DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దావోస్ లో సీఎం ఏమి చెప్తారు? రండి టాక్స్ బాదుతాం అంటారా?

*సీఎం జగన్ పై బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఎద్దేవా*

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మే 24, 2022 (డిఎన్ఎస్):* ముఖ్యమంత్రి జగన్ దావోస్ పర్యటనలో ఏం చెపుతారు? వ్యాట్ తో నడ్డి విరుస్తాము, పన్నులు దంచుతాము మీరు రండి పెట్టుబడులు పెట్టండి అని చెపుతారా? అని బిజెపి ఆంధ్ర ప్రదేశ్

 రాష్ట్ర ఉపాధ్యక్షులు, బిజెపి శాస‌నసభాపక్ష మాజీ నేత పి. విష్ణుకుమార్ రాజు ఎద్దేవా చేసారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ  కేంద్ర ప్రభుత్వం, గత నవంబరు 5న, ఈనెల 21న పెట్రోలు డీజిలు రేట్ల మీద ఎక్సయిజు డ్యూటీ తగ్గించిందని, మిగతా బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్య మంత్రులు వెంటనే వ్యాట్ తగ్గించి

ప్రజలకు సాంత్వన కల్పించారు. కానీ జగన్ గారు మొండిగా వ్యాట్ తగ్గించనన్నారు. లీటరుకు పది రూపాయల వరకూ తగ్గే అవకాశం ఉన్నా ఆయన ససేమిరా అంటున్నారు.
జగన్ గారు పట్టించుకోకపోతే జనం పట్టించుకుని గద్దె దింపుతారన్నారు.

రాజమండ్రిలో అధికార పార్టీ ఎమ్మెల్సీ డ్రైవర్ని  హత్య చేశారు. ఆ సంగతి ఆయనే చెప్పారని ఎస్పీ

వెల్లడించారు. ఇలాటి రౌడీ షీటు, నేర చరిత్ర ఉన్నవాడిని ఏకంగా పెద్దల సభకు పంపారు.. ఇంతకంటే అరాచక పాలన లేదు.
ప్రజా ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచి వేస్తారు. ఎమ్మెల్సీ హత్య చేస్తే కనీసం ఖండించలేదు కానీ,.
నర్సాపురం ఎంపీ రఘురామను ఎందుకు అనర్హుడుగా ప్రకటించలేదని రాజమండ్రి ఎంపి మార్గాని భరత్ ప్రధాని మోదీ ని

నిలదీస్తున్నారన్నారు. అది స్పీకర్ చేతిలో ఉంది కదా? 
మీ ఎపి స్పీకరు విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరం రాజీనామా ఎందుకు ఆమోదించరు?  మోదీని తిడితే ఒప్పుకుంటారా? అనడిగారు. తిట్టి చూడండి తెలుస్తుంది. జోగి రమేష్ జగన్ చెపితే దిల్లి కోట బద్దలు కొడతామన్నారు. ఇదేనా మంత్రి మాటాడే పద్దతి?

ఏపీలో రెండు నెలలుగా కేంద్రం

ఇచ్చిన బియ్యం పేదలకు పంచటం లేదు. ఇది దారుణం. హేయం. పైగా కేంద్రం బియ్యం ఇవ్వటం లేదని దుష్ప్రచారాలు చేస్తున్నారన్నారు. 
2024 లో విపక్ష ఓటు చీలకుండా చూస్తానని పవన్ కల్యాణ్ అనగానే మీకు దడ పుట్టింది. ఒంటరిగా పోటీ చేయమని సవాళ్లు చేస్తున్నారు. భయపడిపోతున్నారు. అమ్మవడి డబ్బులు వేయటం మానేశారు. రకరకాల కారణాలు చూపుతున్నారు.

ఇది అన్యాయం. తల్లులకు డబ్బులు వెంటనే ఇవ్వాలన్నారు.  
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam