DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారత రాజకీయాలలో కపిలేశ్వరపురం జమీందార్ల పని తీరే వేరు

*ప్రాచీన భారతీయ సంప్రదాయ కళలకు జీవం పోసిన మహనీయులు వీరే*

*నేడు చంటిదొర జయంతి సందర్భంగా డిఎన్ఎస్ ప్రత్యేక కథనం* 

*(DNS Report: P Raja, Burau Chief, Amaravati)*    

*Amaravati, Sept 23, 2022 (DNS Online) :* భారత రాజకీయాలలో ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం లోని జమీందార్ల తీరే ప్రత్యేక స్థానం కల్పించుకుంది.

వేదపాఠశాల, సంప్రదాయ నృత్యం, హరికథ, బుర్రకథ, జానపద సంప్రదాయ కళలు, వంటి ప్రాచీన భారతీయ సంప్రదాయ కళలకు జీవం పోసిన మహనీయుల్లో అగ్రగణ్యులు వీరే. నేటి భారతీయ సమాజంలో సంప్రదాయ కళలకూ జీవనాధారంగా నిలిచినా జమిందారీ సంస్థానాల్లో కపిలేశ్వరపురం ఒకటి. 
సెప్టెంబర్  23 న చంటిదొర జయంతి సందర్భంగా డిఎన్ఎస్ ప్రత్యేక కథనం

అందిస్తున్నాం.  

గ్రామా స్థాయి నుంచి కేంద్ర మంత్రి స్థాయి వరకూ అన్ని స్థాయిల్లోనూ సేవలు అందించిన ఘనత వీరిదే. ఇంటి పేరు లోనే శ్రీ కలిగిన శ్రీ బలుసు ప్రభాకర బుచ్చి కృష్ణ ( SBPBK ) సత్యనారాయణరావు (చంటిదొర) 1999 లో కేంద్ర వ్యవసాయ సహకమంత్రిగా పనిచేసేవారు. కపిలేశ్వరపురం .అక్కడ హరికధ,వేద పాఠశాలలు .అయదు ఎకరాలలో పెద్ద

బంగ్లా అది.అనేక సినిమా షూటింగ్ లు జరిగాయి. 
మధ్యలో నెమళ్లు, అరుదైన పక్షులు తో ఎంతో ఆహ్లాదకరంగా ఉంది.ఆ బంగ్లాలో పదుల సంఖ్యలో పనివాళ్ళు కు ఉపాధి. జమీందారీ వ్యవస్థ అంటే అప్పుడే అర్ధం అయింది.

 ఇక ఆయన రాజకీయ విషయానికి వస్తే పన్నెండు ఏళ్లు ZP ఛైర్మన్‌ గాను,మరో పన్నెండేళ్ళు ఎమ్మెల్సీ గాను పనిచేసారు.శ్రీశైలం

దేవస్థానం చైర్మెన్‌గా, భారత షుగర్ ఫ్యాక్టరీ యజమానులు అసోసియేషన్ అధ్యక్ష పదవులను చేపట్టారు.   ప్రత్యక్ష ఎన్నికలు మాత్రం ఆయనకు అంతగా కలిసి రాలేదు.చంటిదొర అన్నయ్య పట్టాభిరామారావుగారు పామర్రు నియోజక వర్గం నుంచి వరసుగా మూడుసార్లు ఎమ్మెల్యేగాను రాష్ట్ర మంత్రిగాను,రాజమండ్రి పార్లమెంటుకు వరసగా మూడుసార్లు

ఎంపిగాను కేంద్రమంత్రిగాను పనిచేసినప్పటికీ ఈయన మాత్రం ఎంపి 1999లోనే( బిజెపి,టిడిపి పొత్తులో) గెలవగలిగారు.

            ఇప్పటి మాదిరిగా ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావులేకుండా పదవులు చేపట్టడమే కాకుండా ఎందరికో ప్రభుత్వ, ప్రవేటు ఉద్యోగాలు ఇప్పించిన ఘనత చంటిదొరకే దక్కుతుంది.అంతేకాదు ఈ జమిందారీ సోదరుల

ఎన్నికల ప్రచారాలు చాలా విచిత్రంగా ఉండేవి.ఎంపిగా,ఎమ్మెల్యే గా వరసగా మూడుసార్లు చొప్పున గెలుచిన పట్టాభిరామారావు ఎన్నికల ప్రచారానికి వెల్లేవారుకాదంట. నాకు ఓటు వేయవద్దు అమ్మ(ఇందిరా గాంధీ) మీకు కావాలంటే ఓటేయండని చెప్పేవారంట.మండలానికి నలుగురైదుగురు నాయకులు మాత్రమే ఈ సోదరులకు పరిచాయాలుండేవి వారితోనే ఎన్నికలు

నడిపించేసేవారు.ఎడ్లబండి వేసుకుని కపిలేశ్వరపురం అభ్యర్థి ఇంటికి గ్రామ పెద్దలు వెళ్లే వారు.ఎన్నికల తేదీ, గుర్తు ప్రచారనికి నీలి మందు,గోడలపై వేయడానికి రేకు ఇచ్చి పంపేవారంట.ఆ తర్వాత నాలగైదు గ్రామాల పెద్దలను ఒక గ్రామానికి రమ్మని అక్కడ ఈ అభ్యర్థులు వచ్చే వారు. అయితే తర్వాత రోజుల్లో అభ్యర్థులైన వీరిని చూడాలని చాలా

మంది పట్టుపట్టే వారంట.దీంతో ఎవరో పెద్దాయనకు తలపాగా చుట్టి జీప్ లో ఆయనే అభ్యర్థిగా ప్రచారం చేసే వారు. అప్పట్లో టివీలు లేవు,పత్రికలు ఊరికి ఒకటి వస్తే గొప్ప. ఇక ఫేస్‌బుక్ లు,వాట్సప్ లు వంటి సామాజిక మాధ్యమాలు అసలే లేవు. అందుకే ఆరోజుల్లో అలా రాజకీయాలు సాగిపోయేవి.ఇప్పుడు అయితే అభ్యర్థులు బోలెడంత డబ్బు ఖర్చు పెట్టడమే

గాక ఎన్నికల ప్రచార సమయంలో చేయరాని పనులన్నీ చేస్తున్నారు ఓటర్లను ఆకట్టుకోవడానికి.అయినా గెలుపు గ్యారంటీ లేదు.

 వీరికి చెందిన షుగర్ ఫ్యాక్టరీ, గోల్డ్ స్టాట్ వంటి కంపినీల ఉద్యోగులు ఎన్నికలలో కీలకపాత్ర పోషించేవారు.ఎలాంటి అవినీతి మరకలు లేకుండా వీరు పాలన అందించే వారు. అటువంటి మహనీయడు మన మధ్య లేకపోయిన చేసిన

మంచి పనులు స్థిరస‍్థాయిగా నిలిచిపోతాయి.
  చంటిదొర 1921 సెప్టెంబరు 23న జన్మించారు.2011జనవరి 21న మరణించారు. ఆయన జయంతి సందర్భంగా ఆయనతో నాకున్న చిరు జ్ఞాపకం ఇది...

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam