DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సాగర తీరంలో ఉత్సాహంగా జి 20 వైజాగ్ సిటీ మారథాన్ నిర్వహణ

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

*Visakhapatnam, Mar 22  2023 (DNS Online ):* విశాఖపట్నం వేదికగా ఈ నెల తేదీ 28 మరియు 29 లలో జరగబోవు జి20 సదస్సు నిర్వహణలో భాగంగా జన్ భాగీదారి పేరిట ప్రజలను భాగస్వామ్యం చేస్తూ, అవగాహన పెంపొందించుకునే కార్యక్రమాల సందర్భంగా ఆదివారం ఉదయం ఆర్ కె బీచ్ నుండి 3కె , 5కె, 10కె దూరం గల మారథాన్ పరుగును

 తేదీ.26-03-2023 ఆదివారం ఉదయం 6 గంటలకు నిర్వహించారు. ముందుగా రాష్ట్ర మంత్రులు విడదల రజని, గుడివాడ అమర్నాథ్, ఆదిమూలపు సురేష్, నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లిఖార్జున, జివిఎంసి  కమిషనర్ పి. రాజాబాబు, పోలీస్ కమిషనర్ సి.హెచ్. శ్రీకాంత్ తదితరులు జెండా ఊపి 3కె, 5కె మరియు 10కె దూరం గల మారథాన్

పరుగులను ప్రారంభించారు. అనంతరం విహాంగ్ ఎడ్వెంచర్స్ వారు ఏర్పాటు చేసిన పార మోటార్ ఎయిర్ సఫారీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ, విశాఖ నగరంలో జరుగనున్న జి20 సదస్సు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు వైజాగ్ సిటీ మారథాన్ పరుగును నిర్వహించడమైనదన్నారు. ఈ సదస్సుకు దేశవిదేశాల నుండి 200 మంది

పైగా ప్రతినిధులు రానున్నందున విశాఖ నగరంలో సుందరీకరణ పనులు చేపట్టి ఈ నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దడమైనదన్నారు. విశాఖ నగరం లో జి20 సదస్సు జరుగుటవలన అంతర్జాతీయ స్థాయిలో విశాఖ నగరానికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుందన్నారు.

అనంతరం మున్సిపల్ శాఖా మాత్యులు ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ, జి20 సదస్సు విశాఖ

నగరంలో జరుగనందున రాష్ట్రంలో విశాఖ నగరానికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల అవగాహన కొరకై, ప్రజలను భాగస్వామ్యం చేస్తూ జన్ బాగీదారి పేరున G20 సదస్సుకు ముందస్తుగా యోగా, కైట్ ఫెస్టివల్, బోట్ రేసింగ్, మాక్ కాంక్లేవ్, వైజాగ్ సిటీ మారథాన , వైజాగ్ కార్నివాల్ తదితర కార్యక్రమాలను నిర్వహించడం

జరుగుచున్నాయన్నారు.

అనంతరం విశాఖ జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు విడదల రజిని మాట్లాడుతూ, జి20 సదస్సు విశాఖ జిల్లాలో నిర్వహించడం, తద్వారా విశాఖ నగరంలో ప్రజలందరికీ ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు, అందరికీ మంచి నివాసిత ప్రదేశంగా ఈ నగరాన్ని తీర్చిదిద్దడం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి

ఆశయమని, ఈ సదస్సు సందర్భంగా నగరంలో శాశ్వతంగా పలుచోట్ల, సముద్ర తీర ప్రాంతం అభివృద్ధి, సుందరీకరణ పనులు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు.

అనంతరం నగర మేయరు గొలగాని హరి వెంకట కుమారి మాట్లాడుతూ, ఈ కార్నివాల్ లో వేల సంఖ్యలో విశాఖ నగర ప్రజలు పాల్గొనడం చాలా ఆనందగా ఉందన్నారు. జి20 సదస్సు

నిర్వహిస్తున్న సందర్భంగా విశాఖ నగరాన్ని సుందరీకరించి, ప్రజలు భాగస్వామ్యం చేస్తూ, దేశ విదేశాల నుండి వచ్చే ప్రతినిధులు ఆకట్టుకునేలా ఈ విశాఖ నగరాన్ని మరింత సుందరీకరణ పనులు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగినదన్నారు.

అనంతరం వైజాగ్ సిటీ మారథాన్ 3, 5 & 10 కిలోమీటర్ల పరుగులో విజయo సాధించిన విజేతలకు

మూడు క్యాటగిరిలలో మొదటి, రెండు, మూడు బహుమతులను, ప్రశంసా పత్రాలను రాష్ట్ర మంత్రులు గుడివాడ అమర్నాథ్, ఆదిమూలపు సురేష్, విడదల రజిని, గౌరవ మేయర్ గొలగాని హరి వెంకట్ కుమారి అందించి అభినందించారు.

ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లికార్జున, జివిఎంసి కమిషనర్ పి.రాజాబాబు, పోలీస్ కమిషనర్ సి.హెచ్.

శ్రీకాంత్, జివిఎంసి ప్రధాన ఇంజనీర్ రవికృష్ణ రాజు, అదనపు కమిషనర్లు వై శ్రీనివాసరావు, డాక్టర్ వి సన్యాసిరావు, ఎస్ఎస్ వర్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam