికి సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ టెక్నాలజీతో సంప్రదింపులు జరిపి తగిన పథకాన్ని రూపొందించాలని కమిటీ సూచించింది.
పొగాకు సాగులో ఎఫ్‌డీఐని అనుమతించాలి...
దేశంలో ఏటా 800 మిలియన్‌ కిలోల పొగాకు ఉత్పత్తి అవుతోంది. ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక పొగాకు

సాగులో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాయి. పొగాకు ఉత్పాదనల ద్వారా ఏటా (2018-19 గణాంకాల ప్రకారం) సుమారు 6 వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఆర్జించడం జరుగుతోంది. కానీ పొగాకు సాగుకు మాత్రం తగినంత ప్రోత్సాహం అందడం లేదని కమిటీ అభిప్రాయపడింది.  పొగాకు పరిశోధనకు అరకొర నిధుల కేటాయింపు కారణంగా ప్రపంచ మార్కెట్లలో దేశీయ పొగాకు

ఉత్పాదనలు పోటీకి నిలవలేకపోతున్నాయి. ప్రపంచ ప్రమాణాలకు దీటుగా పొగాకు పండించడానికి పర్యావరణ ప్రతికూలతలను తట్టుకోగల అత్యత్తుమ నాణ్యత, అధిక దిగుబడి సాధించగల వెరైటీలను సాగు చేయడానికి పొగాకు పరిశోధన ఎంతగానో తోడ్పడుతుందని కమిటీ నివేదికలో పేర్కొంది. అందుకు పొగాకు పరిశోధనకు అవసరమైన నిధుల కేటాయింపు జరగాలి.
2017లో

ప్రకటించిన ఎఫ్‌డీఏ విధానం ద్వారా కాఫీ, టీ, రబ్బర్‌, యాలకులు వంటి ప్లాంటేషన్ పంటల సాగులో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం కల్పించారు. కానీ పొగాకు పంటకు ఆ వెసులుబాటు లేదు. కాబట్టి పొగాకు సాగులో కూడా ఎఫ్‌డీఐకి అనుమతించాలని కమిటీ సిఫార్సు చేసింది. అయితే ఎఫ్‌డీఐ ద్వారా సాగు చేసే పొగాకును ఆక్షన్‌

ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా మాత్రమే మార్కెట్‌ చేయాలన్న నిబంధన ఉండాలని సిఫార్సుల్లో పేర్కొంది. సిగరెట్ల అమ్మకాలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ 1 శాతం సుంకం విధించి ఆ మొత్తాన్ని పొగాకు మార్కెట్ స్థిరీకరణ కోసం వినియోగించాలన్న టుబాకో బోర్డు సూచనను కమిటీ ప్రశంసిస్తూ ఈ దిశగా చర్యలు తీసుకోవలసిందిగా వాణిజ్య మంత్రిత్వ శాఖకు

సిఫార్సు చేసినట్లు శ్రీ విజయసాయి రెడ్డి తెలిపారు. దీని వలన మార్కెట్ సంక్షోభ పరిస్థితులలో రైతుల ఉత్పత్తులకు న్యాయమైన ధర లభిస్తుందని ఆయన చెప్పారు.
దేశంలో ప్రస్తుతం నెలకొన్న కరోనా మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రజల ఆరోగ్య పరిరక్షణ అన్నింటికంటే ప్రధానమైంది. అందువలన ఎగుమతి కోసం సాగు చేసే పొగాకు పంటలకు

మాత్రమే ఎఫ్‌డీఐ సౌకర్యం కల్పించాలని కమిటీ సిఫార్సు చేసినట్లు ఆయన తెలిపారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam