DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ ఏసీబీ పనితీరు భేష్ : రాష్ట్ర డిజిపి ఆర్ పి ఠాకూర్ 

విశాఖపట్నం, :ఆగస్టు 14, 2018  (DNS  Online ): అవినీతి నిరోధక శాఖ విభాగం - విశాఖ కేంద్రం పనితీరు ఆంధ్ర ప్రదేశ్ లోని ఇతర జిల్లాలోకెల్లా తనితీరు భేష్ à°—à°¾ ఉందని ఆంధ్ర ప్రదేశ్

రాష్ట్ర పోలీసు డైరక్టర్ జనరల్ ఆర్ పి ఠాకూర్ అభినందించారు. మంగళవారం విశాఖపట్నం కు వచ్చిన అయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విశాఖపట్నం ఏసీబీ కార్యాలయం లో 5

కెవి సామర్ధ్యం కల్గిన సోలార్ పవర్ ప్లాంట్ ను అయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ సంప్రదాయ విద్యుత్ ను స్వయంగా ఏర్పాటు చేసుకోవడం మంచి పరిణామమన్నారు.

విశాఖపట్నం ఏసీబీ విభాగాన్నీ మరింత పటిష్టం చేసి, ఆధునిక పరిజ్ఞానం మెరుగుపరుచుకునేందుకు, సమీపం లో ఆధునిక వసతులతో à°’à°• పార్కు నిర్మాణానికి  à°•à±‹à°Ÿà°¿ రూపాయలు

విడుదల చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియచేసారు. విశాఖ నగరం లోని పాత డైరీ ఫార్మ్ సమీపంలోని రూరల్ ఎం ఆర్ ఓ కార్యాలయం వద్ద గల ఏ సి బీ కార్యాలయం వద్ద నూతన

వసతులతో కూడిన పార్కు నిర్మాణానికి అయన శంఖుస్థాపన చేశారు. ఈ పార్కు ఈ ప్రాంత వాసులకు ఉదయం, సాయంత్రం వేళల్లో నడకకు, యోగ సాధనకు ఉపయోగపడుతుందన్నారు. విశాఖ భూ

కుంభకోణాలపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక విచారణ కమిటీ ( సిట్ ) రూపొందించిన నివేదిక ప్రభుత్వం దగ్గరే ఉందని, దానిపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు

వచ్చిన వెంటనే చర్యలను చేపట్టేందుకు పోలీసు విభాగం సిద్ధంగా ఉందని పోలీస్ బాస్ తెలిపారు. రాష్ట్రం లో ప్రముఖులకు రక్షణ వాహనాలు తగ్గించడం వలన ప్రజలకు ట్రాఫిక్

సమస్యల ప్రభావం తగ్గిందన్నారు. వనం మనం కార్యక్రమం లో భాగం à°—à°¾ పోలీసు విభాగం తరపున 10  à°²à°•à±à°·à°²à± మొక్కలు నాటుతామని హామీ ఇచ్చామని, ఇప్పడికే 80  à°¶à°¾à°¤à°‚ కు పైగా మొక్కలు

నాటామన్నారు. ఏసీబీ విభాగం భాగస్వామ్యం కూడా అధికంగానే ఉందని తెలిపారు. 
ఈ కార్యక్రమం లో విశాఖ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, నగర పోలీసు కమిషనర్ మహేష్ చంద్ర

లడ్డా, డి ఐ జి శ్రీకాంత్, విశాఖ రురల్ ఎస్ పీ రాహుల్ దేవ్ శర్మ , విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం శాసన సభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు, ఏసీబీ అధికారులు

పాల్గొన్నారు. 

 

 

#dns  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #dnsnews  #dns news  #vizag  #visakhapatnam  #acb  #dgp  #rp thakur #park

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam