DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బ్రాహ్మణ కార్పొరేషన్ బీసీ సంక్షేమంలో విలీనం పై విమర్శలు

*శారదా పీఠాధిపతులు, బ్రాహ్మణ సంఘాలు విముఖత*  

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 26, 2021 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ ను దేవాదాయ శాఖా నుంచి బీసీ సంక్షేమ శాఖా లో విలీనం చేయడంపై శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ

వ్యవహారంపై ముఖ్యమంత్రి కార్యాలయం తో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఒక ప్రకటనలో స్వామీజీ తెలియజేశారు 

ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ ప్రతినిధులు సైతం ఈ నిర్యాణంపై విముఖతకు వ్యక్తం చేసారు. ఈ మేరకు సంఘం అధ్యక్షులు జ్వాలాపురం శ్రీకాంత్ ఈ నిర్ణయం విరమించుకోవాలని, దేవాదాయ శాఖలోనే కొనసాగించాలని కోరుతూ

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి,  ఎంపీ మిధున్ రెడ్డి కి వినతి పత్రం అందించారు. ఈ బృందంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యనమండ్ర సాయి సురేష్,వెల్లాల మధుసూదన్ శర్మ, శ్రీనిధి రఘ, అనిల్, రవికిరణ్, రాయచోటి నరేష్ మొదలైన సభ్యులు పాల్గొన్నారు

ఇప్పడికే అఖిలభారత శ్రీవైష్ణవ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఈ

విలీనాన్ని తప్పు పడుతూ తిరిగి యధావిధిగా దేవదాయశాఖలోనే కొనసాగించాలని డిమాండ్ చేసిన విషయం  తెలిసిందే. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam