DNS Media | Latest News, Breaking News And Update In Telugu

AP HC sentensed Imprisonment to 5 IAS officials

*(DNS report : పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి, సెప్టెంబర్ 02, 2021 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ పరిపాలన వర్గాలకు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. కోర్టు ధిక్కార నేరం క్రింద ఐదుగురు ఐఏఎస్ అధికారులకు జైలుశిక్ష తో పాటు జరిమానా కూడా విధించింది. ప్రస్తుతం వీరిలో ఒకరు (మన్మోహన్ సింగ్ )  పదవి విరమణ

చెయ్యగా, మిగిలిన వారు (శేషగిరిబాబు, రావత్, ముత్యాలరాజు, ఇంతియాజ్ లు ) సీఎంవో సహా కీలక విభాగాల్లో అధికారులుగా ఉన్నారు. వివరాల్లోకి వెళితే. . 

నెల్లూరు జిల్లాలోని తాళ్లపాకకు చెందిన సాయి బ్రహ్మ అనే అనే మహిళ వద్ద భూమి తీసుకున్న అధికారులు పరిహారం మాత్రం చెల్లించలేదు. దీంతో గతంలో ఆమె హైకోర్టును ఆశ్రయించింది.

కేసు విచారించిన హైకోర్టు, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి తగిన పరిహారం ఇవ్వాలని అప్పట్లో ఆదేశాలు ఇచ్చింది. 

ఆ ఆదేశాలు నేటికీ అమలు కాకపోవడంతో పిటిషనర్ మరోసారి కోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ వ్యవహారంపై విచారణ జరిపిన హైకోర్టు.. ఇందుకు బాధ్యులైన ఐఏఎస్ అధికారులపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకునేందుకు

సిద్ధమైంది.

ఆ అధికారులు వీరే: . .

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ కు నెల రోజుల జైలుశిక్ష, వెయ్యి రూపాయల జరిమానా, 

అప్పటి నెల్లూరు కలెక్టర్ శేషగిరిబాబుకు 2 వారాల జైలుశిక్ష, వెయ్యి రూపాయల జరిమానా, 

ప్రస్తుత ఆర్ధికశాఖ కార్యదర్శి రావత్ కు నెల రోజుల జైలుశిక్ష, వెయ్యి రూపాయల

జరిమానా,

 సీఎంవోలో జీఏడీ పొలిటికల్ కార్యదర్శిగా ఉన్న ముత్యాలరాజుకు రెండు వారాల జైలుశిక్ష, జరిమానా విధించింది. 

అలాగే మరో ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ కు సైతం రెండు వారాల జైలుశిక్ష, జరిమానా విధిస్తూ హైకోర్టు ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. 

గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా

ఉల్లంఘించినందుకు కోర్టు ధిక్కార చర్యల కింద హైకోర్టు జైలుశిక్షలతో పాటు జరిమానా విధించింది. ఇందులో అధికారులకు విధించిన జరిమానాల్ని వారి జీతాల నుంచి వసూలు చేసి పిటిషనర్ కు ఇవ్వాలని హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. దీంతో అధికారులు ఇరుకునపడ్డారు. వీరికి హైకోర్టు విధించిన శిక్ష, జరిమానాపై అప్పీలుకు వెళ్లేందుకు

వీలుగా నెల రోజుల పాటు శిక్షల్ని సస్పెండ్ చేసింది.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam