DNS Media | Latest News, Breaking News And Update In Telugu

21 వరకూ మంత్రి పెద్దిరెడ్డిని ఇల్లు దాటిరానివ్వద్దు: ఎస్ఈసి

*ఉద్యోగులను బెదిరించే వ్యాఖ్యల ఆధారంగానే ఈ ఆదేశాలు?*

*ఎస్ ఈ సి ఆదేశాలు ఖాతరు చెయ్యను: మంత్రి పెద్దిరెడ్డి.*
 
*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, ఫిబ్రవరి 06, 2021  (డి ఎన్ ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని ఈ నెల 21 వరకూ

ఇల్లు దాటి బయటకు రానివ్వవద్దు అని శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డా. నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన ఆదేశాలు సంచలంగా మారాయి. శుక్రవారం ఎన్నికల కమిషనర్ చెప్పినట్టు పనిచేస్తే వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెడతామంటూ ఉద్యోగులనుద్దేశించి మంత్రి చేసిన వ్యాఖ్యలు ఎన్నికల విధులకు ఆటంకం కల్గించేవిగా ఉన్నాయని భావించిన

నిమ్మగడ్డ ఈ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే పలు వార్తాఛానెళ్ళలోనూ, వివిధ పత్రికల్లోనూ వచ్చిన వార్తల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ మేరకు మంత్రి ని ఈ నెల 21 వరకూ ఇంటి నుంచి బయటకు రానివ్వవద్దని, మీడియాతో సైతం మాట్లాడరాదంటూ ఆదేశాలు ఇచ్చారు. దీనిపై రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ మధ్యాహ్నం 1 గంట కు

నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఈ అంశంపై స్పందిస్తూ ఇంతవరకూ ఆ ఆదేశాలు తమ కార్యాలయానికి రాలేదన్నారు. 

ఎస్ ఈ సి ఆదేశాలు పట్టించుకోము: మంత్రి.
 
ఒక రాష్ట్ర మంత్రిని గృహ నిర్బంధం చెయ్యాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాలు జారీ చెయ్యడం చాలా దుర్మార్గం అని పంచాయితీరాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

తెలిపారు. ఈ ఆదేశాల అనంతరం మంత్రి ఓ మీడియా ఛానెల్ తో మాట్లాడుతూ ప్రస్తుతం జరిగే ఎన్నికలు తన మంత్రిత్వ శాఖా పరిధిలోవేనని, దానిపై తాను కాకా ఇంకెవరు మాట్లాడతారన్నారు? ఈ ఆదేశాలు పట్టించుకోమని తేల్చి చెప్పారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam