DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీ వైష్ణవ ఆగమ సంప్రదాయమే శ్వాసగా .. శ్వాస్ అడుగులు

*29 నుంచి శ్వాస్ తొలి వార్షికోత్సవ వేడుకలపై DNS ప్రత్యేక కథనం*

*(DNS Report : Sairam. CVS, Bureau  Chief, Vizag)*

*విశాఖపట్నం, అక్టోబర్ 24,  2021 (డిఎన్ఎస్):*గాడి తప్పిన సనాతన సంప్రదాయ అలవాట్లు, శాస్త్ర సమ్మత విధానాలను ప్రస్తుత తరానికి తిరిగి అలవాటు చెయ్యాలనే తపన, సంకల్పంతో సంప్రదాయ హైందవ వేదవిద్యను అభ్యసించిన యువత ఆలోచనలకూ

సాకార రూపమే  శ్రీ వైష్ణవ ఆగమ సంప్రదాయ సేవా సమితి (శ్వాస్). 

ఈ సంస్థ ద్వారా సనాతన సంప్రదాయాలను అందరికి తెలియచేస్తూ, అవగాహనా కల్పిస్తూ, వాటిని పాటించవలసిన భాద్యత, తదుపరి వాటి ఫలితం ఎలా ఉంటుందో కూడా అందరికి తెలియాచేస్తూ, తాము ఆచరించి చూపుతున్నారు. ఈ సంస్థ ఏర్పడి ఒక ఏడాది కాలం పూర్తి  చేసుకున్న సందర్బంగా

వార్షికోత్సవాన్ని కూడా సంప్రదాయబద్దంగా నిర్వహిస్తున్నారు. 

ఆధ్యాత్మిక సంప్రదాయ వైభవాన్ని తెలియచేసేందుకు ఆగమ, వేదవిద్య సంప్రదాయంలో నిష్ణాతులైన పండితుల అనుగ్రహభాషణాన్ని అందరికి అందించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఉభయ వేదాంత ఆచార్య పీఠాధిపతులు త్రిదండి చిన్న జీయర్ స్వామి

ఆశ్రమం ముచ్చింతల్, భాగ్యనగరం  వేదికగా ఈనెల 29 నుంచి మూడు రోజుల పాటు అంతంత వైభవంగా విద్వత్ సభలు నిర్వహించనున్నారు.  

సంస్థ అధ్యక్షులు యాదగిరి స్వామి, ప్రధాన కార్యదర్శి కిషోర్ స్వామి వార్షికోత్సవ కార్యక్రమలను వివరించడం జరిగింది. 

ఉభయ వేదాంత ప్రవర్తకాచార్య, త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ

రామానుజ జీయర్ స్వామి ఆజ్ఞ అనుసారం గత ఏడాది కొరోనా మహమ్మారి విజృంభణతో అకాల మరణం చెందిన వారందరికీ జాతి, మతం, లింగ  భేదం లేకుండా అందరికి ఉత్తమ గతులు లభించాలి అని కోరుతూ వైభవేష్టి కార్యక్రమాన్ని భాగ్యనగరం లోని జెట్ నిలయంలో సుదీర్ఘంగా నిర్వహించామన్నారు. కేవలం పేరు, గోత్రం తెలియచేస్తే ఉచితంగా నే ఎంతో ఉత్కృష్టమైన

ఇష్టి నిర్వహించామని తెలిపారు. 

*వేడుకల వైభవం ఇదే. .. :*

ఈ సభల్లో చిన్న జీయర్ స్వామి, అహోబిల జీయర్ స్వామి, దేవనాధ జీయర్ స్వామి, ఇతర ఉభయ వేదాంత ప్రవర్తక పెద్దలు మంగళాశాసనం చేయనున్నారు. మూడు రోజుల పాటు జరుగనున్నసభల్లో ప్రముఖ ఆచార్యులు మంగళశాసనపూర్వక ఆశీస్సులు అందించనున్నారు. 
ఈ నెల 29 న

మహామహోపాధ్యాయ ఎస్వీ రంగ రామానుజాచార్య స్వామి అధ్యక్షతన జరిగే సభలో ప్రవచన వివరం.

1. ఆరాయిరప్పడి వైభవం (ఆవిర్భావాది) అంశంపై నేపాల్  కృష్ణమాచార్య స్వామి,  

2. యజుర్వేదం విష్ణుసూక్త వైభవం అంశంపై  కె.ఇ. స్థలశాయి స్వామి (భద్రాచలం ఆలయ స్థానాచార్యులు)  అంశం: 

3. భగవద్విషయం - కర్త అవతారికాసారం

అంశం పై  వంగల వెంకటాచార్య స్వామి (పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం స్థానాచార్యులు), 

4. శ్రీవేంకటాచలేతిహాసమాలా వైభవం అంశం పై  సముద్రాల శరగోపాచార్య స్వామి

ఈ నెల 30 న జరిగే సభలో ప్రవచన వివరం.

1. శ్రీమద్రామాయణం- భరత వైభవం అంశం పై ముడుంబై నరసింహ రంగాచార స్వామి ( గీతాభవనం, వరంగల్ ) 

2 .

శ్రీభాష్యం జిజ్ఞాసాధికరణ వైశిష్ట్యం అంశం పై  కండ్లకుంట వెంకట నరసింహాచార్య స్వామి ( భాగ్యనగరం )

3 .   గీతా భాష్య వైభవం (రామానుజ భాష్యం) c శిరిశినఘళ్ వెంకటాచార్య స్వామి ( భాగ్యనగరం)  

4. శ్రీ విష్ణు పురాణ వైభవం - శ్రీరామానుజ దర్శనం అంశం పై ఆచ్చి పాండురంగాచార్య స్వామి ( భాగ్యనగరం 

ఈ నెల 31 న

జరిగే సభలో ఇద్దరు ప్రముఖుల ప్రవచన సభ అనంతరం శ్వాస్ వార్షికోత్సవ సభ నిర్వహించనున్నారు. 

1. శ్రీమద్భాగవతం బ్రహ్మవిమోచన ఘట్టం అంశం పై  శ్రీభాష్యం శ్రీనివాసాచార్య స్వామి ( విశాఖపట్టణం ) 

2.  అధర్వవేదం 10 వ కాండం, 22 వ ప్రపాఠకంలోని - బ్రహ్మ ప్రకాశన సూక్తం - పరము నిరూపణం అంశం పై గుదిమెళ్ళ మురళీ

కృష్ణమాచార్య స్వామి ( భద్రాచలం ) 

అనంతరం శ్వాస్ వార్షికోత్సవ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో గతం లో శ్వాస్ నిర్వహించిన కార్యక్రమాలను వివరించి, భవిష్యత్  కార్యాచరణను ప్రకటించనున్నారు.  మూడు రోజుల వేడుకలను సోషల్ మీడియా ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసే అవకాశం  ఉన్నట్టు తెలిపారు. 

ఈ వేడుకల్లో

శ్రీ వైష్ణవ కుటుంబాల సభ్యులు, వైష్ణవ సంప్రదాయ అభిమానులు, ఆచరణపరులు, పండితులు, అందరూ ఈ  3 రోజుల కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా శ్రీవైష్ణవ ఆగమ సంప్రదాయ సేవాసమితి తరుపున ఆహ్వానిస్తున్నారు. 
కార్యక్రమ వివరాలకై  యాదగిరి స్వామి ( ఫో: +91 9502777196 ), కిషోర్ స్వామి (ఫో:  +91 6304062846 ), లను సంప్రదించవచ్చని తెలిపారు.  

మూడు

రోజుల పాటు జరుగనున్నఈ వేడుకలను DNS  మీడియా website ( www.dnslive.in ) ద్వారా వార్తా ప్రసారం చేయడం జరుగుతుంది.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam