DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ కి లక్షల కోట్ల పధకాలు ఇచ్చాం.. అయినా ఓట్లు వెయ్యట్లేదు: బీజేపీ మండిపాటు

*ఆంధ్ర జనం పై, మీడియా పై బీజేపీ కార్యదర్శి సత్యకుమార్ అసహనం,* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

*విశాఖపట్నం, మే 31, 2023 ( DNS Online):* తమకు ఒక్క ఓటు కూడా వెయ్యక పోయినా ఆంధ్ర ప్రదేశ్ కు లక్షల కోట్ల విలువ చేసే ప్రాజెక్ట్ లు, కేంద్ర పథకాలు అందించామని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి వై. సత్య కుమార్ ఆవేదన

వ్యక్తం చేసారు. బుధవారం విశాఖ నగర పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ బీజేపీ కేంద్రం లో అధికారం లోకి వచ్చి 9 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్రం ఆంధ్ర ప్రదేశ్ 2014 నుంచి నేటి వరకూ అందించిన వనరులు, కేంద్ర పథకాలు, ఉచిత బియ్యం, ఇల్లు, గ్యాస్ కనెక్షన్లు, బాలికలు, మహిళలకు వివిధ పథకాలు,

రైతుల బీమా, ముద్ర రుణాలు, సహా విద్యార్థులకు జాతీయ స్థాయి విద్య సంస్థలు, ఎన్నో ఇచ్చామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ రహదారులను కలుపుతూ 6 లైన్ల అధునాతన రోడ్లను వేయడం జరిగిందన్నారు. భారత ప్రధాని గా నరేంద్ర మోడీ భాద్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకూ అన్ని రాష్ట్రాల కంటే అధికంగానే ఆంధ్ర ప్రదేశ్ ప్రదేశ్ కు నిధులు

ఇచ్చారన్నారు.  
తమ పార్టీకి కనీసం ఒక్క సీటు కూడా గెలిపించక పోయినా బీజేపీ ఎటువంటి పక్షపాతం చూపించలేదన్నారు. బీజేపీ ఏనాడూ ఉచితాల పేరిట రాష్ట్రాలను అప్పుల పాలు చెయ్యదన్నారు. నేడు ఆంధ్ర ప్రదేశ్ లో లక్షల కోట్లు అప్పులు పేరుకు పోయి ఉన్నాయని, వాటి ఋణం ప్రతి పౌరునిపై పడుతుందన్నారు. 
దీనికి కేంద్రం ఏమాత్రం భాద్యత

వహించాడన్నారు. 

ఉచితాలు, పధకాలు, డబ్బుల పంపిణీ పేరుతొ లక్షల కోట్లు అప్పులు చేసిన రాష్ట్ర పాలకులు దీనికి భాద్యత వహించాలన్నారు. 

మీడియా పై ఆగ్రహం.. . .:

కేంద్రం ప్రభుత్వం ఏపీ కి ఎన్ని లక్షల కోట్ల నిధులు విలువ చేసే పధకాలు, ప్రాజెక్ట్ లను ఇచ్చినా స్థానిక మీడియా వాటిని ప్రచారం చెయ్యడం లో

ఘోరంగా విఫలం చెందిందన్నారు. పార్టీలకు అతీతంగా వార్తలు వ్రాయవలసి పత్రికలూ కేవలం కొన్ని పార్టీలకే కొమ్ముకాస్తున్నాయన్నారు. తమ పార్టీకోసం వార్తలు వ్రాసే పత్రికలే లేకపోవడం బాధాకరం అన్నారు. 

ఈ సమావేశంలో బీజేపీ ఏపీ ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam