DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వ్యాక్సినేషన్ అయ్యేవరకూ ఎన్నికల విధులు చెయ్యలేం: 

*ఏపీ రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం ప్రకటన* 

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, జనవరి 09, 2021  (డి ఎన్ ఎస్):*  ఎన్నికల విధుల్లో పాల్గొనే ధైర్యం మాకు లేదు..అంటూ ఏపీ పోలీస్ ఉద్యోగుల సంఘం ప్రకటించింది. ఈ మేరకు ఉద్యోగుల సంఘం ఆద్యషులు జె. శ్రీనివాస రావు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు

విడుదల చేసిన ప్రకటనలో పలు అంశాలు తెలిపారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత ఇంకా తగ్గలేదని,  మీ ఎన్నికల తొందర కోసం మా ప్రాణాలను పణంగా, ప్రమాదంలో పెట్టలేమని తెలిపారు.  

కోవిద్ నియంత్రణ కోసం ముఖ్యమంత్రి చేస్తున్న నిరంతర పోరాటం నేపథ్యంలో సహకరించాలని, ఇలాంటి క్లిష్ట సమయంలో ఎన్నికల విధుల్లో పాల్గొనలేమని, కదా మళ్ళీ

మొదటి కొస్తుందన్నారు. 

అంత అత్యవసరంగా వెలువడిన ఎన్నికల నిర్వహణ ప్రకటన పోలీసులను ఆందోళనకు గురి చేసిందన్నారు. 

ఈ మహమ్మారి వలన ఇప్పడికే 109 మంది పోలీసులు మృత్యువాత పడ్డారన్నారు. మరో 14000 మంది కోవిద్ బారిన పడ్డారన్నారు.

వ్యాక్సిన్ అందించే సమయంలో పోలీసులకు అనేక భాద్యతలు ఉంటాయన్నారు.

వాక్సిన్ రవాణా, నిల్వలకు బందోబస్త్, తదితర అంశాలెన్నో ఉంటాయన్నారు. 
పైగా పోలీస్ సిబంది, కుటుంబాల వారూ అంటా ఈ వాక్సిన్ ను వేయించుకోవాలన్నారు. 

ఈ ప్రక్రియ పూర్తి అవ్వకుండా ఎన్నికల విధులకు హాజరవ్వడం ప్రాణాలను పణంగా పెట్టడమేనన్నారు. 

వాక్సిన్ ప్రక్రియ ముగిసే వరకూ ఎన్నికల విధుల్లోకి రాలేమని

తేల్చి చెప్పేసారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam