DNS Media | Latest News, Breaking News And Update In Telugu

క్షేత్ర స్థాయి పర్యటనలతో అందరి మధ్య అరకు ఎమ్మెల్యే

*విశాఖ మన్యం లో శెట్టి ఫాల్గుణ మార్నింగ్ వాక్ మీటింగ్ లు*

*(DNS report : Sairam CVS, బ్యూరో, విశాఖపట్నం)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 15, 2020 (డి ఎన్ ఎస్):* విశాఖ జిల్లా అరకు నియోజకవర్గం పెడబయలు మండలకేంద్రంలో సామాన్య జనంతో మమేకమై, సమస్యలను తెలుసుకుంటూన్న ఎమ్మెల్యే శెట్టి ఫల్గుణ అందరి మన్ననలూ అందుకుంటున్నారు.

మంగళవారం ఉదయం కుత్తుకొండ, ముసిడిపుట్టు  గ్రామాలలో  ఇంటింటికి వెళ్లి  ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా  అని అడిగి తెలుసుకున్నారు. 

 పెదబయలు మండల కేంద్రం సీతగుంట పంచాయతీ లో సోమవారం రాత్రి బస చేసిన అనంతరం  మంగళవారం స్థానిక అధికారులతో  కలిసి మార్నింగ్ వాక్ చేస్తూ సీతగుంట పంచాయతీ కిత్తు కొండ  

ముసిడి పుట్టు  గ్రామాలను సందర్శించారు.  ఉదయన్నే ఎమ్మెల్యే ఫాల్గుణ  కిత్తుకొండ గ్రామంలో వెళ్లి  ఆశ్చర్యానికి గురిచేశారు. ఎమ్మెల్యే గ్రామంలో రావడంతో స్థానిక యువత గ్రామ అభివృద్ధికి సహకరించాలని ముఖ్యంగా  మంచినీటి సమస్యగా ఉందని  ప్రాథమిక  పాఠశాల మరమ్మతులకు గురైందని  రహదారి పనులు అర్దాంతంగా

నిలిచిపోయిందని తెలిపారు. ఎమ్మెల్యే తో పాటు మార్నింగ్ వాక్ వెళ్లిన ఎంపీడీఓ పూర్ణయ్య  ను మండలపరిషత్  లేదా పంచాయతీ నిధులు మంజూరు చేసి  పనులు వేగవంగా పూర్తి చేయాలని ఆదేశించారు. 

అనంతరం ముసిడిపుటు  గ్రామం మెయిన్ రోడ్డు నీటి కాలువను పరిశీలించారు. ప్రజలతో మమేకమై పోతూ ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరికి

 పలకరిస్తూ  రాష్ట్ర ముఖ్యమంత్రి  ప్రవేశ పెట్టిన నవరత్నాలు పధకాలు  అందుతున్నాయా లేదా ? అని అడిగి తెలుసుకొన్నారు. అర్హత ఉన్న అందరికి ప్రభుత్వ పథకాలు చేరేలా చర్యలు తీసుకోవాలని  అధికారులను ఆదేశించారు. మండలంలో  వివిధ అభివృద్ధి పనుల కోసం కోటి 20 లక్షలు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్  జగన్మోహనరెడ్డి మంజూరు చేశారని

పనులు గుర్తించి మౌలిక సదుపాయాల కల్పనకు  చర్యలు తీసుకోవాలన్నారు. 

  అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల సంక్షేమ ఫలాలు ప్రజలకు  చేరలేదని  జగన్మోహనరెడ్డి  ప్రభుత్వంలో ప్రజలు కష్టాలు పడ రాదని  గ్రామ వలంటీర్ వ్యవస్థను ప్రారంభించారన్నారు. వారి ద్వారా గ్రామసమస్యలు అధికారుల

దృష్టికి తీసుకుపోయి  పరిష్కరించే విదంగా చూడాలన్నారు ఎవరికైతే పోడు  భూములున్నాయో వారందరికీ పోడు పట్టాలు మంజూరు చేయాలనీ  స్థానిక రెవిన్యూ తహశీల్దార్ షేక్ ఉషేన్ ను ఆదేశించారు. 
  
గిరిజనుల ఆయుపట్టు జి ఓ నంబర్ 3 సుప్రీం కోర్టు  రద్దుచేసి విషయం అందరికి తెలిసిందే నని, ఆదివాసీల  విద్యావంతులైన  యువతకు

ఉపాధి కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం చట్టాలను అమలు పరుస్తూ ఉద్యోగ ఉపాధి కల్పించడానికి  ప్రభుత్వం చర్యలు తీసుకొంటుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.  

ఆదివాసీ గిరిజనుల సమస్యల పట్ల ఎస్ టి కమిషన్  సభ్యులు ముఖ్యమంత్రి  దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. అలాగే కోవిడ్ కారణంగా ప్రస్తుతం పాఠశాలలు

తెరవడంలేదని అవి త్వరలో  పాఠశాలలు తెరుచుకొంటాయని విద్యాశాఖ శాఖాపరమైన చర్యలు తీసుకోనుంది గిరిజన గురుకులం రాష్ట్ర వ్యాప్తంగా 1650 మంది ఔట్ సోర్సింగ్ ఉపధ్యాయులకు రెన్యువల్ లేక విధులకు చేరడం లేదని  ఆరునెలలు గా జీతాలు లేక కుటుంబ పోషణ  ఆర్థిక భారమై ఇబ్బందులకు గురవుతున్నారని తమ ద్వారాగా  గిరిజన సంక్షేమ మంత్రి

పాముల పుష్పశ్రీ వాణి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి నందు లకు ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు ఎమ్మెల్యే ఫాల్గుణకు  కృతజ్ఞతలు తెలిపారు,   

అలాగే ఈనెల 22 న గిరిజన గురుకుల కార్యాలయంలో  బి  ఓ జి సమావేశం జరుగుతున్నట్లు తెలిసింది కానీ అహవ్వనం అందితే తప్పక హాజరై  ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయుల

సమస్యల పరిస్కారనికి  ఛైర్మెన్ ముందు తెలియజేస్తానని  ఈకార్యక్రమంలో  భాగంగా  ఎంపీడీఓ పూర్ణయ్య   సి డి పి ఓ నాగమణి   తహశీల్దార్ షేక్ ఉషేన్  పార్టీ మండల శాఖ అధ్యక్షుడు వి ఆనందరావు జడ్పీటీసీ అభ్యర్థి కె బొంజుబాబు  డివిజన్  సర్పంచు ల ఫోరమ్ మాజీ అధ్యక్షుడు పాంగి సింహాచలం   కె , కనకరాజు ,కె  ఆనంతరవు  కొంటా

సూర్యనారాయణ సందడి కొండబాబు  పార్టీ కార్యకర్తలు తదితరులు  పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam