DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దివిసీమ కాళరాత్రి ఉప్పెన..విపత్కర ఘటనకు 44 ఏళ్ళు 

*ప్రకృతి విసిరిన సవాల్ నేటికీ సమాజాన్ని వణికిస్తోందా?*

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, నవంబర్ 19,  2021 (డిఎన్ఎస్):* 1977 నవంబర్ 19 శనివారం ప్రశాంతమైన రాత్రి. . .కృష్ణ జిల్లా దివిసీమ ప్రాంతం కాళరాత్రిగా మారిన దుర్ఘటనకు ప్రత్యక్ష నిదర్శనాలు నేటికీ కనపడుతూనే ఉన్నాయి. అనధికారిక లెక్కల ప్రకారం సుమారు 50

వేలమంది (అంచనా) ప్రజలు, 10 లక్షలకు పైగా పశు జీవాలు సముద్రుడి ఆగ్రహానికి అకారణంగా బలి అయినా రోజు. ఒక్కసారిగా దేశం యావత్తు కదిలించిన సంఘటన. తలుచుకుంటే నేటికీ భయంకరమైన కాళరాత్రి కళ్ళముందు కనపడుతూనే ఉందని. . .నాటి విపత్కర స్థితిని చూసిన వాళ్ళ నోటి వెంట వచ్చే మాట.   

కృష్ణా జిల్లాలోని దివిసీమ సముద్ర తీరంలో ఉండే

ప్రాంతం. 1977 నవంబర్ 19 మధ్యాహ్నం సముద్రంలో చిన్న అలజడి ప్రారంభమైంది. సాయంత్రానికి అలజడి ఉదృతమైంది. ఆ తర్వాత ఆ ఉదృతి పెను ఉప్పెనగా మారింది. ఉప్పెన ఉగ్రరూపం దాల్చడంతో సముద్రుడు ఊళ్లకు ఊళ్లనే కబళించాడు. రాత్రి పడుకున్నవారు. . నిద్రలోనే సుదీర్ఘ నిద్రలోకి జారుకున్నారు. 

అధికారిక లెక్కల ప్రకారం తెల్లారెసరికి

పదివేల మంది నీజీవులయ్యారు. దివిసీమ శవాల దిబ్బగా మారిపోయింది. ఎక్కడ చూసిన శవాలే, ఈ ఘటనలో నాలుగు లక్షల జంతువులు మృత్యువాతపడగా, మొత్తం రూ. 172 కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. 

అసువులు బాసిన వారికి గుర్తుగా దివిసీమలో స్తూపాలు నిర్మించి వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. నేటికి దివిసీమలో ఎవరిని కదల్చినా ఆ

విషాదచాయల గురించి కళ్లకు కట్టినట్లు చెబుతున్నారు.

ఆ రోజు అసలేం జరిగింది ?

ఉదయం నుండి తీవ్రమైన నల్లటి మబ్బులు ఆకాశం అంతా కమ్ముకొని దాదాపు గంటకు వంద మైళ్ళ కంటే వేగం తో గాలులు మొదలైనాయి. రాత్రి పది దాటిన తర్వాత తుఫాను భీభత్సం పెరిగి  మిన్నూ మన్నూ ఎకమయ్యేట్లు భీబత్సంగా వర్షం కురిసింది. అర్ధరాత్రి

పూట కట్టలు తెంచుకున్న ప్రవాహం గ్రామాలపై విరుచుకుపడింది.

200 కిలోమీటర్ల వేగంతో వీసిన ప్రచండ గాలులకు భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి. విద్యుత్‌ స్తంభాలు విల్లుల్లా వంగిపోయాయి. గ్రామం మొత్తాన్ని శ్మశానంగా మార్చింది. శవాల గుట్టల మధ్య తమవారి ఆనవాళ్లను వెతికేందుకు నానా కష్టాలు పడాల్సి

వచ్చింది. 

కోడూరు మండలంలోని పాలకాయతిప్ప, హంసలదీవి, ఇరాలి, ఊటగుండం, గొల్లపాలెం, బసవవానిపాలెం, ఉల్లిపాలెం..నాగాయలంక మండలంలోని ఏటిమోగ, సొర్లగొంది, ఎదురుమొండి, సంగమేశ్వరం, నాచుగుంట, ఏలిచట్ల దిబ్బ తదితర మత్స్యకార గ్రామాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కృష్ణాతోపాటు గుంటూరు జిల్లాలోనూ ఈ ఉప్పెన ప్రభావం

కనిపించింది. రేపల్లె, నిజాంపట్నం తదితర గ్రామాలు ప్రళయం దాటికి దెబ్బతిన్నాయి.

తదుపరి జరిగిన కార్యాచరణ ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని నింపిందని చెప్పాలి.

సుమారు 100 కి పైగా గ్రామాలు కొట్టుకుపోవడంతో సహాయ చర్యలు కోసం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, రాష్ట్ర పోలీస్ విభాగం, రామకృష్ణ మిషన్ వంటి సంస్థలు

చేపట్టిన కార్యాచరణ అందరికీ స్ఫూర్తి గా నిలిచింది. కొట్టుకు పోయిన గ్రామాలను వీళ్ళు దత్తత తీసుకుని ఇళ్లను కట్టించి ఇచ్చారు. మరి కొందరు వస్త్రాలు, ఇళ్లల్లో సామాగ్రి ఇలా ఎవరికీ తోచిన సాయాన్ని వాళ్ళు అందించి. ..బాధితులకు అండగా మేము ఉన్నాం అంటూ చేయూత గా నిలవడం మానవతకు నిదర్శనం. 

ప్రభుత్వ పరంగా సాంకేతిక

విజ్ఞానాన్ని విస్తృతంగా మెరుగు పరిచి, భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టారు. తదుపరి ఇతర ప్రాంతాల్లో జరిగిన సందర్భాల్లో తక్షణ సహాయక చర్యలు త్వరిత గతిన జరగడానికి దివి సీమ ఘటన నేర్పిన పాఠమే కావచ్చు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam