DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అన్ని వసతులతో నూతన ఆలయ నిర్మాణానికై సూచించాం

*రామతీర్ధం పర్యటన అనంతరం చిన్న జీయర్ స్వామి వెల్లడి* 

*మంత్రి వెల్లంపల్లి, టిటిడి చైర్మన్లతో మాట్లాడాం, ఆమోదించారు*

*దోషులకు చట్టప్రకారం కఠిన శిక్ష  విధించాలి*

*ఆధ్యాత్మిక చైతన్య పర్యటన మాత్రమే, రాజకీయాలు వద్దు* 

*ఆశ్రమంలో గోదాకల్యాణం లో ఆవేదనా పూర్వక ప్రవచనం.*

 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జనవరి 15, 2021  (డి ఎన్ ఎస్):* గత 400 ఏళ్ళ క్రితం నాటి ఆలయం కావడం తో రామతీర్ధం బోడికొండ పై ఆలయం శిధిల స్థితికి చేరుకుందని, అన్ని వసతులతో, నీటి వసతి, యాగశాల, విమానం తదితర ఏర్పాట్లతో నూతన ఆలయ నిర్మాణానికై సూచించినట్టు ప్రముఖ ఆధ్యాత్మిక

వేత్త, ఉభయ వేదాంత ఆచార్య పీఠాధిపతులు, వేదవిశ్వ విద్యాలయ వ్యవస్థాపకులు, త్రిదండి చిన్న జీయర్ స్వామీజీ తెలియచేసారు. హైద్రాబాద్ లోని దివ్య సాకేతం లోని జీయర్ ఆశ్రమం లో జరుగుతున్నా శ్రీ గోదారంగనాధుల కళ్యాణం అనంతరం పలు అంశాలపై ప్రవచిస్తూ. . . ఉత్తర అయోధ్యగా పేరుపొందిన విజయనగరం జిల్లా రామతీర్ధం లోని ఈ ఆలయ ఘటనను

ప్రస్తావించారు. 

అన్ని వసతులతో నూతన ఆలయం కట్టండి:. . .

గురువారం తాము ఘటనాస్థలాన్ని ప్రత్యక్షంగా దర్శించామని చాలా ఆవేదన కల్గిందన్నారు. 
వైఖానస ఆగమ పండితులను తమవెంట తీసుకుని వెళ్లడం జరిగిందని, ఆలయ అర్చకులతో మాట్లాడిన తదుపరి ఘటన స్థలానికి వెళ్లి, పరిశీలించిన తదుపరి అక్కడ నుంచి రాష్ట్ర

దేవాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, తిరుమల తిరుపతి దేవస్థానముల ట్రస్ట్ చైర్మన్ ఎస్ వి సుబ్బా రెడ్డి లతో ఫోన్ ద్వారా మాట్లాడడం జరిగిందన్నారు. ఈ ఆలయంలో గత 70 ఏళ్ళు క్రితం ఒకసారి భిన్నమైందని, అయితే నేడు ఆలయం మరింత దుస్థితికి చేరుకుందన్నారు. దీనికి ఒక పరిష్కారం ఉందని, విగ్రహ పు న ప్రతిష్ట కు మారుగా ఆలయాన్ని

అన్ని వసతులతో, యాగశాలను, నీటి వసతులతో, విమాన ఏర్పాటు తదితర అంశాలతో ఒక చిన్న  ఆలయం (30 అడుగుల వెడల్పు, 30 అడుగుల పొడవు పరిమాణంలో) నిర్మించగలిగితే మరింత వైభవంగా ఉంటుందని సూచించామన్నారు. ఇదే అంశాలను స్థానిక అర్చకులు, అధికారులు, వైఖానస ఆగమ పండితులతోనూ చర్చించడం జరిగిందన్నారు. ఒక ఏడాది కాలం వరకూ ఆలయంలోని ప్రధాన మూర్తి

చిత్రాన్ని ఒక వస్త్రం పై చిత్రీకరించి, జీవాన్ని ప్రవేశపెట్టి, బాలాలయ ఉత్సవ విధానంలో  నిర్వహించవచ్చు అని ఆగమ నిపుణులు తెలిపారన్నారు.  ఒక ఏడాది కాలంలో నూతన ఆలయాన్ని అన్ని వసతులతో నిర్మించగలరా అని అడగడంతో టిటిడి చైర్మన్ తమ అంగీకారాన్ని తెలిపారన్నారు.       

అయితే ముందుగా దేవాదాయ శాఖా

నిర్ణయించుకున్న పధకం ప్రకారం ఈనెల 25 తేదీ ప్రాంతంలో కొత్త మూర్తులను పు న ప్రతిష్ఠా చేసేందుకు సిద్దమయ్యారన్నారు. అయితే తమ సూచనను ఎంతవరకూ అమలు చేస్తారో వారికే తెలియాలన్నారు.  
 
ప్రస్తుతం వరకూ బోడికొండ ఆలయం పై కేవలం ఆలయం మాత్రమే ఉందని, చిన్న కొలను లాంటి గుంత ఉందని, ఆ నీరు ఆరాధనకు పనిరాదన్నారు. ప్రతి రోజూ కొండపై

ఆలయంలోని అర్చకులు, ఆరాధనకు తీర్ధ జలం, నైవేద్య ప్రసాదం తమవెంట తీసుకునే తీసుకుని అత్యంత క్లిష్టమైన కొండపైకి ఎక్కి వెళ్తున్నారన్నారు. కొన్ని వసతులు ఏర్పాట్లు చేయడం వలన అర్చకులు మరింత అద్భుతమైన సేవలు అందించగలరన్నారు.  

దోషులకు కఠిన విధించాలి: . . . 

రామతీర్ధం ఆలయం ఘటన ద్వారా కోట్లాది మంది భక్తుల

మనోభావాలు ద్రవించాయన్నారు.  ప్రార్ధనా మందిరాలు ఏ సంప్రదాయానివైనా వేలాది మంది భక్తుల మనోభావాలతో కూడుకున్నావని, అలాంటి వాటిని ధ్వంసం చేసిన వారికి చట్టప్రకారం కఠిన శిక్ష విధించాలని, తద్వారా మీరొకరు ఇలాంటి పని చెయ్యడానికి సాహసం చెయ్యరన్నారు. 

ఆధ్యాత్మిక చైతన్య పర్యటన మాత్రమే. .. 

ఇటీవల ఆంధ్ర

ప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల్లోని ఆలయాల్లో పలు దేవి దేవతల విగ్రహాలు ధ్వంసం అయినా ఘటనలపై అయన తీవ్ర ఆవేదన చెందారు. ఈ ఆలయాలన్నింటినీ ఈ నెల 16 నుంచి పర్యటించనున్నట్టు తెలిపారు. 

ఈ నెల 16 నుంచి తాము చేపట్టనున్న పర్యటన కేవలం ఆధ్యాత్మిక చైతన్య యాత్ర అంత్రమేనని, ఇది రాజకీయ వేదిక కాదని, కేవలం హిందూ ధార్మిక

వ్యక్తులుగా పాల్గొనవచ్చన్నారు. రాజకీయ పార్టీల పేరుతొ ఎవరికివారు ఉద్యమం చేసుకోవచ్చన్నారు.   

ఈ ఆలయాల సందర్శనలో హిందూ ధార్మిక ప్రతినిధులు పాల్గొని, హిందూ ఆలయాల వైభవాన్ని పున: ప్రతిష్ఠా చేయడంలో సహకరించాలని స్వామిజి సూచించారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam