DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పవిత్ర బౌద్దారామం తొట్లకొండ పై సినిమా క్లబ్కు అనుమతా?

*శాంతి వచనాలు పలికిన చోట శృంగార క్రీడలకు అనుమతా?*
 
*ధార్మిక పవిత్రత చెడగొట్ట వద్దు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్*

*జిఓ 21 రద్దు చెయ్యాలని బౌద్ధ సంఘాల డిమాండ్* 

*కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని విష్ణుకు వినతీపత్రం అందజేత* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

 

*విశాఖపట్నం, మార్చి 19, 2021  (డి ఎన్ ఎస్):* విశాఖ సాగర తీరంలోని పవిత్ర బౌద్దారామం తొట్లకొండ పై సినిమా క్లబ్ లు పెట్టె యోచనను తక్షణం విరమించుకోవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మండి పడ్డారు. శుక్రవారం తనను కలిసిన బుద్దిస్ట్ మాన్యుమెంట్ ప్రొటెక్షన్ కమిటీ, బౌద్ధ

సంఘాలతో మాట్లాడుతూ, అత్యంత బాధాకరమైన అంశమని, గతం లో సైతం దీన్ని తాము చట్ట ప్రకారం అడ్డుకున్నట్టు తెలిపారు. ఈ తొట్లకొండ పవిత్రతను చెడగొట్టే జిఓ ను  కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని విష్ణుకు బుద్దిస్ట్ మాన్యుమెంట్ ప్రొటెక్షన్ కమిటీ వినతీపత్రం అంద చేశారు. 
అనంతరం మాజీ ఎమ్మెల్యే మీడియా తో మాట్లాడుతూ తోట్ల కొండ

పై బౌద్ద భిక్షులు గతంలో ఎన్నో సంవత్సరాలు శాంతి వచనాలు పలికిన చోట నేడు అదే ప్రాంతంలో సినిమా క్లబ్ కు 15 ఎకరాలు  సినిమా క్లబ్ పెరిట విచ్చల విడి  శృంగార క్రీడలకు అనుమతి ఎలా ఇస్తారని మండిపడ్డారు. అతి పవిత్రమైన స్థలంలో సినిమా క్లబ్ నిర్మించడం చాలా దుర్మార్గం అన్నారు. ప్రజలు మనోభావాలతో సంబంధం లేకుండా రాష్ట్ర

ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. ఆ ప్రదేశంలో కాకుండా వేరో స్థలంలో కేటాయించండన్నారు. గతం లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో ఇదే క్లబ్ కు కేటాయింపులు జరిపి నాటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఎంపీ హరిబాబు లు  ( ఇద్దరూ బీజేపీ నాయకులే) పాల్గొని విమానాశ్రయం లో  శిలాఫలకం ప్రారంభించినప్పడికి తాము

వ్యతిరేకించామన్నారు. దాంతో ఆ జిఓ అప్పడికి ఆగిపోయిందన్నారు. అయితే నేడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో అడ్డు అయిపూ లేకుండా దోచుకోడమే పరిపాలనగా  నడుస్తోందన్నారు.  ఇదే క్లబ్ ను వేరేగా ప్రాంతంలో కట్టుకోవాలని తెలుగు సినిమా అగ్ర నటులు నిర్మాతలకు దర్శకులకు సూచించారు. 

తొట్లకొండపై సినిమా క్లబ్ ఏర్పాటు

చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం జిఓ 21 ని విడుదల చేయడం పట్ల బుద్దిస్ట్ మాన్యుమెంట్ ప్రొటెక్షన్ కమిటీ, బౌద్ధ సంఘాలు మండిపడుతున్నాయి. దీనిపై తక్షణం స్పందించి, ఈ క్షేత్రాన్ని రక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam