DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అభియోగాలపై 18 మంది టీటీడీ ట్రస్టీలకు హైకోర్టు నోటీసులు

*(DNS Report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*  
 
*అమరావతి, అక్టోబర్ 28, 2021 (డిఎన్ఎస్):* క్రిమినల్‌ కేసులు, అధికార పార్టీతో రాజకీయ సంబంధాలు, తదితర అంశాల అభియోగం పై తిరుమల తిరుపతి దేవస్థానముల పాలకమండలి సభ్యులుగా ఉన్న 18 మందికి ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు నుంచి తాఖీదులు అందినట్టు తెలుస్తోంది. ఈ విధమైన సంబంధములు ఉన్న వారిని టిటిడి

లో నియమించడాన్ని సవాల్‌ చేస్తూ ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి జె. భానుప్రకాష్ రెడ్డి ద్వారా  
దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. వీరిలో కొంతమంది ఆర్థిక నేరాల కేసుల్లోనూ, కొంతమంది రాజకీయ బంధుత్వం ఉండడం, టీటీడీ బోర్డు సభ్యునిగా ఉండి కూడా అన్యమత ప్రార్థనల్లో పాల్గొన్న అభియోగం కూడా ఉండడం

గమనార్హం.
 
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ ఏవీ శేషసాయితో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది. 

రాష్ట్ర ప్రభుత్వ జీవోలు 568, 569ని సవాల్‌ చేస్తూ భానుప్రకాశ్‌ రెడ్డి వేసిన పిల్‌ మరోసారి విచారణకు రాగా పిటిషనర్‌ తరఫున ఎన్‌.అశ్వనీకుమార్‌ వాదనలు వినిపిస్తూ...

కోర్టు ఆదేశాలకు అనుగుణంగా టీటీడీ పాలకమండలిలో 18మంది సభ్యులను ప్రతివాదులుగా చేర్చామన్నారు. 

వారిపై ఉన్న క్రిమినల్‌ కేసుల వివరాలను అనుబంధ పిటిషన్‌ ద్వారా కోర్టు ముందు ఉంచామని, అందులోని వివరాలను పరిశీలించాలని కోరారు. 

దేవదాయ శాఖ చట్టంలోని సెక్షన్‌ 18 ప్రకారం క్రిమినల్‌ కేసులను

ఎదుర్కొంటున్న వారిని పాలకమండలి సభ్యులుగా నియమించడానికి వీల్లేదన్నారు.

వ్యాజ్యంలో ప్రతివాదులుగా దేవదాయ శాఖ ముఖ్యకార్యదర్శి, టీటీడీ ఈవో,  పాలకమండలి సభ్యులు : పోకల అశోక్‌,  మల్లాడి కృష్ణారావు,  కె.విద్యాసాగర్‌,  ఏపీ నందకుమార్‌,  వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి,  అల్లూరు మల్లీశ్వరి,

 ఆర్‌.విశ్వనాథ్‌రెడ్డి,  బుర్రా మధుసూదన్‌ యాదవ్‌,  కె. సంజీవయ్య, కాటసాని రాంభూపాల్‌రెడ్డి,  బండి పార్థసారథి రెడ్డి,  ఎన్‌.శ్రీనివాసన్‌,  రాజేశ్‌ శర్మ,  కేతన్‌ దేశాయ్‌,  పి.సనత్‌కుమార్‌,  జూపల్లి రామేశ్వరరావు,  మిలింద్‌ కేశవ్‌ నర్వేకర్‌, 
ఎంఎన్‌ శశిధర్‌లకు నోటీసులు జారీ చేస్తూ

కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. 

తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam