DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జనసేనాని సంయమనం ప్రసంగం లో ఇదే కీలకమైన ట్విస్ట్ ..

*బీజేపీ తో కటీఫ్ ఒకే, జనసేన కి టీడీపీతో పొత్తు ఉందని చెప్పారా?*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

*విశాఖపట్నం మార్చి 14, 2023 (డిఎన్ఎస్ ):* జనసేన ఆవిర్భావ సభలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగంలో ప్రత్యర్థి పార్టీలకు, విమర్శకులకు స్పష్టమైన సమాధానం దొరకని అంశం అయన తదుపరి ఎన్నికల్లో

పోరాటం ఎలా ఉంటుంది. ఇంతకాలం పొత్తులో ఉన్న భారతీయ జనతా పార్టీ తో కటీఫ్  చెప్పేసారు. అంతే తప్ప తెలుగుదేశం పార్టీ తో పొత్తు ఉంటుంది అని మాత్రం ఎక్కడా ప్రకటించలేదు. అయితే అత్యంత చాకచక్యంగా అధికార పార్టీని కాంఫుసే చేసే విధంగా మీరు అనుకున్నది జరగదు అన్నారు తప్ప, తెలుగుదేశం తో దేశం పార్టీలో జత కడుతున్నాం అని మాత్రం

చెప్పలేదు. అసలు తెలుగుదేశం పేరు ఎక్కడా ప్రస్తావనే లేదు. 

అయితే ఈ వ్యాఖ్య పై ఇటు జనసేన పార్టీ వర్గాల్లోనూ, అటు ప్రత్యర్థి పార్టీల ప్రతినిధుల్లోనూ ఎవరికీ తోచిన భాష్యాలు చెప్పుకునే అవకాశం పవన్ కళ్యాణ్ ఇచ్చినట్టుగా ఉంది. 

ఇప్పుడిప్పుడు శాసన సభ ఎన్నికలు జరిగే అవకాశం లేనందున హడావిడి పొత్తుల

గురించి ఇప్పుడే ఎందుకు ప్రకటించడం అనే భావనలో ఉండి ఉండవచ్చు. అయితే విశ్లేషకుల్లో ఇంతకాలం వినిపించిన ఊహాగానాలకు తగినట్టుగా పవన్ ఎటువంటి స్పష్టమైన ప్రకటన చెయ్యక పోవడంతో దీనిపై విస్తృత ప్రకటనలు సోషల్ మీడియాల్లో, మీడియా వార్తల్లో ఎవరికీ తోచిన వ్యాఖ్యలు చేసేస్తున్నారు. 

అయితే ప్రకటన చెయ్యవలసిన జనసేన

కేంద్ర కమిటీ ప్రతినిధులు గానీ, తెలుగుదేశం పార్టీ కమిటీ ప్రతినిధులు గానీ ఎటువంటి కచ్చితమైన ప్రకటన పొత్తు పై చెయ్యక పోవడం గమనార్హం. 

ఇటు వర్గాల మధ్య సమావేశాల తదుపరి, సంయుక్త ప్రకటన అనంతరమే అధికారిక పొత్తులు వెల్లడించడం జరుగుతుంది. అంతవరకూ ఎవరి ఊహాగానాలు వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు.  

ఈ పొత్తు

పై పూర్తి ప్రకటన 2024 ఎన్నికల కు ముందు మాత్రమే వెల్లడి అయ్యే అవకాశం ఉంది. 

అయితే పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం అధికార పార్టీ తో సహా కుహనా విశ్లేషకులను, సోషల్ మీడియా ప్రచారకులను కంగాళీ చెయ్యడం కోసం చేసిన ప్రయత్నంగా చెప్పుకోవచ్చు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam