DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బైక్ లు రానివ్వరు, మీరు బస్సులు వెయ్యరు ఘటాభిషేకం తర్వాత స్వాముల గతేంటి?

చందనయాత్ర ముగిసాక వైష్ణవ స్వాముల కోసం తిరుగు బస్సులు నడపాలి

ఘటాభిషేకం ముగిసిన తర్వాత స్వాములు సింహాచలం కొండ దిగడం ఎలా?

(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)  

విశాఖపట్నం, మే 2, 2022 (డిఎన్ఎస్):* వైశాఖ శుద్ధ తదియ దీన్నే అక్షయ తృతీయ అని పేరు ఈ రోజున విశాఖ పట్నం లోని సింహాచలం

క్షేత్రంలో వెలసిన ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దైవమైన శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి నిజరూప దర్శనం లభించనుంది. ఏడాది కాలం 500 కిలోల చందనం తో భక్తులకు దర్శనం ఇచ్చే స్వామి, నేడు ఒక్కరోజు మాత్రమే నిజ రూపాన్ని అనుగ్రహించనున్నాడు. 

ఘటాభిషేకం...:

సామాన్య భక్తులు అందరూ దర్శనం చేసుకున్న తర్వాత అదే రోజు

రాత్రి సుమారు 300 శ్రీవైష్ణవ స్వాములు గంగాధర నుంచి కలశ లతో తీసుకు వచ్చిన జనంతో స్వామికి సహస్ర ఘటాభిషేకం జరుగుతుంది. దీనిలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి వైష్ణవ స్వాములు సింహాచలం కు హాజరవుతుంటారు. ఈ కార్యక్రమం పూర్తి అయ్యేసరికి రాత్రి 12 గంటల ప్రాంతం అవుతుంది. ఈ సమయంలో కొండ కిందకు వచ్చేందుకు ప్రయాణ సదుపాయం

ఉండదు. కొండపైకి ద్విచక్ర వాహనాలు, కార్లను రానివ్వక పోవడంతో వైష్ణవ స్వాములు తిరిగి తమ ఇళ్లకు వెళ్లేందుకు బస్సులు మాత్రమే ఎక్కాల్సి ఉంది. ఆ బస్సులను రాత్రి నడపక పోవడంతో వీళ్ళందరూ నానా అవస్థలు పడుతున్నారు. 

సొంత వాహనాలను కొండ కిందే కిలోమీటర్ల దూరం లో నిలిపి వేస్తున్నారు. అక్కడికి చేరుకోవడం చాలా ఇబ్బంది

కరం. అందునా అర్ధరాత్రి ఘటాభిషేకం ముగిసి వెళ్లేసరికి వీళ్ళ ఒక వాహనం మాత్రమే ఉంటుంది. అయితే అక్కడ ఎటువంటి పోలీస్ సెక్యూరిటీ ఉండదు. వాహనం ఉంటె వీళ్ళ అదృష్టం, దొంగిలించబడితే వీళ్ళ ఖర్మ.  

గత కొన్నేళ్లుగా ఇదే అపచారం జరుగుతోంది. అయితే ఈ ఏడాది బస్సులను వైష్ణవ స్వాములు తిరిగి కొండ క్రిందకు వెళ్లే వరకూ నడప

వలసిందిగా కోరుతున్నారు. ఈ సమయంలో సామాన్య భక్తులు ఉండదు. కేవలం స్వాములు మాత్రమే ఉంటారు. వీళ్ళ పట్ల అపచారం చెయ్యడం మహా అపరాధం క్రిందకే వస్తుంది. వీళ్ళు కూడా స్వామి వారికి సేవ చేసుకునేందుకే వస్తున్నారు తప్ప వీళ్ళు దేవస్థానం ఉద్యోగులు కాదు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam