DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*విశాఖ బాలికకు రాష్ట్రీయ బాల శక్తి పురస్కార్ 2021*

*సత్యసాయి విద్యావిహార్ విద్యార్థిని అమేయా లగుడు* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జనవరి 25, 2021  (డి ఎన్ ఎస్):*  విశాఖ నగరం లోని శ్రీ సత్య సాయి విద్యా విహార్ స్కూలు కు చెందిన విద్యార్థిని అమేయా లగుడు ప్రతిష్టాత్మక ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల శక్తి పురస్కార్

2021 పురస్కారానికి ఎంపికయ్యింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఈ ప్రతిష్టాత్మక ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల శక్తి పురస్కర్ 2021 కు ఎంపికైన ఏకైక విద్యార్థిని. ఇన్నోవేషన్, స్పోర్ట్స్, ఆర్ట్స్ అండ్ కల్చర్, సోషల్ సర్వీస్, స్కాలస్టిక్ ఫీల్డ్, మరియు ధైర్యం వంటి రంగాలలో అసాధారణమైన సామర్ధ్యాలు మరియు అద్భుతమైన విజయాలు కలిగిన

పిల్లలకు రిపబ్లిక్ రోజున భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక  ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ శక్తి పురస్కర్‌ను ప్రదానం చేస్తోంది.
ఈమె ప్రస్తుతం శ్రీ సత్యసాయి విద్యా విహార్ లో 8 వ తరగతి విద్యార్థిని. ఆర్ట్ & కల్చర్ విభాగంలో ఈ అవార్డును గెలుచుకుంది

వీడియో ద్వారా ప్రధానితో భేటీ. . .:

ప్రతి సంవత్సరం

న్యూ ఢిల్లీ లో ఈ  అవార్డు ఫంక్షన్ జరుగుతుంది. అయితే ప్రస్తుతం  కొనసాగుతున్న కరోనా మహమ్మారి కారణంగా, ప్రధానమంత్రి, నరేంద్ర మోడీ వీడియో ద్వారా పురస్కార గ్రహీతలతో మాట్లాడారు. ఈ సమావేశానికి కేంద్ర మహిళ శిశు సంక్షేమ, బాలల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ  కూడా హాజరయ్యారు.

అమేయా 4 సంవత్సరాల వయస్సు నుండి

భరతనాట్యం మరియు కూచిపూడి, దక్షిణ భారత శాస్త్రీయ నృత్య రూపాలను నేర్చుకుంటున్నారు. నాటి నుంచి పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనలకు రికార్డులు సైతం సొంతం చేసుకుంది. ఈ క్రమం లో 10 ప్రపంచ రికార్డులు, 8 ఇంటర్నేషనల్ అవార్డులు, 9 జాతీయ అవార్డులు, 18 రాష్ట్ర స్థాయి అవార్డులు పొందింది. ఈమెను తల్లిదండ్రులు, పాఠశాల

ప్రతినిధులు అభినందించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam