DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బీజేపీ పట్ల విశాఖ ప్రజలు కృతజ్ఞత చూపాల్సిన సమయం ఇది 

*అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ పధకాలు ఇచ్చింది ఆంధ్రాకే*

*ఒక్క ఎంపీ, ఎమ్మెల్యేను గెలిపించకపోయిన మేలు చేసాం.*  

*ప్రతి కేంద్ర ప్రాజెక్ట్ లలోనూ విశాఖకు ఒకటి కచ్చితంగా ఇచ్చాం.* 

*విశాఖ అభివృద్ధి పై చర్చకు రావాలని పార్టీలకు జివిఎల్ సవాల్* 

*జివిఎంసి ఎన్నికల ప్రచారం లో బీజేపీ

ఎంపీ జివిఎల్ పిలుపు*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మార్చి 2, 2021  (డి ఎన్ ఎస్):* విశాఖ మహా నగరాభివృద్ధి జరిగింది అంటే. . .నరేంద్ర మోడీ సారధ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రాజెక్టులు, నిధులతోనే అని, దీనికి విశాఖ ప్రజలు భారతీయ జనతా పార్టీ పట్ల కృతజ్ఞత చూపాల్సిన సమయం

వచ్చిందని భారతీయ జనతా పార్టీ రాజ్య సభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు తెలిపారు. మంగళవారం విశాఖపట్నం లోని విశాఖ నగర పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విశాఖకు చేసిన మేలును గుర్తించి త్వరలో జరుగనున్న జివిఎంసి నగర పాలక ఎన్నికల్లో బీజేపీ -

జనసేన పార్టీల అభ్యర్థులకు ఓటు వేసి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, నరేంద్ర మోడీ పట్ల కృతజ్ఞత చూపాలని పిలుపు నిచ్చారు. 

కేంద్రంలో కేటాయిస్తున్న ప్రతి ప్రాజెక్ట్ లోనూ కచ్చితంగా రెండు ఆంధ్ర ప్రదేశ్ కు కేటాయిస్తున్నామని, దానిలో ఒకటి విశాఖనగరానికి కేటాయిస్తున్నామన్నారు. దానిలో భాగంగానే  విశాఖ మెట్రో

ప్రాజెక్ట్, ఆంధ్ర ప్రదేశ్ విభజన బిల్లు లో ఇచ్చినట్టు రైల్వే జోన్, విశాఖ - చెన్నై కారిడార్,  ఇలా ప్రతి ప్రాజెక్ట్ లోనూ విశాఖ కు స్థానం కల్పించామని తెలిపారు. 

బీజేపీ ఆంధ్ర కు, విశేషించి విశాఖ నగరానికి చేసిన కృషిని చూసి ఓటు వెయ్యండని పిలుపునిచ్చారు. 

ఏపీ నుంచి ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే లేరు అయినా: . .

 

ఆంధ్ర ప్రదేశ్ నుంచి బీజేపీ తరపున ఒక్క ఎంపీ గానీ, ఎమ్మెల్యే గానీ గెలవలేదని, యే శాసన సభ, పార్లమెంట్ ల్లో బీజేపీ కి ప్రాతినిధ్యం లేదని, అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏపీ కి ఎన్నో ప్రాజెక్టులు కేటాయించిందన్నారు. తమకు ఓటు వెయ్యలేదనే కోపం బీజేపీ అధిష్టానానికి గానీ, కేంద్ర ప్రభుత్వానికి గానీ ఎక్కడా లేదన్నారు.

రాష్ట్రం అభివృద్ధి చెందడమే తమ లక్ష్యం అన్నారు. తానూ కూడా ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్య సభకు ఎన్నికయ్యానని తెలిపారు. అయినప్పడికే ప్రతి రోజు సభలో ఏపీ అభివృద్ధి కి సంబంధించిన ప్రశ్నలే అడుగుతున్నామన్నారు. పార్లమెంటులో రాష్ట్ర సమస్యల పట్ల పొరాడుతున్నామని, తమ శ్రమను గుర్తించి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు

తమను ఆదరించాలని ఆయన కోరారు. 

*విశాఖ అభివృద్ధి పై చర్చకు జివిఎల్ సవాల్* 

విశాఖ నగర అభివృద్ధి పై చర్చకు రావాలని వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలు సహా  అన్ని రాజకీయ పార్టీలకు జివిఎల్ సవాల్ విసిరారు.  

ధనార్జనే ఆ ప్రాంతీయ పార్టీల లక్ష్యం. . .

రాష్ట్రంలో ఉన్న వైఎస్సార్

కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలు  రెండు ప్రాంతీయ పార్టీలు ధన రాజకీయాలు, భ్రమ రాజకీయాలు చేస్తూ రాష్ట్ర సమష్యల పరిస్కారంలో విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విశాఖకు, రాష్ట్రానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. వాటిల్లో 
 
1 . చెన్నై-విశాఖపట్నం

పారిశ్రామిక కారిడార్ కు పార్లమెంట్లో తాను గట్టిగా ప్రశ్నిస్తున్నానన్నారు. ఈ కారిడార్ వస్తే ఈ ప్రాంత పారిశ్రామిక ప్రగతి 8 రెట్లు పెరుగుతూ ఒక లక్ష నలభై వేల ఉద్యోగాలు సృష్టించ బడతాయన్నారు. దాంతో ఈ ప్రాంత రూపు రేఖలే మారిపోతాయన్నారు. 

2 . విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా దక్షిణ కోస్త రైల్వే జోన్ ను ఇప్పడికే

ప్రకటించడం జరిగిందని, డి పిఆర్ రైల్వే బోర్డు కు చేరిందని, త్వరలోనే రైల్వే జోన్ కార్యాచరణ పూర్తి స్థాయిలో మొదలవుతాయన్నారు. 
 
3 . విశాఖపట్నాన్ని దేశంలోనే మొదటి స్మార్ట్ సిటీగా ప్రకటించిన ఘనత తమకే దక్కుతుందన్నారు. 

4 . విశాఖపట్నంలో వైద్యపరికరాలను తయారీచేసే మెడ్టెక్ పార్క్ స్థాపించారన్నారు. 500కోట్ల

రూపాయాలతో 350 పడకల సూపర్ స్పెషలిటీ ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. 

5 . విశాఖపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ మెంటల్ కేర్ను సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ గా గుర్తించి అభివృద్ధి చేస్తున్నా మన్నారు. 

6 . విశాఖ స్టీల్ నుసమర్ధ వంతంగా నడిపి లాభాల్లోకి తీసుకు రావడం కోసమే ప్రయివేటు కు అప్పగించాలనే

విధానపరమైన నిర్ణయాన్ని కేంద్రం తీసుకుందన్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే అవకాశం లేదన్నారు. 

7 . విశాఖ లో మెట్రో రైల్ ప్రాజెక్ట్ కు కేటాయించడం జరిగిందన్నారు. 

8 . అమృత్ పధకంలో దాదాపు గా ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని జిల్లా ప్రధాన కేంద్రాలను కేటాయించిందన్నారు.  

9 . ప్రసాద్ పధకంలో

పర్యాటక రంగంలో కోట్ల రూపాయల నిధులు కేటాయించామన్నారు. 

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తాము, జనసేన తో కల్సి విశాఖలోని 98 వార్డుల్లో పోటీచేస్తున్నా మన్నారు. 

ఈ సమావేశంలో విశాఖపట్నం అభివృద్ధికి బీజేపీ ప్రభత్వం చేసిన కేటాయింపులు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ విలేఖర్ల సమావేశంలో విశాఖపట్నం మాజీ

ఎంపీ కంభంపాటి హరిబాబు, విశాఖ ఉత్తర నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam