DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రశ్నించడం ద్వారా కలిగే పరిష్కారాలే స్టార్ట్ అప్ సంస్థలు :   జె ఏ చౌదరి

విశాఖపట్నం, జులై 30 , 2018 (DNS Online ) : ఏదేని సమస్యపై ప్రశ్నించడం అనేది అలవాటైతే వాటికి పరిష్కారం ఆ సమస్యే చూపిస్తుందని, దానికి కార్యాచరణే స్టార్ట్ అప్ సంస్థల ఆవిర్భావం

అని  à°°à°¾à°·à±à°Ÿà±à°° ప్రభుత్వ ఐ à°Ÿà°¿ సలహాదారు జె ఏ చౌదరి తెలియచేసారు. సోమవారం నగరానికి వచ్చిన అయన విశాఖలో 8 రోజుల పాటు నిర్వహిస్తున్న వైజాగ్ స్టార్ట్ అప్ సమ్మిట్ ను

ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ గతంలో మనం సిలికాన్ వాలీ, ఇతర విదేశీ సంస్థల సహకారంతో స్టార్ట్ అప్ లు చేపట్టేవారమని ప్రస్తుతం భారత దేశంలోనే అనేక

అవకాశాలు ఉన్నాయని డిజిటలీకరణ విస్తృతంగా అభివృద్ధి చెందిన తరుణంలో సమస్యలను గుర్తించి పరిష్కారం సాంకేతికంగా ఆలోచించడమే స్టార్ట్ అప్ సంస్థలకు మంచి వనరు

అవుతుందని అయన పేర్కొన్నారు. త్వరలో స్టార్ట్ అప్ లకు సంబందించి అక్టోబర్ 22-25 వరకు విశాఖ ఫిన్ టెక్ వ్యాలీలో అంతర్జాతీయ పోటీ స్టార్టుప్ లకు నిర్వహిస్తున్నామని 100

మిలియన్ల ప్రైజ్ మనీ తో పాటు వారికి కొన్ని ప్రాజెక్టులు కూడా తామే సమకూరుస్తామని చెప్పారు. సమావేశానికి అధ్యక్షత వహించిన సదస్సు చైర్మన్ మాధవ్ రెడ్డి

మాట్లాడుతూ గతంలో 2 రోజుల స్టార్ట్ అప్ కార్యక్రమాన్ని నిర్వహించామని, ప్రస్తుతం 8 రోజుల పాటు అతిపెద్ద స్టార్ట్ అప్ సమ్మిట్ గా దీనిని నిర్వహిస్తున్నామన్నారు.

సంస్థల ప్రారంభానికి గల అవకాశాలు, ప్రభుత్వ ప్రోత్సాహం, వివిధ కార్పొరేట్ లతో టై అప్ వంటి కార్యక్రమాలకు ఇందులో శ్రీకారం చుడుతున్నామన్నారు. వివిధ కార్పొరేట్

సంస్థలు, ఐ టి సంస్థలు, కళాశాలల విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరై స్టార్ట్ అప్ సంస్థలు నెలకొల్పేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో

నాస్కామ్ సెంటర్ అఫ్ ఎక్స్లెన్స్ డైరెక్టర్ రఘురాం, గూగుల్ ఇండియా డెవలపర్ రిలేషన్స్ లీడ్ కార్తీక్ పద్మనాభం, ఏ పి ఐ టి ఏ అదనపు సిఈ ఓ విన్నీ పాత్రో తదితరులు

హాజరయ్యి రాష్ట్రం లో కొత్త ఆలోచనలతో వచ్చే వారికీ ఇచ్చే ప్రోత్సాహం గురించి పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా వివరించారు. పలువురు విద్యార్థులు తమ ఆలోచనలను,

సమస్యల పరిష్కారం వంటి అంశాల పై వివరించారు.

 

#dns #dnsnews #dnslive #dns live #dns news #IT #startup #andhra pradesh #government #ja choudary #startup summit #visakhapatnam #vizag #vizag news #fortune inn

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam