DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*నరరూప రాక్షసుడైన టిప్పూ ని దేశ భక్తుణ్ణి ని చేసేసారు!* 

*టిప్పు పాలనపై చరిత్రకారులు చెప్పిన అక్షర నిజాలు ఇవే..* 

*విగ్రహం ఏర్పాటుపై విహెచ్ పి నేత పూడిపెద్ది శర్మ మండిపాటు* 

*(DNS report : వెంకటాచార్యులు S, బ్యూరో చీఫ్, శ్రీకాకుళం)* 

*శ్రీకాకుళం, జూన్ 26, 2021 (డిఎన్ఎస్):* ఒక నరరూప రాక్షసుడైన టిప్పూ సుల్తాన్ ని దేశభక్తుడిని చేసేసిన ఘనత భారత దేశ కుహనా

మేధావులదేనని విశ్వ హిందూ పరిషత్ విశాఖ సంయుక్త కార్యదర్శి పూడిపెద్ది శర్మ మండిపడ్డారు. 

భారత దేశ చరిత్రను నాటి పాలకులు పూర్తిగా తప్పు దారి పట్టించి ఈ దేశాన్ని సర్వ నాశనం చేసిన దుర్మార్గులు, క్రూరులను గొప్పగా మార్చి విద్యా పుస్తకాల్లో రాసి, అసలు చరిత్రను పూర్తిగా భ్రష్టు పట్టించారు అనడానికి టైపు

ఛారిటీ ప్రత్యక్ష నిదర్శనం. 

వాస్తవానికి పూర్తిగా హిందూ ద్వేషి, ఎడారి మతోన్మాది అయినా టిప్పు సుల్తాన్ లక్షలాది మంది హిందువులను అత్యంత కిరాతకంగా హత్యచేసిన దుర్మార్గుడు. ఇదే విషయాన్నీ చరిత్రకారులు ఆనాడే తమ రచనల్లో ప్రకటించారు. 

ఔరంగజేబ్‌ గుణాలే టిప్పు సుల్తాన్‌వి కూడా

సందీప్‌

బాలకృష్ణ వ్రాసిన "టిప్పు సుల్తాన్‌: ది టిరాంట్‌ ఆఫ్‌ మైసూర్‌" అన్న పుస్తకంలో టిప్పు గురించిన వివరాలు ఇలా ఉన్నాయి. "భారతదేశ చరిత్రలో ఔరంగజేబు అత్యంత పరమత ద్వేషిగా పేరుపొందాడు. ఇతడు 18వ శతాబ్దం ప్రారంభంలో మొఘల్‌ సింహాసనాన్ని అధిష్ఠించేడు. తన యాభై ఏళ్ళ సుదీర్ఘ పాలనలో ఔరంగజేబు హిందువుల జీవితాలపై, వారి

ఆచారాలపై, వారి ఆరాధనా స్థలాలపై విధ్వంసక దాడులకు పాల్పడ్డాడు. ఔరంగజేబు పాలనలో ఆగ్రా, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, కాశ్మీర్‌, పంజాబ్‌, హర్యానాలలోని హిందువులు దురాగతాలకు గురయ్యారు. 
టిప్పు పాలన కేవలం కర్ణాటకలో అధిక భాగం, కేరళ, తమిళనాడు, ఆంధ్రాలలో కొన్ని ప్రాంతాలలో పాలిచింది 17 ఏళ్ళే.

 హిందువుల సంప్రదాయాలపై, పుణ్యక్షేత్రాలపై, హిందూ సమాజంపై, హిందూ స్త్రీలపై అతడి దురాగతాలు కొనసాగాయి."

కేవలం రెండే హిండూ దేవాలయాలు మిగిలాయి

బ్రిటిష్‌ చరిత్రకారుడు లూయిస్‌ రైస్‌ తన "హిస్టరీ ఆఫ్‌ మైసూర్‌ అండ్‌ కూర్గ్‌" పుస్తకంలో ఇలా వ్రాసాడు: "టిప్పుసుల్తాన్‌ చనిపోయేనాటికి అతని

సామ్రాజ్యంలో రెండే హిందూ దేవాలయాలు మిగిలాయి. అవికూడా మైసూరు దగ్గరలో గల శ్రీరంగపట్టణం కోటలో. అక్కడ నిత్య పూజలు జరుగుతూండేవి. తన జాతకాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించి తన మంచిచెడులను చెప్పే బ్రాహ్మణ పండితుల సంతృప్తి కోసమే ఈ రెండు దేవాలయాలను మిగిల్చేడు. తాను ధ్వంసం చేసిన మిగతా హిందూ దేవాలయాల ఆస్తులన్నింటినీ 1790కి ముందే

స్వాధీనం చేసుకున్నాడు."


విలియం లోగాన్‌ మలబార్‌ కలెక్టర్‌గా పనిచేసే వాడు. తన 'మలబార్‌ మాన్యువల్‌'లో ఒకప్పటి హిందూ దేవాలయాన్ని టిప్పు సుల్తాన్‌ మనియార్‌ మసీదుగా మార్చేసాడని పేర్కొన్నాడు.
తన మలబార్‌ దండయాత్రలో టిప్పు సుల్తాన్‌ ఆడవారిని, పసిపిల్లల్ని కూడా వదలకుండా చిత్రవధ చేసాడని

లూయిస్‌ బి. బౌరీ అనే చరిత్రకారుడు పేర్కొన్నాడు.

'టిప్పు సుల్తాన్స్‌ మైసూర్‌: ఎన్‌ ఎకనామిక్‌ హిస్టరీ' అన్న పుస్తకంలో ఎం.హెచ్‌. గోపాల్‌ ఇలా అంటారు: "టిప్పు సుల్తాన్‌ విధించే ఇంటి పన్నులు, పంటలు, ఇంకా ఇతర వాడుక వస్తువులపై విధించే పన్నుల నుండి ముస్లింలకి మినహాయింపు ఉండేది. టిప్పు క్రైస్తవులను తన

రాజ్యం నుండి వెళ్ళగొట్టి వాళ్ళ ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకున్నాడు. ఇక ఇస్లాంలోకి మతం మారేవారికి ఎన్నో తాయిలాలు ఆశ చూపించేవాడు. వాళ్ళకి ఏరకమైన పన్నులూ విధించేవాడు కాదు. తన పాలనా యంత్రాంగంలోని అన్ని పదవులనుంచీ హిందువులనందర్నీ తొలగించాడు. ఆ పదవులను ముస్లింలకు కట్టబెట్టాడు. ఒక్క దివాన్‌ పున్నయ్యను మాత్రం తన

అవసరం దృష్ట్యా ఆ పదవిలో కొనసాగించాడు."

హిందువులపై ఆటవిక దాడులు

ఎం.హెచ్‌. గోపాల్‌ తన పుస్తకంలో ఇంకా ఇలా పేర్కొన్నారు: "ప్రభుత్వపరమైన గణాంకాలన్నింటినీ పర్షియన్‌ భాషలోనే నమోదు చేయాలని టిప్పు సుల్తాన్‌ ఆదేశిం చాడు. అంతకు ముందు ఆ వివరాలు కన్నడ భాషలో నమోదయ్యేవి. ఆ తరువాత ఆ వివరాలను మరాఠీ

భాషలోకి అనువదించేవారు.

బ్రిటిష్ నుంచి చావు దెబ్బ. .. . .

వెనకటి సామ్రాజ్యాన్నీ, వైభవాన్నీ పొందటమే ఇప్పుడు టిప్పు ముందున్న లక్ష్యం. ఈ పరిస్థితుల్లో తనకన్నా బలవంతులైన బ్రిటిష్‌ వారితో తలబడాలంటే తన రాజ్యంలో అధిక సంఖ్యాకులైన హిందువుల విశ్వాసాన్ని చూరగొనాలి. హిందువుల ఆగ్రహానికి గురైతే తన ఉనికికే

ప్రమాదం వాటిల్లుతుందని గ్రహించాడు. నాటి నుంచి హిందువులను మచ్చిక చేసుకోవటం కోసం రకరకాల వేషాలు వేసాడు.

గతి, విధి లేకే శృంగేరికి కానుకలు. .. 

బ్రిటిష్ నుంచి చావుదెబ్బ తప్పించుకోడానికి హిందువుల మద్దతు కోసం శృంగేరి పీఠం కాళ్ళు పట్టుకున్నాడు. శృంగేరి మఠానికి ఎన్నో అమూల్యమైన కానుకలను సమర్పించేడు

టిప్పుసుల్తాన్‌. కానీ మనదేశంలోని మేధావులుగా చలామణి అవుతున్నవారు, చరిత్రకారులు ఇది టిప్పు సుల్తాన్‌ పరమత సహనానికి అత్యుత్తమ ఉదాహరణగా వక్రీకరించారు. 

పూర్తిగా హిందూ ద్వేషి . .. 
 
టిప్పు సుల్తాన్‌ లక్షలాది మంది హిందువులను చంపడం తో పాటు బ్రాహ్మణులను చిత్రవధలకు గురిచేశాడు. అతడు పరమత సహనం కలవాడే

అయితే తన రాజ్యంలో లెక్కలేనన్ని హిందూ దేవాలయాలని ఎందుకు విధ్వంసం చేయించేడు? పెద్ద సంఖ్యలో హిందువులను బలవంతంగా ఎందుకు ఇస్లాంలోకి మార్చేడు. అందుకు ఒప్పుకోని వారిని అమానుషంగా చంపించేడు కదా. తన రహస్య లేఖలలో ముస్లిమేతరులని 'కాఫిర్లు' అనే సంబోధించేవాడు.

లీలా ప్రసాద్‌ తన "పొయెటిక్స్‌ ఆఫ్‌ కాండక్ట్‌:

ఓరల్‌ నెరేటివ్‌ అండ్‌ మోరల్‌ బీయింగ్‌ ఇన్‌ ఎ సౌత్‌ ఇండియన్‌ టౌన్‌"లో సురేంద్రనాథ్‌ సేన్‌ మాటలను ఇలా ఉటంకించాడు: "1791లో టిప్పుపై శత్రువుల ఒత్తిడి తీవ్రంగా ఉంది. అందువల్ల తన రాజ్యంలోని హిందువులతో సఖ్యంగా ఉంటూ తన శత్రువుల ఆట కట్టించాలనుకుంటాడు."

జ్యోతిష్యంపై అమితమైన నమ్మకం: . ..
 
/> "లైఫ్‌ హిస్టరీ ఆఫ్‌ రాజా కేశవదాస్‌" అన్న పుస్తకంలో వి.ఆర్‌. పరమేశ్వరన్‌ పిళ్ళె జ్యోతిష్యం పట్ల టిప్పు సుల్తాన్‌ అమితమైన నమ్మకం గురించి ఇలా పేర్కొన్నారు. బ్రిటిష్‌ వారిని తరిమిగొట్టి దక్షిణ భారతానికి తానే పాదుషా కావాలనుకున్నాడు. స్థానిక జ్యోతిష పండితుల సలహాలను అనుసరించి మైసూరులోను, శృంగేరిపీఠంలో గల

హిందూ దేవాలయాలకు పెద్ద మొత్తంలో విరాళాలను, భూములను కానుకగా ఇచ్చాడు. ఇదంతా 1791 ఓటమి తరువాత, 1792 శ్రీరంగపట్నం ఒప్పందం తరువాతే జరిగింది. ఇదంతా హిందువులపై ప్రేమతో చేయలేదు. పాదుషాకావాలనే కోరికతో జ్యోతిష పండితుల సూచన మేరకే చేసాడు.

దేశభక్తి తో కాదు అధికారమదం తోనే బ్రిటిష్ తో యుద్ధం:. ..  

టిప్పు సుల్తాన్‌

దక్షిణ భారతానికి చక్రవర్తి కావాలనే ఉద్దేశ్యంతో బ్రిటిషు వారికి ఎదురు తిరిగాడు తప్ప దేశభక్తితో కాదు!

హిందూ పేర్లన్నీ మార్చాడు. . .

టిప్పు సుల్తాన్‌ పరమత సహనం ఏపాటిది అంటే మంగళపురి (మంగళూరు) పేరును జలాలా బాద్‌గా, కాన్ననోరే (కణ్వపురం) ని కుసనాబాద్‌గా, బెపూర్‌ (వైప్పుర) ని సుల్తానపట్టణంగా,

మైసూరుని నజారాబాద్‌గా, రత్నగిరిని ముస్తఫాబాద్‌గా, దిండిగుల్‌ని ఖలికబాద్‌గా, కాలికట్‌ని ఇస్లామాబాద్‌గా మార్చేసాడు. టిప్పు సుల్తాన్‌ మరణించాకే వాటి అసలు పేర్లు తిరిగి మనుగడలోకి వచ్చాయి.

గజని కంటే క్రూరుడు టిప్పు. . .: రాజ రాజ వర్మ 

వాతాక్కంకూర్‌ రాజరాజ వర్మ తన 'హిస్టరీ ఆఫ్‌

సాంస్క్రిట్‌ ఇన్‌ కేరళ' అన్న గ్రంథంలో టిప్పు సుల్తాన్‌ హిందూ దేవాలయాల మీద చేసిన దాడిని గురించి వ్రాస్తూ గజినీ మహమ్మద్‌ కన్నా క్రూరుడుగా టిప్పు సుల్తాన్‌ని అభివర్ణించాడు!

కోజికోడ్‌లోని తాలి, తిరువంనుర్‌, వరచ్కల్‌, పుతుర్‌, గోవిందాపురం, తలిక్కున్ను దేవాలయాల్ని టిప్పు సుల్తాన్‌ ధ్వంసం

చేసాడు. తలిప్పరంపు మరియు త్రిచంబరం లాంటి సుప్రసిద్ధ ఆలయాలు ధ్వంసం చేయించిందీ ఈ మహనీయుడే!
తనకి అవసరం వచ్చింది కాబట్టి ఔదార్యం వహించాడే కాని హిందువుల పట్ల టిప్పు 
సుల్తాన్‌లో ద్వేషం ఎప్పుడూ రగులుతూనే ఉండేది.

నవంబర్ 10 వేలాది మేల్కొటే అయ్యంగార్ల దారుణ హత్యలు. . .   

చారిత్రకంగా నవంబర్‌ 10న

ఏం జరిగిందో తెలుసా? ఈ రోజునే కర్ణాటకలోని కూర్గ్‌లో నివసించే మేల్కొటే అయ్యంగార్లను లక్షలాది మంది ని దీపావళి రోజున టిప్పు సుల్తాన్‌ అత్యంత  దారుణంగా చంపాడు. ఒక్క అయ్యంగార్లనే కాదు కూర్గ్‌లోని ఎంతో మందిని టిప్పు సుల్తాన్‌ దారుణంగా వధించాడు. వ్యానాద్‌, మలబారు ప్రాంతాలకు చెందిన నాయర్ల కుటుంబాలను సమూలంగా

నిర్మూలించాలని చూసాడు. ఈ వివరాలన్నీ తాను స్వయంగా వ్రాసిన లేఖలలోను, తన డైరీలలోను వ్రాసుకున్నాడు టిప్పు సుల్తాన్‌.

పూర్తిగా క్రూరుడు అని మొత్తం చరిత్రకారులంతా ఆధారాలతో ప్రకటించినా, భారతదేశ కుహనా రాజకీయ పార్టీలు, హిందూ ద్వేషులైన సెక్యులర్‌ మేధావులు ఒక నరరూప రాక్షసుడైన టిప్పూ ని దేశభక్తుడిని

చేసేసారు! 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam