DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బ్రాహ్మణులు బీజేపీకి దూరం అయ్యారా? దూరం చేసారా 

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, అక్టోబర్ 07,  2021 (డిఎన్ఎస్):* భారతీయ జనతా పార్టీ. . .ఈ పార్టీ ఆవిర్భావం వెనుక, అనుబంధ సంఘాల బలం అన్నింటి వెనుక అధిక శాతం మేధావులు, యువత, మహిళలు ఇలా ఎందరో ఉన్నారు. వాళ్లంతా ఒక్కటే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. ఒకానొక సమయంలో భారతీయ జనతా పార్టీ అంటే . . బ్రాహ్మణా సామజిక వర్గం అనే

ప్రచారం దేశ వ్యాప్తంగా సాగింది అంటే వీళ్ళు పార్టీ అభ్యున్నతికి ఏ స్థాయిలో కృషి చేశారో తెలుస్తోంది. ఇతర సామాజిక రంగాలకు చెందిన మేధావుల పాత్ర కూడా ఈ పార్టీలో ఉన్నప్పడికి అధిక శాతం బ్రాహ్మణులే అన్నది వాస్తవం. ఇది పూర్తిగా గతచరిత్ర.  నేడు ఈ పార్టీలో ఈ సామాజిక వర్గం ప్రతినిధులను చేతివేళ్ల మీద లెక్కించవచ్చు. దీనికి

కారణం. . .వీరిని ఏమాత్రం గుర్తించక పోవడమే. ఇతర రాజకీయ పార్టీల మాదిరిగా పార్టీ లో వ్యతిరేకత ఉంటె. . ఈ పార్టీ ని తిట్టి, ప్రక్క పార్టీలోకి జంప్ చెయ్యడం అనేది బ్రాహ్మణులకు అలవాటు లేదు. గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకూ అన్ని కమిటీలు, ప్రాంతాల్లోనూ, పదవులు ఇవ్వకపోవడం సరే,  అసలు పార్టీ ప్రాధాన్యతే ఇవ్వకపోవడం తో బీజేపీ

వీరిని తిరస్కరించినట్టుగానీ భావిస్తున్నారు. దాంతో పార్టీకి ఈ సామాజిక వర్గం దాదాపుగా దూరమై పోయింది. ఏదో తూతూ మంత్రంగా నామ మాత్రపు పదవుల్లో ఒకరిద్దరు వ్యక్తులను నియమించి, ఎదో వీళ్లకి కూడా ఒక సీటు ఇచ్చాము అనిపించుకుంది. 

పార్టీ నిర్మాణం లోను, ఆ నిర్మాణానికి వెన్నంటి నిలబడ్డ హిందుత్వ సంఘాల్లో నేటికీ కీలక

 పాత్ర పోషిస్తున్న మాట వాస్తవం.  దీనికి నిదర్శనమే వారణాసి రామ్ మాధవ్. బీజేపీ కి జాతీయ ప్రధాన కార్యదర్శి గాను, ఈశాన్య రాష్ట్రాలు, కాశ్మీర్ లోను పార్టీని అభివృద్ధి పరచడంలో ఈయన కీలక పాత్ర వహించారు. నేడు వీరి సేవలు బీజేపీ కి అవసరం లేదు అను భావనలో వారిని పార్టీ లో దూరం పెట్టడం తో తిరిగి మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్

సంఘ్ కు వెళ్లిపోయారు. అదే విధంగా ప్రస్తుతం రాష్ట్ర కార్యవర్గంలో ఒకరిద్దరు కీలక పదవుల్లో ఉన్నప్పడికి పెద్దగా ఉపయోగం లేని స్థితి చేరుకుంది. 
ఇంతకాలం పార్టీ కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న ఈ సామాజిక వర్గం క్రమంగా బీజేపీ కి దూరం అవుతోంది అన్నది వాస్తవం. 

ఒకప్పుడు ప్రధాని అటల్ బిహారి వాజపేయి

నుంచి క్షేత్ర స్థాయిలో కార్యకర్తల వరకూ బ్రాహ్మణులే ఎక్కువగా ఉండేవారు. అయితే పార్టీ నేతల స్వయంకృతాపరాధం, ఆధిపత్య పోరు లో వీళ్ళు ఇమడలేక, ప్రాధాన్యత లేని చోట నిలవలేక బీజేపీ కి ఒక్కొక్కరుగా దూరం అవుతున్నారు. 

విశాఖ ప్రాంతంలో నారాయణ రావు, రామకోటయ్య, లాంటి సీనియర్లు సైతం పార్టీ కార్యకలాపాలకు దాదాపుగా దూరం

గా ఉంటె, ఇక సామాన్య కార్యకర్తలు పార్టీలో ఎలా కొనసాగ గలరో పార్టీ నేతలకే తెలియలి. 

ఒకానోక కాలం లో విశాఖ మాజీ మేయర్ డివి సుబ్బారావు నిష్క్రమణ అనంతరం బ్రాహ్మణులకు పార్టీ లో తగ్గిపోయింది అనడం కంటే తలుపులు మూసుకున్నాయి అనడం సబబుగా ఉంటుందేమో. , 

గత దశాబ్దాల నుంచి మీడియా వర్గాలు సైతం బీజేపీ పట్ల కొంత

సానుకూలంగా ఉన్నప్పడికి పార్టీ నుంచి ఎటువంటి సంఘీభావం రావణ లేదు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam