DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శివలింగం అని ముందే తెలిస్తే విరగొట్టేవాళ్ళం: మౌలానా సర్ఫరాజ్ 

*కోట్లాదిమంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్న వేళా. . .*

(DNS రిపోర్ట్: BV సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్, విశాఖపట్నం)  

విశాఖపట్నం, జూన్  01, 2022 (డిఎన్ఎస్):* ఈ దేశం లో హిందువులు నాల్గవ తరగతి పౌరులు అనే విషయం మరొక్కసారి మీడియా సాక్షిగా నిరూపించబడింది. రెండు రోజుల క్రితం ఒక జాతీయ హిందీ ఛానెల్ లో

జ్ఞానావపై మందిరం పై చర్చ జరుగుతున్నప్పుడు ఒక హిందువు ప్రతినిధిని, ముస్లిం ప్రతినిధిగా మౌలానా సర్ఫరాజ్ అహ్మద్ అనే వ్యక్తిని ఆహ్వానించారు. ఈ సందర్భంలోనే కోర్టు ఆదేశంలో తీసిన వీడియోల్లో జ్ఞానవాపి మందిరంలో లభించింది శివలింగమునని ప్రపంచానికి తెలిసింది దీనిపై మీరేమి చెప్తారు అని మౌలానాను అడిగిన సందర్భం లో అతను

చెప్పిన విషయం కోట్లాదిమంది హిందువుల చేతగాని తనాన్ని వెక్కిరించింది. అది శివలింగం అని ముందుగానే తెలిసి ఉంటె. . దాన్ని ముక్కలు చేసేవాళ్ళం (  పెహలే హీ పతా హొతో  శివలింగ   కో తోడ్ దేతే .) అక్కడ నుండి తొలగించేవారని అన్నాడు. దాంతో ఇతర వ్యక్తలు, ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. ఈ దేశంలో కోట్లాదిమంది హిందువుల మనోభావాలను

దెబ్బతీసే విధంగా వ్యాఖ్యానించినందుకు క్షమాపణ చెప్పామన్నారు. యాంకర్ కూడా పలు మార్లు విజ్ఞప్తి చేసాడు. అయినప్పడికి  మౌలానా tana మాటకు కట్టుబడి ఉన్నానంటూ ప్రకటించాడు. 

ఈ మౌలానా సర్ఫరాజ్ రాష్ట్రీయ బంకర్ యాక్షన్ కమిటీ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. ఈ ఘటనపై హిందూ ధార్మిక వర్గాలు మండిపడుతున్నాయి. ఈ దేశంలో హిందువుల

బ్రతుకులు ఎలా ఉన్నాయి అనే విషయం ఈ ఘటన తో బయటపడింది అంటూ సోషల్ మీడియా ద్వారా నేతలపై మండిపడుతున్నారు.  

ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై హిందూ వర్గాలు కోర్టు దృష్టికి తీసుకు వెళ్లే అవకాశం ఉంది. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam