DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రైవేట్ టీచర్లను ఆదుకోవాలి: రాజమండ్రి ఎమ్మెల్యే భవానీ 

*(DNS రిపోర్ట్: పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, ఏప్రిల్ 22, 2021  (డిఎన్ఎస్):*     
*శ్రీకాకుళం, ఏప్రిల్ 22, 2021  (డి ఎన్ ఎస్):* ప్రైవేట్ టీచర్లను ఆదుకోవాలని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనా కారణంగా అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా

ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా ప్రయివేటు విద్యా సంస్థల ఉపాధ్యాయులు అనేక కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఆమె పత్రికా ప్రకటన విడుదల చేశారు. కరోనా వైరస్ ఆది నుంచీ ప్రయివేటు టీచర్లు కష్టాలు పడుతూనే ఉన్నారని పేర్కొన్నారు. జగన్ పాలనలో ఉపాధ్యాయుల బతుకులు ముందుకు సాగక చతికిలపడుతున్నాయని

విమర్శించారు. దాదాపు 5 లక్షల మంది ఉపాధ్యాయులు వేతనాలు అందక రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి సాయం అందక ప్రైవేట్ టీచర్లు భవన నిర్మాణ కార్మికులుగా, ఇతర రంగాల్లో కూలీలుగా మారారని పేర్కొన్నారు. పోరుగు రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు ఉపాధ్యాయులకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ఆదుకుంటుంటే.. జగన్ ప్రభుత్వం

మాత్రం గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు. వేతనాలు రాక, ఆదాయ మార్గాలు లేక ఇంటి అద్దెలు చెల్లించలేక, కుటుంబ పోషణ జరగక ప్రయివేటు ఉపాధ్యాయులు మానసికంగా కృంగిపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. అందువల్ల రాష్ట్రంలోని ప్రయివేటు ఉపాధ్యాయులు అందరికీ ఒక్కోక్క ఉపాధ్యాయునికి రూ.10 వేలు బృతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని

ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని డిమాండ్ చేశారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam