DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బ్రాహ్మణులంటే కేవలం రమణ దీక్షితులు ఒక్కరేనా?: ఎఐబిఎఫ్

*ఎల్విఎస్ ని తొలగించినప్పుడు బ్రాహ్మణ నేతలు ఎక్కడ ఉన్నారు?*

*వీళ్ళకి ఉపాధి ఇస్తే..మొత్తం సామాజిక వర్గానికి ఇచ్చినట్టేనా?*

*కోన, మల్లాది వ్యాఖలపై ఏఐబీఎఫ్ ఎంఏల్ఎన్ శ్రీనివాస్ మండిపాటు* 

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఏప్రిల్ 10, 2021 (డిఎన్ఎస్):*

బ్రాహ్మణులంటే కేవలం రమణ దీక్షితులు ఒక్కరేనా?, ఆయనకొక్కరికి ఉద్యోగం ఇస్తే. .మొత్తం బ్రాహ్మణ సామాజిక వర్గాన్నీ ఉద్దరించినట్టేనా అని అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య జాతీయ కార్యదర్శి ఎంఏల్ఎన్ శ్రీనివాస్ మండిపడ్డారు. శనివారం తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యవం లో నిర్వహించిన బ్రాహ్మణ

సంఘాల భేటీలో ఉప సభాపతి కోన రఘుపతి, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణులు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. 

బ్రాహ్మణులంతా వైఎస్ జగన్ కు ఋణపడి ఉందంటూ కోన రఘుపతి చేసిన వ్యాఖ్యానించడం తాము ఖండిస్తున్నామన్నారు. కేవలం ఒకరిద్దరికి ఉద్యోగాలిస్తే మొత్తం బ్రాహ్మణ సమాజం వైఎస్ జగన్ కు ఎలా ఋణపడి

ఉంటుందన్నారు. 

అదే విధంగా బ్రాహ్మణులకు పూర్వ వైభవాన్ని జగన్ ఇనుమడింప చేసారంటూ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు వ్యాఖ్యానించడం పూర్తిగా అవాస్తవం అన్నారు. 

ఏల్ వి ఎస్ కూడా బ్రాహ్మణుడే. . .  అప్పుడెక్కడ ఉన్నారు?

ఈ సభలో పాల్గొన్న వాళ్ళు ఈ వ్యాఖ్యలను సమర్ధించడాన్ని తప్పు

పట్టారు. ఇదే బ్రాహ్మణ సమాజం టిటిడి లో కేవలం హిందువులే ఉద్యోగం చెయ్యాలి అని ప్రకటించిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఏల్ వి సుభ్రమణ్యం ను ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించినప్పుడు ఈ బ్రాహ్మణ సంఘాల నేతలు ఎక్కడ ఉన్నారన్నారు. 
ఎల్విస్ కూడా బ్రాహ్మణుడేనని, అయన కు జరిగిన అన్యాయం పై ఈ పెద్దలు ఎందుకు

స్పందించలేదన్నారు.

కేవలం తమకు అనుకూలంగా ఉన్న సంఘాలతో భేటీ అయ్యి, వాళ్ళ అభిప్రాయాన్ని మొత్తం బ్రాహ్మణ సమాజానికి ఆపాదించడం సరికాదన్నారు.   
 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam