DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అగ్నిపథ్ స్కీం అంత ఆషామాషీగా రాలేదు: జనరల్ కేకే సిన్హా  

*ఒక్కరోజు ఎమ్మెల్యే పెన్షన్ ఉంటుందా? 4 ఏళ్ళ అగ్నివీర్ కు పెన్షన్ ఉండదా?*  

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  
 
*విశాఖపట్నం, జూన్  18, 2022 (డిఎన్ఎస్):* భారత్ దేశ సైనిక శక్తిని అత్యంత బలోపేతం చేసేందుకే అగ్నిపథ్ స్కీం ను ప్రవేశపెట్టినట్టు విశ్రాంత ఆర్మీ అధికారి జనరల్ కేకే సిన్హా

తెలియచేసారు. శనివారం సీనియర్ పాత్రికేయురాలు రిచా అనిరుద్ అగ్నిపథ్ స్కీం పై ప్రజల అనుమానాలను నివృత్తి చేసేందుకు సీనియర్ విశ్రాంత ఆర్మీ అధికారి జనరల్  కేకే సిన్హా, సీనియర్ పాత్రికేయులు దైనిక్ భాస్కర్ డిప్యూటీ ఎడిటర్, రక్షణ రంగ పాత్రికేయులు ముకేశ్ కౌశిక్,.  లతో నిర్వహించిన ఆన్ లైన్ చర్చ గోష్టి

నిర్వహించారు. 

ఈ సందర్భంగా సిన్హా మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా వందలాది మంది నుంచి వచ్చిన సందేహాలను తీర్చారు. ఈ సందర్బంగా జనరల్ సిన్హా మాట్లాడుతూ అగ్నిపథ్ స్కీం ఒక పైలట్ ప్రాజెక్ట్ అని, రానున్న కాలంలో మరింత మెరుగైన ప్రణాళిక ప్రజల ముందుకు వస్తుందన్నారు. తాము గత 40 ఏళ్ళ నుంచి యువకులను సైన్యం లోకి తీసుకోవాలని,

లాటరల్ ఎంట్రీ విధానం ద్వారా ఉన్నత  ర్యాంకుల్లోకి సైన్యం లో అవకాశం కల్పించాడని కోరుతున్నామన్నారు. కార్గిల్ యుద్ధం సమయంలో భారత సైన్యంలో సరాసరి సైనికుల వయసు 35 కి పైగా ఉందన్నారు. అయితే మరింత ఉత్సాహంగా యుద్ధంలో ముందుకు అడుగులు వేయాలంటే 20 నుంచి 25 సంవత్సరాల వయసులో సైనికులు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం అగ్నిపథ్

స్కీం నిర్ణయం అంత సులభంగా రాలేదని, అయితే కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. 
ఇప్పడికే మెడికల్ పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసుకున్న యువకులకు తప్పనిసరిగా వ్రాత పరీక్షలు నిర్వహించి అర్హులను ఉద్యోగం లోకి తప్పని సరిగా తీసుకోవాలన్నారు. దానితో సంబంధం లేకుండా అగ్నిపథ్ స్కీం ను అమలు

చేయాలన్నారు. 

అయితే ఇంతవరకు మెడికల్ పరీక్షలు పూర్తి చేసుకున్న వాళ్ళు 130000 ఉన్నారని, అయితే వీళ్లందరినీ కచ్చితంగా సైన్యంలోకి తీసుకోరన్నారు. వీరిలో మళ్ళీ ఏరివేత ఉంటుందని, భారతీయ ఆర్మీ రంగంలో నియామకాలు అత్యంత కఠిన తరంగా ఉంటాయన్నారు. వాళ్ళల్లో ప్రతి 80 మందిలో కేవలం ఒక్కరే సైన్యంలోకి ప్రవేశిస్తారన్నారు.

  

దైనిక్ భాస్కర్ పాత్రికేయులు మాట్లాడుతూ దేశ సేవ చేసేందుకు కేవలం 17 ఏళ్ళ వయసులో సైన్యంలో చేరే యువకుడు కేవలం 4 ఏళ్ళల్లో తన ఆశలు అడియాసలు అవుతాయంటే. .యువతలో నిరాశ నిస్పృహ వస్తాయన్నారు. అగ్నిపథ్ ద్వారా తీసుకున్న నియామకాల్లో కేవలం 25 శాతం మంది మాత్రమే విధుల్లో ఉంటారని, మిగిలిన వారు ఇంటికి వెళ్ళాలి అంటే. ..

అయితే యువకులు శిక్షణలో చేరిన మొదటి రోజు నుంచే తానూ 4 ఏళ్ళ తర్వాత ఉద్యోగం లో ఉంటానో లేదో అనే భయంతో నాలుగేళ్లు గడిపేస్తారన్నారు. 

వీళ్లందరినీ సైనికులుగానే కొనసాగించాలని, మధ్యలో తొలగించడం ద్వారా యువకుల్లో మానసికంగా కృంగిపోతారన్నారు. తదుపరి ఉద్యోగాలను తిరిగి వెతుక్కోవాలంటే మానసిక స్థైర్యం

చాలదన్నారు. 
కేవలం ఒక్కరోజు ఎంపీ గా ఉన్న, ఒక్కరోజు ఎమ్మెల్యే గా ఉన్న వాళ్ళు కూడా జీవితాలు తరబడి పెన్షన్లు పొందుతున్న ఈ దేశంలో 4 ఏళ్ళ పాటు అగ్నివీర్ గా సైన్యం లో సర్వీస్ చేసిన యువతకు పెన్షన్ ఎందుకు ఇవ్వరు అని ప్రశ్నించారు.  

కార్యక్రమానికి మోడరేటర్ గా వ్యవహరించిన రిచా అనిరుద్ మాట్లాడుతూ భారత

ప్రభుత్వం తీసుకున్న ఈ అగ్నిపథ్ పథకం ఎంతో అద్భుతంగా ఉందని, అయితే వీటిల్లో కొన్ని సవరణలు చెయ్యాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల్లో దేశవ్యాప్తంగా ఈ స్కీం పై  అవగాహనా, ప్రచారం కల్పించిన తర్వాతే అమలు చేయాలన్నారు. సైన్యం లో చేరాలి అనుకునే యువత సంఘ విద్రోహ పనులు చేస్తే. . జీవితాలు కోల్పోతారన్నారు. 

సోషల్ మీడియా

ద్వారా లైవ్ లో జరిగిన ఈ కార్యక్రమం లో సుమారు 2000 మంది పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam