DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గృహ పధకానికి పాత్రికేయులంతా దరఖాస్తు చెయ్యాలి:గంట్ల

ఆగస్టు 2 నుంచి దరఖాస్తులు విజెఎఫ్ లో అందుబాటు 
విశాఖపట్నం, జులై 28 , 2018 (DNS Online ): ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన అక్రిడైటెడ్ పాత్రికేయులకు గృహ సదుపాయం

కల్పిస్తూ ఒక జీఓ విడుదల చెయ్యడం శుభపరిణామమని వైజాగ్ జర్నలిస్ట్ ఫోరమ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు, కార్యదర్శి ఎస్. దుర్గారావు లు తెలిపారు. శనివారం విజెఎఫ్

ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశం lo వారు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా పాత్రికేయులంతా ఎదురుచూసిన మంచి అవకాశం ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిందని,

దీనికై విజెఎఫ్ సంపూర్ణ సహకారం అందించేందుకు కృషి చేస్తుందన్నారు. దీనికి సంబంధించిన ఇళ్లకు సంబంధించిన వివరాలను కేవలం ఆన్ లైన్ ద్వారానే నింపవలసి

ఉంటుందన్నారు. వాటికి సంబంధించిన దరఖాస్తులను విజెఎఫ్ కార్యాలయం లో అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపారు. జిఓ లో తెలిపిన వివిధ క్యాటగిరీల్లోని ఇళ్ల పధకాన్ని

అక్రిడైటెడ్ పాత్రికేయులంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. దీనికై జిల్లా పౌర సంబంధాల శాఖా అధికారులతో చర్చించి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.

ఆయా విభాగాల్లో ఒక్కొక్క ఇంటికి రూ. 4 .50 లక్షల రూపాయలు సబ్సిడీ గా ఇస్తుందన్నారు. మిగిలిన మొత్తంలో బ్యాంకు ఋణం తో పాటు లబ్ధిదారుడు వాటా కూడా కొంత మొత్తం

చెల్లించాల్సి ఉంటుందన్నారు. అయితే ప్రభుత్వం జరీ చేసిన జీవో లో కొన్ని సవరణలు చేయాలనీ జర్నలిస్ట్ సంఘాలు ప్రభుత్వాన్ని కోరడం జరిగిందని తెలియచేసారు.   ఆగస్టు 2

నుంచి దీనికి సంబంధించిన దరఖాస్తులను విజెఎఫ్ కార్యాలయం నుంచి పొందవచ్చన్నారు. అక్రిడైటెడ్ పాత్రికేయులు తమ అక్రిడైటెషన్ నకలు పాసుపోర్టు సైజు ఫోటో, ఆధార్

కార్డు నకలు లతో దరఖాస్తును విజేఫ్ కు సమర్పించాలని సూచించారు. ఈ విలేకరుల సమావేశం లో విజెఎఫ్ కమిటీ ఉపాధ్యక్షులు ఆర్ నాగరాజు పట్నాయక్, నానాజీ, సంయుక్త

కార్యదర్శి దాడి రవికుమార్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. 

 

#dnslive #dns #VJF #Journalist #Journalists #vizag #visakhapatnam #dnsnews  #dns live #dns media #government #govt #GO #house #building #sites

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam