DNS Media | Latest News, Breaking News And Update In Telugu

యోగ నరసింహుడే స్వయంగా నడచి వచ్చిన క్షేత్రం సింగరకొండ 

ప్రకాశం జిల్లా శ్రీ కొండ శింగరకొండ యోగానంద లక్ష్మి నృసింహ క్షేత్రం* 

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మే 31, 2022 (డిఎన్ఎస్):* దేవాదిదేవులను సైతం అనుగ్రహించిన ప్రహ్లాద వరదుడు సామాన్య ప్రజలను సైతం అనుగ్రహించాలని యోగ నరసింహుడే తనంతట తానుగా నడిచి వచ్చిన క్షేత్రం

శ్రీకొండ సింగరకొండ. పవిత్రమైన ఆధ్యాత్మిక వాతావరణం లో ఎన్నో ఔషధీ గుణాలు కల్గిన వన సంపద ఉన్న క్షేత్రం ఇది. 

ప్రకాశం జిల్లా లోని కురిచేడు మండలంలో కురిచేడు కు 10 కిలో మీటర్ల దూరంలో ఉన్నబయ్యవరం, పెద్దవరం మరియు దేకనకొండ గ్రామముల కూడలిలో ఉన్న శ్రీ కొండ శింగరకొండ శిఖరాగ్రాన స్వయంభువుడైన శ్రీ యోగానంద

లక్ష్మీనృసింహుడి భక్తులను శతాబ్దాలుగా అనుగ్రహిస్తున్నమహా   మహిమాన్విత క్షేత్రం. తూర్పున  వల్లి దేవసేన సమేత  సుబ్రహ్మణ్యుడు క్షేత్రపాలకుడిగా ఉండగా, పడమటి దిక్కున  వీరాంజనేయుడు అధినాయకునిగా,  ఉత్తరాన గంగమ్మతల్లి శక్తిపాత స్వరూపిణిగా వెలుగొందుతు భక్తులను కొంగు బంగారంగా ఆశీర్వదిస్తున్నారు.

 

ఉత్సవాలు : 
    ప్రతి సంవత్సరం ఫల్గుణ శుద్ధ దశమి నాడు తిరునాళ్ల మహోత్సవాన్ని ప్రధాన ఆలయంలో జరుపుకోవటం ఆనవాయితీ. కొండ పైకి వెళ్లేందుకు ఉన్న మెట్ల దారి అనుకూలముగా లేనందున తిరునాళ్ల రోజు మినహా మిగిలిన రోజుల్లో ధుపదీప నైవేద్యములు, పర్వదినములయందు జరిగే ఉత్సవాలు, మ్రొక్కులు, పూజలు  కొండ క్రిందనే

ముగించుకోవటం జరుగుతున్నది. 

శతాబ్దాల వైభవాన్ని పు దర్శనం కల్పించాలనే మహోన్నత సంకల్పంతో వంశపారంపర్య పీఠాధిపతులు శ్రీమాన్ శేషభట్టర్ స్వామి బృహత్తర పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టటం జరిగింది. 

ఆలయ చరిత్ర:

శతాబ్దాల చరిత్ర సంతరించుకున్న ఈ క్షేత్రంలో ఉత్తరదిక్కునున్న బయ్యవరం

గ్రామస్థుల వంశపారంపర్య పీఠాధిపతులు అయిన శేషభట్టర్ వంశీయులు ఉత్తరదిక్కునుండి పర్వతాన్ని నిత్యమూ అధిరోహించి  పర్వత శిఖరాగ్రాన నెలకొనియున్న శ్రీ స్వామివారిని ప్రతినిత్యమూ ఆరాధించి కిందికి దిగి వచ్చేవారు. 
అయితే రెండవ తరానికి చెందిన కొండమాచార్య శేషభట్టర్ వృద్ధచ్ఛాయలు సంతరించుకున్నందున ప్రతిరోజూ కొండ

ఎక్కిదిగుట భారమై ఒకరోజు శ్రీ స్వామివారిని ప్రార్ధించడం జరిగింది. స్వామీ, నేను వృద్ధాప్యంవలన ప్రతినిత్యమూ  ఇక్కడకు వచ్చిపోవుట భారమైపోతున్నది,  నామీద కరుణతో దీనికి పరిష్కారం చూపుమని ప్రార్ధించారు. 

యోగ నరసింహుడు ఎంతో కరుణతో కొండమాచార్య శేషభట్టర్ కు కలలో సాక్షాత్కరించి  మరునాటి ఉదయం అర్చనాదులు

పూర్తైన అనంతరం నేనూ  నీతోబాటే క్రిందికి దిగిరాగలను. నీవేమీ కష్టయోచన చేయవలదు. 

అయితే పర్వతం దిగుతున్న తరుణంలో ఎన్నిరకాల అవాంతరాలు వచ్చినా వెనుదిరిగి చూడవద్దు, అని ఆదేశించారు. స్వామి ఆదేశం ప్రకారం కొండమాచార్యులు మరుసటి వేకువజామునే పర్వతంపైకి రెట్టించిన ఉత్సాహంతో అధిరోహించినవారై అర్చనాది

కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో ముగించుకుని క్రిందికి దిగివస్తున్నారు. ఈ సమయంలో తన వెనుక ఎవరో తనతోపాటు దిగివస్తున్నట్లు అలికిడి,  ఆ వెనువెంటనే పర్వత శిఖరంపై నుండి పెద్దపెద్ద బండరాళ్లు దొరలివస్తున్నట్లు అనిపించసాగింది. ఇలా కొద్దిసేపు నడిచిన  తర్వాత కొండమాచార్యులుకు మనసులో భయాందోళనలు మొదలయ్యాయి. అయితే

ఆవేదన నిలుపుకోలేని వారై. . . భీతిల్లి ఒక్కసారి వెనుదిరిగి చూచిన వెనువెంటనే ఆ అలజడి మొత్తం ఆగిపోయింది. 

ఆశ్చర్యంగా పై నుండి తొమ్మిది పడగల రూపురేఖల గుర్తులతో "సాలగ్రామశిలా రూపుడైన శ్రీ శ్రీ శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహునితో పాటు  పెద్ద పెద్ద బండరాళ్లు కూడా దొర్లుకుంటూ వస్తుండటం చూసిన వెంటనే అవన్నియూ

మరుక్షణం స్థంభించినట్లుగా ఆగిపోయాయి. అలా ఆగిపోయిన సాలగ్రామశిలారూప నృసింహునికి ఆనాటి ( రెండవతరం ) కొండమాచార్యులవారి ఆధ్వర్యంలో దేవాలయ నిర్మాణం జరిపారు. 

రాళ్లు దొర్లుకుంటూ వస్తూ ఒక్కసారిగా ఆగిపోయిన సాక్ష్యాలకు ఆనవాళ్ళుగా అన్నట్లు ఆ బండరాళ్లు ఆగిన తీరు నేటికీ చూపరులకు దర్శనం కల్గిస్తాయి 
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam