DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో బొగ్గు కొరత తో అవస్థలు*

*(DNS Report : P Raja, Bureau Chief, Amaravati)*

*అమరావతి, ఏప్రిల్ 22, 2022 (డిఎన్ఎస్):* దేశవ్యాప్తంగా బొగ్గు కొరతతో 12 రాష్ట్రాలు అల్లాడుతున్నాయి. ఏపీ , యూపీ , బీహార్ తదితర రాష్ట్రాల్లో 8 గంటల పాటు విద్యుత్ కోతలు అమలవుతున్నాయి . దీంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది . విద్యుత్ కోతలపై స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది . లక్ష అంతకు మించి జనాభా

ఉండే పట్టణాలలో డిస్కంలు 24 గంటల పాటు నిరంతరాయ విద్యుత్ను సరఫరా చేయాలని కేంద్ర విద్యుత్ శాఖ సూచించింది . ఈ నిబంధనను తక్షణమే అమల్లోకి తీసుకురావాలని పేర్కొంది . ఇందుకుగానూ ప్రతి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి సంబంధిత విద్యుత్ పంపిణీ సంస్థలకు ఆదేశాలివ్వాలని స్పష్టం : చేసింది . విద్యుత్ కోతల కారణంగా దేశంలోని చాలా

పట్టణాల్లో డీజిల్ జనరేటర్ల వినియోగం పెరిగింది . దీంతో కాలుష్యం గరిష్టస్థాయిలో పెరుగుతుందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది . ఈ పరిస్థితిని నివారించాలంటే ఖచ్చితంగా నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని అభిప్రాయపడింది . లక్షకు పైగా జనాభా ఉన్న పట్టణాల్లో కచ్చితంగా కరెంట్ తీసిన మూడు నిమిషాల్లో పునరుద్ధరించాలని

ఆదేశించింది . అలా చేస్తేనే నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసినట్లవుతుందని పేర్కొంది . కరెంట్ కోతలతో బాధపడేవారు కాలుష్య నివారణకు డీజిల్ బదులు ప్రత్యామ్నాయ జనరేటర్లను వినియోగించాలని సూచించింది . సాంప్రదాయేతర ఇంధనాన్ని బ్యాటరీ బ్యాకప్ సాయంతో వినియోగించుకోవాలని పేర్కొంది .

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam