DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎన్నికల్లో ఓటు కు బీమా కల్పించాలి: ఆధునిక యువత

*ఓటు భాద్యతే ? మరి ఆ ఓటును కాపాడే భాద్యత ఉండదా?*

*జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా యువత అభిప్రాయాలూ*

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు SV,  బ్యూరో చీఫ్, శ్రీకాకుళం)*  

*శ్రీకాకుళం, జనవరి 25, 2021  (డి ఎన్ ఎస్):* ఓటు హక్కు ఉన్న ప్రతి భారతీయుడు ఓటును వినియోగించుకోవడం భాద్యత అని ప్రభుత్వ, అధికారులు,

అనధికారులు, స్వచ్చంద సంస్థలూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. అయితే ఆ ఓటు విలువను కాపాడవలసిన భాద్యత ఆ పాలకులకు, చట్ట సంస్థలకు లేదా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయని నూతనంగా ఓటు వచ్చిన యువత ప్రశ్నిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలో వేసే ఓటుకు బీమా సదుపాయం కల్పించాలని కోరుతున్నాయి. ప్రస్తుతం ఆలోచనా

విధానాల్లో ఉన్నతంగా ఉన్న యువత, ఓటు విషయం లోనూ ద్రుష్టి పెడుతున్నాయి. 

సోమవారం జాతీయ ఓటర్ ల దినోత్సవం సందర్బంగా కొందరు యువతి యువకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసారు. తెలిసో, తెలియకో ఓటింగ్ లో తప్పు జరిగితే, ఆ ఓటును లెక్కించారన్నారు. అలాగే, తప్పుగా పార్టీ మారిన అభ్యర్థులను ఎందుకు తొలగించారని యువత

ప్రశ్నిస్తున్నారు. 

భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు వినియోగించుకున్న వ్యక్తి కి తన ఓటు కు భద్రతా కల్పించే హక్కు మాత్రం లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం రాజకీయ పార్టీల రాజకీయ క్రీడల్లో చట్ట సభలకు ఎన్నికైన వారు సైతం పార్టీలు యధేచ్చగా మారిపోతున్న సందర్భాలు చూస్తున్నామని యువత

తెలియచేస్తున్నారు. 

ఒక అభ్యర్థి ఒక ఎన్నికల్లో గెలిచి, చట్టసభకు ఎన్నికైతే, ఆ వ్యక్తి ప్రతిపక్ష పార్టీ సభ్యునిగా ఉన్న సందర్భంలో అతను పార్టీ మారాలి అనుకున్న సమయంలో తన పదవికి రాజీనామ చేసి ఉపఎన్నికలకు వెళ్ళవలసి ఉంది. తదుపరి వ్యక్తిని ప్రజలే ఎన్నుకునే అవకాశం ఉంటుందని యువత తెలియచేస్తున్నారు. ప్రస్తుతం తన

సీటుకు రాజీనామా చెయ్యకుండానే, అనధికారికంగా పార్టీలు మారుతున్నా వ్యక్తులు తమకు ఓటు వేసిన ప్రజలను మోసగించడమే అనే అభిప్రాయాన్ని యువత వ్యక్తం చేస్తున్నారు. 

ఓటు కు రక్షణ ఏది : 

ఎన్నికల్లో పౌరులు వినియోగించుకునే ఓటు కు బీమా సదుపాయం కల్పించాలని యువతి యువకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత

రాజీకీయాల్లో తాము వేసిన ఓటు కు ఎటువంటి భద్రతా , రక్షణ లేదని, తాము ఓటు వేసిన పార్టీ అభ్యర్థి ఓటర్ల ప్రమేయం లేకుండానే పదవికి రాజీనామా చెయ్యకుండా పార్టీలు మారుతున్నాడని మండిపడ్డారు. ఈ క్రమంలోనే తాము వేసిన ఓటుకు బీమా సదుపాయం కల్పిస్తే అభ్యర్థి పార్టీ మారే సమయంలో బీమా సంస్థలు ఓటర్లు తరపున చర్యలు చేపడతామన్నారు.

 

తమకు ఒక పార్టీ సిద్ధాంతాలపై విశ్వాసంతో ఆ పార్టీ తరపున పోటీ చేసిన వ్యక్తి కి ఓటు వేస్తున్నామని, గెలిచాక ఆ వ్యక్తి ఈ పార్టీ వదిలి, వేరే పార్టీకి వెళ్లిపోవడం ఓటర్లను అవమానించడమేనన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam