DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆనందయ్య మూలికా మందు తయారీకి అనుమతి ఇవ్వండి 

*తిరుపతి వాసులకు ఉచితంగా ఇంటింటికి పంపిణీ చేస్తాం.* 

*తిరుపతి శ్రీవారి సేవకుడు నవీన్ కుమార్ రెడ్డి వినతి*

*(DNS report : వెంకటాచార్యులు S, బ్యూరో చీఫ్, శ్రీకాకుళం)* 

*శ్రీకాకుళం, జూన్ 10, 2021 (డిఎన్ఎస్):* ఆనందయ్య మూలికా మందు తయారీకి అనుమతి ఇవ్వండని తిరుపతి శ్రీవారి సేవకుడు నవీన్ కుమార్ రెడ్డి

వినతి చేస్తున్నారు. ఈ మూలికా వైద్యం లో ఎటువంటి ప్రమాదం లేదని ఆయుష్ ప్రకటించిన నేపథ్యంలో తిరుపతి  నగరవాసులందరికీ ఈ మందును ఉచితంగా పంపినే చేసేందుకు తయారీకై ప్రభుత్వాన్ని అనుమతి కోరుతున్నట్టు తెలిపారు. తిరుపతి నియోజకవర్గ ప్రజల కొరకు తన సొంత నిధులతో మా తండ్రి పి.ముని రెడ్డి (మాజీ మున్సిపల్ చైర్మన్) జ్ఞాపకార్థం

ఆసక్తిగల ప్రతి ఒక్కరికి ఉచితంగా ఆనందయ్య వినియోగించిన వనమూలికలతో కరోనా నివారణ మందు తయారుచేసి ఇచ్చే అవకాశం కల్పించాలన్నారు. 

చంద్రగిరి శాసనసభ్యులు సోదరులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కేవలం తన నియోజకవర్గ ప్రజల ఆరోగ్య రీత్యా కరోనా నివారణ మందు తయారు చేయించి ప్రతి ఇంటికి పంపిణీ కి రంగం సిద్ధం చేయడం

అభినందనీయం అదే స్ఫూర్తితో జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో శాసనసభ్యులు ఉచిత కరోనా నివారణ మందు పంపిణీకి ముందుకొస్తే నెల్లూరు ఆనందయ్య మందు కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా పోతుంది, ప్రజలు సంతోషిస్తారన్నారు

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య కరోనా నివారణకు వాడిన వనమూలికలను తిరుపతిలో ఆయుర్వేదంలో MD

చేసి అపార అనుభవం కలిగిన వైద్య నిపుణులు డాక్టర్ పార్థసారథి గారి పర్యవేక్షణలో యధావిధిగా వినియోగించి మందు తయారు చేసి నగరంలోని 50 డివిజన్లలో "ఆసక్తి" గల ప్రజలకు మాత్రమే అందజేస్తామన్నారు.

టీటీడీ వారు సహృదయంతో డి అర్ మహల్ వద్ద గల రెండవ సత్రాలలో వనమూలికల సమీకరణకు మందు తయారీకి స్థలం కేటాయించాలని టిటిడి ఈవో

గారికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేస్తానన్నారు

తిరుపతి నగర ప్రజలతో పాటు ఆసక్తి ఉన్న టిటిడి, నగరపాలక సంస్థలతో పాటు ప్రభుత్వ ప్రైవేటు రంగాలలోని ఉద్యోగస్తులు ఫ్రంట్ వారియర్స్ అందరికీ కూడా మందు ఇచ్చేందుకు రాజకీయ పార్టీలకు అతీతంగా స్నేహితుల,స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో ప్రణాళికలు సిద్ధం

చేస్తున్నానన్నారు

నెల్లూరు జిల్లాలోని నా మిత్రుల ద్వారా కృష్ణపట్నం ఆనందయ్య శిష్య బృందం నుంచి ఇద్దరిని మందు తయారీ పర్యవేక్షకులుగా రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు

తిరుపతి నగరంలోని అన్ని డివిజన్లలో ప్రతిరోజు 200 కుటుంబాలకు మందు పంపిణీ చేసేందుకు నగరపాలక సంస్థ పాఠశాలలలో వార్డు వాలంటీర్

ల సహకారంతో అనుమతించేలా కమిషనర్, మేయర్,కార్పొరేటర్ లను కలిసి విజ్ఞప్తి చేస్తానన్నారు

ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ వర్తక సంఘం నాయకులతో మాట్లాడి జిల్లా నలుమూలల నుంచి ఆనందయ్య మందు తయారీకి కావలసిన వనమూలికలను రైతుల నుంచి సేకరించి కొనుగోలు చేసే విధంగా ప్రయత్నాలు

ప్రారంభించానన్నారు

చిత్తూరు జిల్లాలో కోవిడ్ నిబంధనలు,కర్ఫ్యూ,పోలీస్ ల ఆంక్షల కారణంగా ఆనందయ్య మందు తయారీకి వ్యక్తిగతంగా తనకు అనుమతి ఇవ్వలేని పక్షంలో టీటీడీ,ఇస్కాన్ లాంటి ధార్మిక సంస్థలతో పాటు జిల్లా అధికార యంత్రాంగం నియోజకవర్గ శాసనసభ్యుల సహకారంతో ఆయా నియోజకవర్గ ప్రజలకు కరోనా నివారణ మందు అందించేలా

చర్యలు చేపట్టాలన్నారు

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam