DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భూములు అన్యాక్రాంతం, నిర్లక్ష్యం లో దేవాదాయ సిబ్బంది

*మండిపడుతున్న బీజేపీ రాష్ట్ర ధార్మిక సెల్ సభ్యులు ఫణి*

*(DNS Report : Ganesh. BVS, Staff Reporter, Vizag)*

*విశాఖపట్నం, అక్టోబర్ 22,  2021 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ లోని దేవాలయాలను దాడులకు గురికాకుండా, ఆస్తుల అన్యాక్రాంతాకకుండా కాపాడతామని ఆ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రకటనలు ఇస్తూ ఉంటే అధికారులు మాత్రం

చేతులెత్తేశారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ధార్మిక సెల్ కమిటీ సభ్యులు విజయశంకర్ ఫణి తెలిపారు. 
దీనికి ప్రధాన కారణం విశాఖ నగర పరిధిలోనే దేవాదాయ ధర్మాదాయ శాఖ కు చెందిన  కోట్ల రూపాయల విలువ చేసే భూములు అన్యాక్రాంతం అవుతుంటే అధికారులు కళ్ళుమూసుకున్నారని మండిపడ్డారు. శుక్రవారం విశాఖ నగరం నడిబొడ్డులోని

దొండపర్తి లో రైల్వే డివిజనల్ మేనేజర్ ఆఫీస్ ఎదురుగా ఉన్న 645 గజాల స్థలం (విలువ సుమారు రూ. 40 కోట్లు కు పైమాటే) పలువురు అక్రమించుకున్నా పట్టించుకునే నాధుడే విశాఖ దేవాదాయ శాఖలో లేరన్నారు. దీన్ని స్వాధీనం చేసుకుని, రక్షించుకోవాల్సిన ఆలయ ఈఓ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారన్నారు. 

వివరాల్లోకి వెళితే . . .విశాఖ

పట్నం నగరం లోని అల్లిపురం శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి చెందిన 40 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి దొండపర్తి లో సుమారు 647 చదరపు గజాల స్థలాన్ని గడచిన 3 నెలల క్రితం దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు స్వాధీన పర్చుకొని దేవాదాయ ధర్మాదాయ శాఖ హెచ్చరిక బోర్డు ను పాతారు. కానీ ప్రస్తుతం ఆబోర్డు దురాక్రమణ దారులు తీసివేసి, తమ బోర్డులు

పెట్టి, హెచ్చరికలు కూడా పెట్టారు. వీరిపై క్రిమినల్ కేసులు పెట్టాల్సిన అధికారులు తమకి ఏమి పట్టనట్టు ఉండడం గమనార్హం అన్నారు. 
ఆక్రమణ దారులు హైకోర్టు కు వెళ్లారని, దేవాదాయ ధర్మాదాయ శాఖ పూర్తి నిర్లక్ష్య వైఖరి కారణంగా దురాక్రమణ దారులు కోర్టులో వేసిన పిటిషన్ కు కౌంటర్ ఫైల్ చెయ్యక ఎక్స్పర్టి అయ్యారని

తెలుస్తోందన్నారు.

తద్వారా కోట్లాది రూపాయల విలువ కల్గిన భూములు అన్యాక్రాంతమైపోతున్నాయన్నారు. శుక్రవారం ఘటన స్థలానికి వెళ్లిన బృందంలో స్థానిక బీజేపీ నేతలు, ధార్మిక సెల్ సభ్యులు ఉన్నారు. 

దీనిపై వివరణ కోరేందుకు అల్లిపురం వెంకటేశ్వర స్వామి ఆలయం ఈఓ ని సంప్రదించే ప్రయత్నం చేయగా ఆమె సెలవులో

ఉన్నట్టు తెలిసిందన్నారు. ఈ విషయం పై కార్యనిర్వహణ అధికారి ఊరిలో లేకపోవడం తో వచ్చిన తర్వాత ఏం చెబుతారో వేచి చూడాలన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam