DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ లో రైతు ఆత్మహత్యలు ప్రభుత్వానికి పట్టదా?

*నరసాపురం ఎంపీ టీడీపీ ఇంచార్జి తోట సీతారామలక్ష్మి* 

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, డిసెంబర్ 28, 2020  (డి ఎన్ ఎస్):* గత 18 నేలలగా ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్న రైతు ఆత్మహత్యలు గురించి ఈ ప్రభుత్వం రైతులపట్ల వ్యవహరిస్తున్న తీరు పట్ల నర్సాపురం  పార్లమెంటు అధ్యక్షురాలు తోట

సీతారామలక్ష్మి ఆందోళన వ్యక్తం చేసారు.  

ప్రస్తుత ప్రభుత్వం అధికారంలో ఉన్న గత 18 నెలల్లో 500 మందికి పైగా రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మన దేశానికి వెన్నెముకగా నిలిచిన రైతన్నలు నెలా నెలా ఇలా ఆత్మహత్యకు పాల్పడటం అత్యంత బాధాకరం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సరిగ్గా గుర్తించి పరిష్కరించడంలో రాష్ట్ర

ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. బీమా ప్రీమియంలు సకాలంలో చెల్లించబడటం లేదు, పంట పరిహారాలు ఆలస్యంగానూ అదీ కొద్దిమందికే ఇవ్వబడుతున్నాయి, నష్టపోయిన పంటని అంచనా వేయడంలో ప్రభుత్వం అలసత్వం వలన రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలకి ప్రధాన కారనలగా నిలుస్తాయన్నారు.

ఈ వైఫల్యాల ప్రభావం రైతుల కుటుంబాల మీద తీవ్రంగా

ఉంటోంది, వారిని ఇంకా అప్పుల ఊబిలో నెట్టేస్తుంది. ప్రతి రైతు ఆత్మహత్య వెనుక ఎన్నో కారణాలు ఉండవచ్చు, కాని పంట వైఫల్యం వాటిలో ఒకటి కాకుండా ప్రభుత్వం నడుచుకోవాలి. భారీ ప్రకటనల కన్నా వాటిని అర్ధవంతంగా అమలు చేయడంలో ప్రభుత్వ పనితనం తెలుస్తుంది . రైతన్న బాగు కోసం చేసిన వాగ్దానాలు మరిచిపోయి కనీసం వ్యవసాయ మౌలిక సదుపాయాలు

కూడా సరిగ్గా లేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు.
మా డిమాండ్లు గత ప్రభుత్వం ఆత్మహత్యకు పాల్పడిన రైతుల కుటుంబాలకు పరిహారంగా 5 లక్షల రూపాయలు ఇచ్చింది. ప్రస్తుత ప్రభుత్వం దీనిని 7 లక్షల రూపాయలకు పెంచుతూ జీవోను విడుదల చేసినప్పటికీ, క్షేత్ర స్థాయిలో చూస్తే కేవలం 2 లక్షలు మాత్రమే ఇస్తున్నట్లు తెలుస్తోందన్నారు. ఇది

వెంటనే పరిష్కరించి ప్రతి బాధిత కుటుంబానికి పూర్తి పరిహారం అందేలా చూడాలి, రైతు ఆత్మహత్యల సమస్యను పరిష్కరించడం పై ప్రభుత్వం ఎటువంటి శ్వేతపత్రం లేదా కార్యచరణ ప్రణాళికను విడుదల చేయలేదు. ఈ కుటుంబాలు తమ ముఖ్యమైన సభ్యుడిని కోల్పోయిన తరువాత వారి జీవనోపాధికై ప్రభుత్వం ఎలా సహాయపడుతుంది? దీని మీద తక్షణమే సమాధానం

ఇవ్వాలని కోరుతున్నారు.  బాధిత కుటుంబాలకు పరిహారాన్ని ఆలస్యం చేయడం ద్వారా ప్రభుత్వం వారిని మరింత నిస్సహాయతకు గురి చేస్తోంది. ఆత్మహత్య చేసుకున్న వారంలోనే కుటుంబానికి పరిహారం అందజేయడానికి ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam