DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టీటీ ప్లేయర్ నైనా జైస్వాల్ కు నన్నయ వర్సిటీ నుంచి పిహెచ్.డి పట్టా 

*దేశంలో 22 ఏళ్లకే పిహెచ్.డి  పొందిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డు*

*DNS Report : P. Raja, Bureau Chief, Amaravati*   

*అమరావతి, ఏప్రిల్ 20, 2023 (డిఎన్ఎస్  DNS Online ):*  ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరం నుండి అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ 22 సంవత్సరాల వయస్సులో పిహెచ్‌డి డిగ్రీ పూర్తి చేసిన

భారతదేశంలోనే మొదటి వ్యక్తిగా నిలిచారు. గవర్నర్ కార్యలయంలో పిహెచ్.డి అవార్డును ఆంధ్రప్రదేశ్ గవర్నర్, ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఛాన్సలర్ అబ్దుల్ నజీర్ అందజేసి నైనా జైస్వాల్ ను అభినందించారు. ఈ సందర్భంగా నైనా జైస్వాల్ మాట్లాడుతూ "భారతదేశంలో 22 సంవత్సరాల వయస్సులో డాక్టరల్ డిగ్రీ, PhD పొందిన అతి పిన్న వయస్కురాలిగా

మరియు మొట్టమొదటి అమ్మాయిని అయినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించి మహిళా సాధికారతలో మైక్రోఫైనాన్స్ పాత్రపై అధ్యయనం. అనే అంశంపై నన్నయ విశ్వవిద్యాలయ పూర్వ ఉపకులపతి ఆచార్య ముర్రు ముత్యాలు నాయుడు మార్గదర్శకంలో విజయవంతంగా పరిశోధనను పూర్తి చేసానని అన్నారు. పిహెచ్.డి

అవార్డుకు సహకరించిన గవర్నర్ అబ్దుల్ నజీర్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ కె.హేమచంద్రరెడ్డి, నన్నయ వీసీ జి.వి.ఆర్.ప్రసాదరాజు, గైడ్ ముర్రు ముత్యాలు నాయుడు, కోగైడ్ ఎస్.టేకి, రిజిస్ట్రార్ ఆచార్య టి.అశోక్ మరియు నన్నయ విశ్వవిద్యాలయ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. 
అలాగే ఇటువంటి విజయ

ప్రస్థానం తనకు 8 సంవత్సరాల వయస్సులో ప్రారంభమైందన్నారు. నేను లండన్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి 8 సంవత్సరాల వయస్సులో 10వ తరగతి పూర్తి చేసిన ఆసియాలో అతి పిన్న వయస్కురాలుగా, 10 సంవత్సరాల వయస్సులో ఇంటర్మీడియట్ పూర్తి చేసి, 13 సంవత్సరాల వయస్సులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి భారతదేశంలో పిన్న వయస్సులో

పట్టభద్రుడయ్యానని తెలిపారు. ఆ తర్వాత ఎంఏ పూర్తి చేసి ఆసియాలోనే అతి పిన్న వయస్కురాలిని అయ్యానని చెప్పారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరంలో 16 సంవత్సరాల వయస్సులో పిహెచ్.డి ప్రవేశం పొందానని, ప్రస్తుతం 22 ఏళ్ళ వయస్సులో విజయవంతంగా పిహెచ్.డి పూర్తి చేసానని తెలిపారు. 
మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ పరిశోధన

చేసానని, స్వయం సహాయక బృందాలు మరియు మైక్రోఫైనాన్స్‌కు సంబంధించిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించానని చెప్పారు. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన మరియు మహిళా సాధికారత పరంగా మైక్రోఫైనాన్స్ పాత్ర మరియు ప్రాముఖ్యత చాలా ముఖ్యమైనదని తెలియజేసారు. చిన్నప్పటి నుంచి మంచి పౌరుడిని

కావాలని కోరుకునేదాన్ని, చదువు పరంగా ఇప్పుడు పీహెచ్‌డీ పూర్తి చేసినందున సివిల్‌ సర్వీసెస్‌కి వెళ్లాలన్నది నా తదుపరి ఆశయమని అన్నారు. క్రీడలకు సంబంధించి, నేను ప్రస్తుతం నా క్రీడా కెరీర్‌పై ఎక్కువ దృష్టి సారిస్తున్నాను. నేను అనేక అంతర్జాతీయ టోర్నమెంట్‌లు మరియు కామన్వెల్త్ గేమ్స్‌లో కూడా

పాల్గొనాలనుకుంటున్నానని తెలియజేసారు. నైనా జైస్వాల్ పీహెచ్‌డీకి గైడ్ పూర్వ ఉపకులపతి ఆచార్య ముర్రు ముత్యాలు నాయుడు మాట్లాడుతూ ఆదికవి నన్నయ యూనివర్శిటీకి వైస్ ఛాన్సలర్‌ గా పని చేస్తున్నప్పుడు ఒక మీటింగ్‌లో నైనా జైస్వాల్‌ని కలిశానని, అప్పటికే ఆమె చాలా చిన్న వయస్సులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిందని ఆమె

చెప్పినప్పుడు ఆశ్చర్యపోయానన్నారు. ఆమె ఇంకా పరిశోధన చేయాలనే ఆసక్తిని వ్యక్తం చేసిందని వెంటనే ఆమెకు నన్నయ యూనివర్సిటీలో చేరమని ప్రతిపాదన చేశాను. ఆమె తన తల్లిదండ్రులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. తరువాత రోజు విశ్వవిద్యాలయానికి ఆహ్వానించి అధికారులతో చర్చించి ప్రత్యేక అడ్మిషన్ ఇవ్వాలని

నిర్ణయించుకున్నామని తెలిపారు. 
పరిశోధనకు గైడ్ మరియు సూపర్‌వైజర్‌గా ఉండి దాదాపు నాలుగు లేదా ఐదు సంవత్సరాలు ఆమెకు మార్గనిర్దేశం చేసానని చెప్పారు. చాలా మంచి టాపిక్‌ని ఎంచుకుని ప్రత్యేక శ్రద్దతో పరిశోధనను చేసి అద్భుతమైన పుస్తకాన్ని రూపొందించారని చెప్పారు. ఇటీవల ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో నిష్ణుతులైన

మేనేజ్మెంట్ ఆచార్యుల సమక్షంలో పిహెచ్.డి వైవా ను నైనా సడ్మిట్ చేసారని తెలిపారు. తన మార్గదర్శకంలో భారతదేశంలోనే అతిపిన్న వయస్సులో పరిశోధన పూర్తి చేసిన తొలి అమ్మాయి నైనా జైస్వాల్ కావడం, ఆమెకు తాను గైడ్ గా ఉండటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. నైనా మరిన్ని రికార్డులను సొంతం చేసుకోని భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి,

ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అలాగే నైనాను స్పూర్తిగా తీసుకొని యువత అన్ని రంగాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నైనా తల్లిదండ్రులు అశ్విన్ కుమార్ జైస్వాల్, భాగ్యలక్షి, తమ్ముడు అగస్త్య పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam