DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అభివృద్ధి కి కృషి చేసాం - ఆశీర్వదించండి: ఆంధ్ర కు అమిత్ షా వినతి

*2024 ఎన్నికల్లో ఏపీ నుంచి బీజేపీ కి 20 సీట్లు గెలిపించండి.*

*విశాఖ వేదిక నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ ను దుమ్మెత్తిపోసిన షా* 
 
*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

*విశాఖపట్నం, జూన్  11, 2023 ( DNS Online):* దేశ వ్యాప్తంగా చేస్తున్న అభివృద్ధి కంటే అధికంగా ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నో లక్షల నిధులతో అభివృద్ధి

పథకాలు అమలు చేశామని, రానున్న ఎన్నికల్లో 20 ఎంపీ సీట్లల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా ఏపీ ప్రజలను కోరారు. నరేంద్ర మోడీ 9 ఏళ్ళ పాలనలో అభివృద్ధి పై మహాజన సంపర్క్ అభియాన్ పేరిట విశాఖపట్నం లో ఆదివారం జరిగిన బహిరంగ సభలో అయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర

ప్రదేశ్ కు 2014 లో మోడీ ప్రధానిగా భాద్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకూ ఇచ్చిన పథకాలు, నిధులు, ప్రోజెక్టుల ఏర్పాట్లు పూర్తి స్థాయి లో వివరించారు. ఈ క్రమంలో ప్రస్తుత అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరిని పూర్తిగా ఆ ఎండగట్టారు. రాష్ట్రంలో భూదందాలు, అక్రమార్జనలు, మద్యం మాఫియా, గంజాయి మాఫియా, తదితర అక్రమార్జనలపై

విరుచుకు పడ్డారు. 

అమిత్ షా ప్రస్తావించిన ప్రధాన అంశాలు : 

గత కాంగ్రెస్ పాలనలో రూ. 12 లక్షల కోట్ల అవినీతి జరిగింది.

జగన్మోహన్ రెడ్డి 4ఏళ్లలో అవినీతి ఆరోపణలు, కుంభకోణాలు తప్ప ఏమీలేవు.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతు ల సంక్షేమ ప్రభుత్వం నడుపుతున్నామని చెపుతుంది. కానీ ఇక్కడ

జరుగుతున్నా రైతుల ఆత్మహత్యల విషయం లో దేశంలోనే ఆంధ్ర ప్రదేశ్ మూడో స్థానం లో ఉంది.
రైతుల ఆత్మహత్య లపై జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాలి.
దేశ పేదలకి నరేద్రమోడీ ఉచిత బియ్యం ఇస్తే దాని పై జగన్ మోహనరెడ్డి ఫొటో వేసుకుంటున్నారు.
రూ. 10 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చాము అ అభివృద్ధి ఎక్కడ కనపడుతుంది....
ఆంధ్ర ప్రదేశ్ కి

కేంద్రం రెండు వందేభారత్ ఎక్సప్రెస్ ట్రైన్ లను ఇచ్చాము
విభజన హామీల్లో ప్రకటించిన వాటి కంటే ఎక్కువగా జాతీయ విద్య సంస్థలను ఆంధ్ర కు కేటాయించామన్నారు. విశాఖలోనే ఐఐఎం గత 7 ఏళ్ళ నుంచి నడుస్తోందన్నారు. 

సభలో రాజ్యసభ సభ్యులు జివిఎల్ నర్సింహారావు అమిత్ షా హిందీ లో చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం చేసారు.

సభలో ఎంపీ సీఎం రమేష్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి పురందేశ్వరి, ఏపీ అధ్యక్షులు somu వీర్రాజు, ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పివిఎన్ మాధవ్, నగర అధ్యక్షులు మేడపాటి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam