DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టీకా వేయించుకున్నా, నిబంధనలు తప్పక పాటించాలి 

*రాజమండ్రి సబ్ కలెక్టర్ అనుపమ అంజలి సూచన*

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, జనవరి 16, 2021  (డి ఎన్ ఎస్):* ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలిచిన భారత దేశ శాస్త్రవేత్తల ఆవిష్కరణ కోవిడ్ వాక్సిన్ శనివారం దేశవ్యాప్తంగా మొదలైంది. తూర్పు గోదావరి జిల్లా రాహమహేంద్రవరం లో సబ్ కలెక్టర్

అనుపమ అంజలి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఎంపిక చేసిన ప్రభుత్వ సిబ్బందికి తొలివిడత వాక్సిన్ ను ధవళేశ్వరం, బృహన్నల పేటలోని అర్గోయ కేంద్రంలో ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ వ్యాధి నిరోధక టీకా వేసేటప్పుడు కొద్దిమందికి తేలికపాటి జ్వరం, తలతిరగడం, వాంతులు, దద్దుర్లు, వచ్చే అవకాశం ఉందన్నారు. అయితే భయపడాల్సిన అవసరం

లేదన్నారు. టీకా వేసిన చోటే 10 పథకాలతో పరిశీలనా కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. వైద్య నిపుణులు అక్కడే అందుబాటులో ఉంటారన్నారు. ప్రతి అరగంటకూ ఓ సారి టీకా తీసుకున్న వారిని పరిశీలిస్తుంటారన్నారు. దశల వారీగా మూడు నెలల కాల వ్యవధిలో అందరికి టీకాలు అందుతాయన్నారు. మొదటి డోసు వేసుకున్న 28 వ రోజున తిరిగి రెండో డోసు

వేసుకోవాలన్నారు. టీకా వేసుకున్న రెండు వారాలకు ఇమ్యూనిటీ వస్తుందని, అందువల్ల టీకా తర్వాత కూడా కో వి డ్ నిబంధనలు పాటించాలన్నారు. కేంద్రం సూచించిన నిబంధనల ప్రకారమే టీకా వేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం లో అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని డాక్టర్ కోమలి, సిబ్బంది పాల్గొన్నారు.     

ఎవరికి

ఇవ్వొద్దంటే..

1. అలర్జీ.. అనఫైలాటిక్ రియాక్షన్లు ఉన్నవారు కోవిడ్‌19 టీకా తీసుకోవద్దు. ఇంజక్షన్లతో అలర్జీ వచ్చేవారిని కూడా దూరం పెట్టాలి..
2. గర్భిణులు, బాలింతలు టీకా తీసుకోవద్దు. ఎందుకంటే, ఇప్పటి వరకు గర్బిణులపై టీకా ట్రయల్స్ చేపట్టలేదు. అందుకే వారు వ్యాక్సిన్ తీసుకోవద్దు. పాలు ఇచ్చే తల్లలు కూడా టీకాకు

దూరంగా ఉండడం బెటర్‌.
3. సార్స్ సీవోవీ2 ఇన్‌ఫెక్షన్ అధికంగా ఉన్నవారికి కోలుకున్న తర్వాత కొన్ని వారాలకు టీకా ఇవ్వాలి..
4. ప్లాస్మా థెరపీ తీసుకున్నవారికి కూడా కొన్ని వారాల విరామం తర్వాత టీకా ఇవ్వాలి.
5. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కూడా తక్షణమే టీకా ఇవ్వకూడదు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam