DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దేశ జనాభాలో 25 శాతం మంది మొక్కలు నాటితే ప్రాణరంజకమే

*భారత వన సంరక్షణ తో పర్యావరణ రంజకమవుతుంది*

*వృక్షో రక్షతి రక్షితః సందేశాన్ని భాద్యతగా పాటించాలి* 

*సమాజం నుంచి ధూమపానం పూర్తిగా నిషేధించాలి.* 

*ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రత్యేక కధనం . . .*

*(DNS report : వెంకటాచార్యులు S, బ్యూరో చీఫ్, శ్రీకాకుళం)* 

*శ్రీకాకుళం, జూన్ 04, 2021

(డిఎన్ఎస్):* 2011 జనాభా లెక్కల ప్రకారం భారత దేశ  సుమారుగా 130 కోట్లు. అందులో నాలుగో వంతు పౌరులు ప్రతి ఒక్కరు ఒక్కొక్క మొక్క లేదా వృక్షాన్ని నాటితే భారత దేశం మొత్తం పర్యావరణ రంజకమవుతుంది. 
జూన్ 5 , ప్రపంచ పర్యావరణ దినోత్సవము పురస్కరించుకుని ప్రత్యేక కధనం. 

భారత దేశ జనాభాలో ప్రతి నలుగురిలో ఒక్కరు ఒక్కో మొక్క

నాటితే. . ఆ కోలనీ, గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రం, దేశం మొత్తం వృక్ష సంపదతో పచ్చని వాతావరణంతో  కళకళలాడుతూ ప్రాణవాయువు విస్తృతంగా ప్రసరిస్తూ ప్రనరంజకంగా మారుతుంది. 

పర్యావరణం అంటే పరిసరాలు. పర్యావరణంలో ముఖ్యమైనది వృక్షం. ఇటీవల కాలంలో ఆధునిక వసతులు పెంచుకునే క్రమంలో వనాలను, అటవీ సంపదను ఛిద్రం చేసి,

పచ్చదనాన్ని కనుమరుగు చేస్తున్నారు. గతంలో నగరాల్లో సైతం ఎంతో వృక్ష సంపద ఉండేది. అయితే నేడు పూర్తిగా కనుమరుగై, అడవులను సైతం ఎడారులుగా మార్చేసే స్థితికి మనిషి చేరుకున్నాడు. తద్వారా కేవలం వృక్షాలపై నివాసం ఉండే పక్షులు, ఆకులూ మాత్రమే తిని జీవించే శాకాహారి జంతువులూ, అటవీ సంపదను ఆసరాగా చేసుకుని బ్రతికే  ఇతర జంతువులూ

కనుమరుగైపోయాయి. 

ఈ పరిస్థితుల్లో అడవులను, జంతువులను కేవలం జంతు ప్రదర్శన శాలల్లో మాత్రమే చూసే గతికి చేరుకున్నాం. వాటిని కూడా సంరక్షించడం చేతగాక పోవడం వల్ల జంతువులూ గృహవాసాల్లోకి వచ్చి, జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. 

ఈ తరుణంలో ప్రతి కోలనీలోనూ ప్రతి ఇంటి దగ్గరా మొక్కలు నాటి, వృక్ష

సంపదను పెంపొందించుకునే భాద్యతలను స్వీకరించాలి. తద్వారా ప్రాణవాయువును తిరిగి విస్తృతంగా పెంపొందించుకునేలా మన వాతావరణాన్ని మనమే మార్చుకోవాలి. వృక్షో రక్షతి రక్షితః నినాదాన్ని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ గా పాటించాలి 

ప్రధానంగా రీసైకిలింగ్ కు పనికిరాని ప్లాస్టిక్ వస్తువుల వాడకం కూడా

తగ్గించాలి 

వృక్షాలు వల్ల ప్రధాన మైన ఉపయోగం. . . ఒక వృక్షం ఒక మనిషికి లేదా కొంతమందికి ప్రాణవాయువును ( ఆక్సిజన్ ) ఇస్తుంది. మనుషులు వదిలే కార్బన్ డయాక్సైడ్ ను తీసుకుని, బయటకు ఆక్సిజన్ విడుదల చేస్తుంది. దీనివల్ల  మానవాళి కి పర్యావరణంలో చాలా ఉపయోగకరం. 

ప్రతి పౌరుడు పర్యావరణానికి ఇబ్బందికరమైన

చెత్త ను తగ్గించడం, కాగితాల వినియోగం సాధ్యమైనంతవరకు తగ్గించుకోవడం, ఒక కాగితానికి రెండు వైపులా రాయడం, పేపర్ ప్లాస్టిక్ లను తక్కువగా వాడటం,  ప్రతి ఇంటి బయట చెత్త బుట్ట విధిగా పెట్టుకోవడం వంటి పనులు మానవాళి కోసం మన పురోగతి కోసం చెయ్యాలి. 

పర్యావరణం ఎంత సక్రమంగా ఉంటే పౌరులు యొక్క ఆరోగ్యం కూడా అంత

బాగుంటుంది.  మన ఆరోగ్యం బాగుండాలంటే పర్యావరణాన్ని మరియు మన పరిసరాల్ని గ్రీన్ అండ్ క్లీన్ గా ఉంచుకోవడానికి మన మానవాళి అంతా అత్యంత శ్రద్ధతో పని చెయ్యాలి. 

*సమాజం నుంచి ధూమపానం పూర్తిగా నిషేధించాలి.*
 
ప్రధానంగా సమాజం నుంచి ధూమపానం పూర్తిగా నిషేధించాలి. ఆధునికతా పేరుతొ యువత సైతం ధూమపానానికి

బానిసలుగా మారుతున్నారు. తద్వారా సమాజంలోని స్వచ్ఛమైన ఆక్సిజన్ ను కలుషితం చేస్తున్నారు. వీటిని నిషేధించడం వల్ల వాయు కాలుష్యం తగ్గుతుంది. 

పరిశ్రమల్లో కాలుష్య నియంత్రణ కార్యక్రమాలను పటిష్టంగా అమలు చెయ్యాల్సిన భాద్యత ప్రభుత్వాలదే. ఇవి విడుదల చేస్తున్న విష వాయువులు పర్యావరణం లోని స్వచ్ఛమైన ఆక్సిజన్ ను

విష పూరితంగా మార్చేస్తున్నాయి. తద్వారా ప్రజలు భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ విష వాయువులను రీ సైక్లింగ్ విధానంగా ద్వారా ఇతర పనులకు వినియోగించుకునేల చర్యలు చేపట్టవచ్చు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam