DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అమరావతి రాజధాని అల్టిమేటం గా ఎన్నికలకు వెల్దామా?

*నర్సాపురం రాజు సవాల్‍ కు తోకముడిచిన ఎమ్మెల్యేలు, మంత్రులు*

*(DNS report : Raja P, బ్యూరో, అమరావతి)*

*అమరావతి, September 12, 2020 (DNS):*  తేనె తుట్టును తడితే.. తట్టుకోవచ్చు.. కందిరీగ తుట్టును తడితే చాలా ప్రమాదమని అందరికీ తెలుసు. కానీ ఆర్‍ఆర్‍ఆర్‍ అనే కందిరీగ తుట్టును అమాత్యులు, అధికార ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ

నేతలు తడుతున్నారు. అందుకు మూల్యం చెల్లించుకుంటున్నారు. ఇప్పటికైనా తమకు కానీ విషయాలపై స్పందిస్తే.. కందిరీగ తుట్టును కదిలించినట్లే అని అనుభవంతో కానీ తెలిసిరావటం లేదు. నిర్వహిస్తున్న శాఖలను సమర్దవంతంగా, నిజాయితీగా బాధ్యతలు నిర్వహించలేక.. అసమర్దులుగా పేరు తెచ్చుకుంటున్నకొంతమంది మంత్రులు సిఎం ప్రాపకం కోసం మాజీ

ముఖ్యమంత్రి చంద్రబాబుపై, నరసాపూర్‍ ఎంపీ కనుమూరి రామకృష్ణంరాజుపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబుపై ఏమేమి చేసినా.. ఆయన మౌనం వహిస్తారు. టిడిపి నేతలు కూడా పట్టి పట్టనట్లు ఉంటారు. కానీ ఎంపీ రఘురాంకృష్ణంరాజుపై విమర్శలు, ఆరోపణలు చేస్తే.. ఆయన ధీటుగా స్పందిస్తారు. ఎవరెవరికి ఎలా వాత పెట్టాలో రాజుగారికి తెలిసినంత

విధంగా చంద్రబాబుకు కూడా తెలిదు. అందుకే విమర్శలు, ఆరోపణలను సకాలంలో స్పందించలేకపోతున్నారు. కానీ రాజుగారు వెంటనే స్పందించి తగు సమాధానం చెబితే.. అధికార సవాళ్లకు ప్రతి సవాళ్లు విసురుతూ.. మళ్లీ మంత్రులు నోరు తెరవకుండా.. మౌనం వహించేటట్లు చేస్తున్నారు.

నరసాపూర్‍ లోక్‍సభ సభ్యుడు కనుమూరి రామకృష్ణంరాజు

(ఆర్‍ఆర్‍ఆర్‍) తన పదవికి రాజీనామా చేయాలని అమాత్యులు, అధికార ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నేతలు చేస్తున్న డిమాండ్‍కు ఆయన స్పందిస్తూ.. తాను రాజీనామా చేయటానికి సిద్దమే అని మళ్లీ ఎంపీగా పోటీ చేసి విజయం సాధిస్తే.. అమరావతి రాజధానిని యధావిధంగా కొనసాగించేందుకు సిఎం జగన్‍రెడ్డి లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని అందుకు

సిఎం జగన్‍ సిద్దమయితే… తాను కూడా రాజీనామా చేయటానికి సిద్దమే అని ఆర్‍ఆర్‍ఆర్‍ సవాల్‍ విసరటంతో… అమాత్యులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నాయకులకు నోట మాట రావటం లేదు. రాజుగారు సవాల్‍ విసిరారు. జవాబు చెప్పగల సత్తా మీకుందా అని ప్రతిపక్ష నేతలు, అధికార నేతలకు సవాల్‍ చేశారు. ఎంపీ పదవికి రాజీనామా

చేయాలని ఇంతకు ముందు నరసాపురంలోక్‍సభ పరిదిలోని ఎమ్మెల్యేలు డిమాండ్‍ చేసినప్పుడు రాజుగారు స్పందిస్తూ.. నేను రాజీనామాకు సిద్దమే.. ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయండి. నేను స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తాను. మీరు కూడా జగన్‍ పార్టీ ఎమ్మెల్యేలుగా పోటీ చేయండి. నేను ఓడిపోతే.. రాజకీయ సన్యాసం తీసుకుంటాను. మీరు ఓడిపోతే..

మళ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు మీ ముఖ్యమంత్రి జగన్‍రెడ్డి సిద్దమా అని సవాల్‍ విసరటంతో.. ఆ ఎమ్మెల్యేలు మళ్లీ నోరు మెదపలేదు. తాజాగా అటవీ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాస్‍రెడ్డి.. ఎంపీ రాజుగారు రాజీనామాకు డిమాండ్‍ చేయటంతో.. ఆయన స్పందించిన తీరు అధికార పార్టీని ఖంగు తినిపించింది.

రాజుగారు రాజీనామాకు

సిద్దపడ్డారు. ఆయన స్వతంత్ర అభ్యర్ధి ఎంపీగా పోటీ చేసి విజయం సాధిస్తానన్న ధీమా ఆయనకు ఉంది. కానీ అమరావతిరాజధానిని యధావిధంగా కొనసాగించేందుకు సిఎం జగన్‍రెడ్డితో లిఖిత పూర్వక హామీ ఇప్పించగల శక్తి సామర్ధ్యాలు అమాత్యులకు ఉందా ? మూడేళ్లు పైగా అధికారం వదులుకునేందుకు సిఎం జగన్‍రెడ్డి ముందుకు రాగలరా…? ఏది ఏమైనప్పటికీ..

రాజుగారు చేసిన సవాల్‍కు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుకునే వారందరూ ఆయనకు మద్దతిస్తుండగా.. అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు రాజుగారి సవాల్‍పై ఎలా స్పందించాలో తెలియక ఆయనతో ఎందుకు పెట్టుకున్నామా అని తలలు పట్టుకుంటున్నారట.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam