DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైష్ణవులు, శైవుల మధ్య విభేదాలు సృష్టించే ఉన్మాదులు తయారయ్యారు 

*శంకరులు భారతావనిలో పుట్టడం ఈ దేశానికే ఒక ఆధ్యాత్మిక ధనం*

*శంకర జయంతి వేడుకల్లో విశాఖ శారద పీఠాధిపతులు వెల్లడి* 

*విశాఖపట్నం, మే 07, 2022 (డిఎన్ఎస్):* ఇటీవల కాలంలో కొందరు పనిగట్టుకుని వైష్ణవులు, శైవుల మధ్య  విభేదాలు సృష్టించే ఉన్మాదులు తయారవుతున్నారని, ఇలాంటి ఉన్మాదులు సనాతన ధర్మానికి

విరోధులని  విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి హెచ్చరించారు. విశాఖ శ్రీ శారదాపీఠంలో శంకర జయంతి వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంప్రదాయాలు వేరుగా ఉన్నా. .. పరమాత్మను చేరుకునే మార్గాలను నిర్దేశించాయన్నారు. 

హిందూ సనాతన ధర్మానికి చెందిన యే

పీఠం కూడా ఇతరులను కించపరిచే విధంగా కార్యాచరణ చెయ్యవు అన్నారు. మానవాళి మనుగడకు హిందూ ధార్మిక పీఠాలు మూల స్థంభాలన్నారు. ప్రస్తుతం సనాతన ధర్మం ఉన్నత స్థాయికి చేరుకుంటున్న సమయంలో  హిందూ ధర్మాన్ని అడ్డుకునేందుకు జరిగే ప్రక్రియల్లో ఈ విభేదాలు సృష్టించడం కూడా భాగం కావచ్చు అన్నారు.  ఆది శంకరులు కేవలం బ్రాహ్మణులకే

సొంతం కాదని, లింగ, జాతి, మత భేదం లేకుండా అందరికి జ్ఞాన భిక్ష పెట్టారన్నారు. 
 
తాము నిర్వహించేది అది శంకరాచార్య సంప్రదాయ పీఠం అయినప్పడికి తమకు శ్రీవైష్ణవ క్షేత్రమైన శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి క్షేత్రం సింహాచలం అంటే ఎక్కువ మక్కువ అన్నారు.   

ఇటీవలే శ్రీవైష్ణవ సంప్రదాయంలో సర్వశ్రేష్ఠ

యతీశ్వరులు పరమహాస పరివ్రాజచకులు త్రిదండి చిన్న జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో వారి ఆశ్రమంలోనే 216 అడుగుల భారీ భగవద్రామానుజాచార్యుల విగ్రహ ప్రతిష్ట ఎంతో వైభవంగా జరిగిన విషయం తెలిసిందే దీనికి అన్ని సంప్రదాయాల పండితులను, పీఠాధిపతులనూ అహ్వాహించారు. అంతకు ముందు కేదార్ నాధ్ లో ఆదిశంకరాచార్యుల భారీ విగ్రహ

ప్రతిష్ట జరిగిందన్నారు. దీనిలోనూ ఎందరో ప్రముఖులు పాల్గొన్నారు. ఈ రెండు విగ్రహాలను ప్రారంభించిన వారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే కావడం గమనార్హం.

ఆదిశంకరాచార్యుల వారి జన్మదిన మహోత్సవం సందర్భంగా శుక్రవారం విశేష పూజలు చేపట్టారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల చేతులమీదుగా

అభిషేకం నిర్వహించారు. పీఠ ప్రాంగణంలో సామూహిక ఉపనయనాలు నిర్వహించారు. 

ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి ఆదిశంకరచార్యుల వారి జీవిత విశేషాలను, భారతావనిలో హైందవ ధర్మానికి ఆయన అందించిన సేవలను వివరించారు. భారతావనిలో హైందవ ధర్మాన్ని నిలబెట్టిన ఘనత ఆదిశంకరునికే దక్కుతుందని, ఆయన అవతరించకపోతే దేశం

అతలాకుతలమయ్యేదని స్పష్టం చేసారు. 

వేదాలు, శాస్త్రాలు, ఉపనయనాది సంస్కారములు కొనసాగుతున్నాయంటే ఆదిశంకరుల వారి భిక్షేనన్నారు. శైవులు, వైష్ణవులకు మధ్య భేదాలను పారద్రోలింది ఆయనేనని, శంకరులు ఏ వర్గానికో పరిమితం కాదని స్పష్టం చేసారు. 

శంకర జయంతిని కేంద్ర ప్రభుత్వం జాతీయ దినోత్సవంగా ప్రకటించాలని

కోరారు. ప్రతి ఇంటా భగవంతునితో సమానంగా శంకరాచార్యుల వారి చిత్రపటాన్ని ఉంచాలని పిలుపునిచ్చారు. పిల్లలు విద్యాలయాలకు వెళ్ళేముందు శంకరుని చిత్రపటానికి నమస్కరించాలని సూచించారు. దేశ వ్యాప్తంగా శంకర తత్వాన్ని ప్రచారం చేస్తున్న పీఠాల్లో విశాఖ శ్రీ శారదాపీఠం ముందుందన్నారు. శంకరులు రచించిన ప్రస్థాన త్రయ భాష్యాన్ని

తెలుగులోకి అనువదించి, ఇతర భాషల్లోకి తర్జుమా చేస్తున్న ఏకైక పీఠం కూడా తమదేనన్నారు

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam