DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అరసవల్లి సూర్యదేవాలయ హుండీ ఆదాయం రూ. 16 లక్షలు

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు SV,  బ్యూరో చీఫ్, శ్రీకాకుళం)*  

*శ్రీకాకుళం, నవంబర్ 09, 2020  (డి ఎన్ ఎస్):*  ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత అయినటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం లో హుండీ ఆదాయం  రూ. 16, 02, 526/- లు  ఆదాయం వచ్చిందని దేవాదాయ శాఖ సహాయ కమిషనర్, ఆలయ ఈవో వి. హరి సూర్య ప్రకాష్ తెలిపారు. సోమవారం ఉదయం 9గంటలకు

అనివెట్టి మండపం లో covid -19 నిబంధనలు పాటిస్తూ లెక్కింపు ప్రారంభించామన్నారు. లెక్కించగా నోట్లు రూపంలో  రూ. 14,52,352/-, చిల్లర రూపంలో రూ. 1,50,174/- వెరసి మొత్తం రూ. 16, 02, 526/- లు  ఆదాయం వచ్చిందని తెలిపారు. బంగారం 19 గ్రాములు మరియు  వెండి 01 కేజీ 05 గ్రాములు వచ్చిందని పేర్కొన్నారు. కేవలం 40 మందితో  లెక్కింపు జరిపామని తెలిపారు.



కార్యక్రమంలో పాలక మండలి చైర్మన్ ఇప్పిలి జోగి సన్యాసి రావు, ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, పాలక మండలి సభ్యులు మండల మన్మథరావు, అంధవరపు రఘురాం, యామిజాల గాయత్రి, సహాయ కమిషనర్ వారి కార్యాలయ సూపరిండెంట్ డి.వి.వి. ప్రసాద రావు,  జిల్లా సర్వేయర్ టి. వి. దుర్గా ప్రసాద్, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam